Navalalu

నవలలు

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.
Jeevana Raagam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

Jeevana Raagam

Veturi Sundara rama murthy

తెలుగు సినీ సాహిత్యాన్ని మూడు దశాబ్దాల పాటు ఏలినవాడు తన ఇరవైమూడవ ఏట ఆలపించిన ఏకైక ‘నవలా’ రాగం అది. దీన్లోని కథ విషయానికి వస్తే రఘు పేరు మోసిన సంగీత దర్శకుడు. విపరీతమైన పని వత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తను అభిమానించే, తనని ఆరాధించే గాయని రాగిణి సూచన మేరకు, విశ్రాంతి కోసం నాగార్జునకొండ సమీపం లోని అటవీ ప్రాంతానికి వెళతాడు. ఒకరోజు ఆ కొండకోనల్లో సంచరిస్తూ ఉండగా దారి తప్పుతాడు. అప్పుడు సుగాలీ జాతి బృందం ఒకటి తారస పడుతుంది. ఆ బృంద నాయకుడి ఆదేశం మేరకు రాజులు అనే యువకుడు వెంట రాగా గూడేనికి చేరుకుంటాడు. ఆ ప్రయాణంలో రాజులు మీద రఘుకు అభిమానం ఏర్పడుతుంది. గూడెం వాసులలో నాయకుని కూతురు రజని రఘు మనసు దోచుకుంటుంది. అయితే అప్పటికే ఆమె, రాజులు ప్రేయసీ ప్రియులు. ఇది తెలియని రఘు రజనితో కొద్దిగా శృతి మించుతాడు. ఈ విషయం గూడెం నాయకుడికి తెలుస్తుంది. అసలే నియమాల విషయంలో కఠినంగా ఉండే నాయకుడు, అప్పుడేం చేశాడు. మధురాతి మధురమైన భావనలతో రచయిత ఈ కధకి, ఇచ్చిన మనోహరమైన ఆ ముగింపు ఏమిటి? 1959లో ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ఉదయరాగాలను అలంకరించుకుని పాఠకుల అభిమానాలను అందుకున్న వేటూరి గారి ఆ జీవనరాగం, 1970లో నవలా రూపంలో స్వతంత్రమై, ఇప్పుడు వారి కుమారుడు శ్రీ వేటూరి రవి ప్రకాష్ గారి సౌజన్యంతో మీ ముందుకు శ్రవణ రూపంలో వస్తున్నది. వినండి. జీవనరాగం - నవల. శ్రవణానువాదం గళం: కొండూరు తులసీదాస్.
Sri Veturi Sundarama Murthy is a legendary Lyricist. At 23 years of age, he wrote his first and only novel, Jeevana Raagam. Listen to the audio version of the novel.
Price in App
0
Chapters / Episodes
17
Rating
5.00
Duration
02:39:24
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu