CP-Brown-Potee

సి పీ బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ 2018 కి స్వాగతం

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారికి పాఠం చెప్పే తెలుగు ఉపాధ్యాయులు, ఇంకా వారి పాఠశాల కూడా రూ. 30,000 వరకూ నగదు బహుమతులు,  సత్కారాలు,  ప్రశంసా పత్రాలు గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.

‘తెలుగు లలిత కళా వేదిక’ గా దాసుభాషితం, తెలుగు వారి కోసం సంగీత, కవిత్వ, నవల, కథల భాండాగారాన్ని ఆడియోద్వారా అందిస్తూ వస్తున్నదన్న విషయం చాలామందికి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలలోని పదవ తరగతిలో ఉన్న బాల, బాలికలలో తెలుగు భాష మీద మమకారాన్ని మరింత పెంపొందించడానికి ఏదైనా చెయ్యాలని అనిపించి,  ఒక  వినూత్న కార్యక్రమం చేపట్టాం. తెలుగు వారు సదా స్మరించుకోవలసిన ఒక మహనీయుడి పేరు మీద పోటీ నిర్వహిస్తే బాగుంటుందని అనిపించింది.

విదేశీయుడై ఉండి,  ఉద్యోగరీత్యా భారత దేశానికి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడమే కాకుండా, అందులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేసిన ఆంగ్లేయుడు, సి.పీ.బ్రౌన్.  ఆయన తెలుగు భాషా సాహితీ లోకానికే ఆదర్శప్రాయుడు. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ తెలుగు బాలబాలికలకు ‘దాసుభాషితం’ ప్రతి యేడూ 'సి పీ బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ' ని నిర్వహించాలని సంకల్పించింది.

Registrations have closed.
Watch this space for the 2019 Contest.

Register Now
Deadline is Dec 12, 2018

పోటీ ఎందుకు?

ఒక విషయం మీద విద్యార్థులలో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా ఉపకరిస్తాయి. మాథ్స్ / సైన్స్ ఒలంపియాడ్ తరహాలో తెలుగుకీ ఒక పోటీ ఉండాలని భావించి, ఈ పోటీ రూపకల్పన చేయడం జరిగింది.

పోటీ ఎవరికి ?

ఈ పోటీ ప్రధానంగా పాఠశాలల మధ్య.
కేవలం ప్రజ్ఞ ఉన్న కొద్ది మంది విద్యార్థులకే ఈ పోటీ పరిమితం కాదు.  తమతమ పాఠశాలల తరఫున ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని, సంచితంగా (అంటే cumulative గా) అత్యధిక మార్కులతో, ఇతర పాఠశాలలపై  గెలిచి పాఠశాలకు, గురువులకు, తమకు గుర్తింపు సాధించుకునే అవకాశం ఈ పోటీ కల్పిస్తుంది.
   
ప్రతీ యేడు, తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క పాఠశాల మాత్రమే విజేతగ నిలుస్తాయి.  రెండవ మూడవ స్థానాలు ఉండవు. మున్ముందు, పోటీ పడే పాఠశాలలు ఎక్కువగాను, ప్రశ్నలు కఠినతరంగాను, బహుమతులు మరింత లాభసాటి గాను ఉండి, ఈ పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతాయి. తమ పాఠశాల కూడ గెలిచిన పాఠశాలల పట్టీలో స్థానం పొందడం ఒక విశేష గౌరవం అవుతుందని ప్రతి పాఠశాల భావించే రోజు దగ్గరలోనే ఉందని మేం నమ్ముతున్నాం.

పదవ తరగతి విద్యార్థులకే ఎందుకు?

ఇందుకు నాలుగు కారణాలు.

మొదటిది, పోటీ రసవత్తరంగా ఉండాలంటే అందులోని ప్రశ్నలు, కొన్ని సులువుగా, కొన్ని కఠినంగా సరైన మిశ్రమంలో విభిన్నంగా ఉంటాయి. పదవ తరగతి విద్యార్థులైతే ఎక్కువ పాఠ్యాంశాలని చదివి ఉంటారు కనుక, వేర్వేరు అంశాలలో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ప్రశ్నావళిని ఆసక్తికరంగా కూర్చవచ్చు.

రెండవది, గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతి గణనీయమైన మొత్తంలో ఉంది కనక పెద్ద తరగతి విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మూడవది, ఈ పోటీ పూర్తిగా Online మాధ్యమం ద్వారా నిర్వహించబడుతుంది. అంటే విద్యార్థికి కొంచెమైనా సాంకేతిక అవగాహన తప్పనిసరి.. పరిణితి రీత్యా పదవ తరగతి విద్యార్థులకు ఈ  అవగాహన ఉంటుంది.

నాల్గవది, పాఠశాలలో ఇదే తమ ఆఖరి విద్యా సంవత్సరం కాబట్టి, ఈ పోటీలో గెలిస్తే తమ తెలుగు ఉపాధ్యాయులకు, పాఠశాలకు అది తగిన గురుదక్షిణగా భావించి, విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు.

పోటీ తేదీ, స్వరూపం

  1. డిసెంబర్ 2018 నెల ద్వితీయార్థంలో నిర్వహించబడే ఈ పోటీ లో విద్యార్థులు computer ద్వారా గాని, smart phone ద్వారా గాని పాల్గొనవచ్చు. పోటీ జరిగే తేదీని,  నమోదు చేసుకున్న విద్యార్థులకు తెలియజేస్తాం.
  2. దరఖాస్తు ఫారంలో మీరు ఇచ్చిన మొబైల్ ఫోను నెంబరుకు, email కు నిర్ణీత తేదీ నాడు SMS & Email ద్వారా ఒక ‘లింకు’ వస్తుంది. ఆ లింకు నొక్కగానే  తెరుచుకునే ప్రశ్నా పత్రం కొద్ది సేపు మాత్రమే తెరచి ఉంటుంది.
  3. ప్రశ్నా పత్రంలో తెలుగు భాష, సాహిత్యాలకు సంబంధించిన మొత్తం 20 ప్రశ్నలుంటాయి.
  4. ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు సమాధానాలుంటాయి. ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గడువులోగా గుర్తించాల్సి ఉంటుంది.

పోటీలో ఎవరు పాల్గొనవచ్చు?

తెలంగాణా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.

ప్రవేశ రుసుమేమీ లేదు.

ఎలా పాల్గొనాలి?

అర్హులైన పదవ తరగతి విద్యార్థులు December 12, 2018 తేదీ లోగా తమ దరఖాస్తును ఈ లింక్ ద్వారా సమర్పించాలి.

విజేతల నిర్ణయ విధానం

ఒకో తెలుగు రాష్ట్రం నుంచి ఏ పాఠశాల విద్యార్ధులు సాధించిన మార్కుల స్థూల మొత్తం గరిష్టంగా ఉంటుందో,  ఆ పాఠశాల విజేతగా  నిలుస్తుంది.

పాఠశాల మధ్య మార్కులు టై అయితే, పోటీలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా విజేత  పాఠశాల నిర్ణయింపబడుతుంది. అందుకనే తెలుగు ఉపధ్యాయులు, విద్యార్థులు తమ తరగతి లో విద్యార్థులందరూ పోటీ లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

ఒకవేళ మరో పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్ధుల సంఖ్య, వారు సాధించిన మార్కుల సంఖ్య కూడా సమంగా ఉన్నట్లయితే, ఇచ్చిన ప్రశ్నలలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసే ప్రశ్నలకు ఏ పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు సరియైన జవాబిస్తారో, ఆ పాఠశాలను విజేతగా ప్రకటించడం జరుగుతుంది.

బహుమతుల వితరణ సమయంలో పోటీలో పాల్గొన్న విద్యార్థులు సదరు పాఠశాలలో  పదవ తరగతి చదువుతున్నవారని ధృవీకరించవలసి ఉంటుంది.

పోటీలో దాసుభాషితం న్యాయ నిర్ణేతల నిర్ణయమే అంతిమం. దీనిలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు ఉండదు.

బహుమతులు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విజేతగా ప్రకటింప బడిన పాఠశాలలుకు, ఆయా పాఠశాలల తెలుగు ఉపాధ్యాయులకు, పదవ తరగతి విద్యార్థులకు, ఈ క్రింది బహుమానాలు ఇవ్వబడతాయి.
  • గెలిచిన పాఠశాలలో పోటీలో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థులకు రూ. 10000 నగదు బహుమతి సమానంగా పంచి చెక్కు రూపంలో అందజేయడం జరుగుతుంది.
  • గెలిచిన పాఠశాల విద్యార్థులందరిలోనూ ఎక్కువ ప్రశ్నలకి సరియైన సమాధానాలు ఇచ్చిన విద్యార్థి(ని)కి అదనంగా రూ. 1116 లభిస్తాయి. ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే ఈ బహుమతి వారికి సమానంగా పంచడం జరుగుతుంది.
  • ఆ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయిని రు.5,116 నగదు పురస్కారం, పండిత సత్కారం అందుకుంటారు. ఒకరి కంటే ఎక్కువ మంది  ఉపాధ్యాయులు ఉంటే ఈ బహుమతి వారికి సమానంగా పంచడం జరుగుతుంది.
  • అలాగే, అత్యధిక సంఖ్యలో తెలుగు ప్రజ్ఞావంతులను తయారు చేసిన పాఠశాలకు ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక కూడ లభిస్తాయి.

పోటీ నిబంధనలు

పోటీ దరఖాస్తు ఫారంలో సరియైన వివరాలు ఇచ్చే బాధ్యత విధ్యార్థులదే.

ఏ దరఖాస్తు ఐన నకిలీ అనిపిస్తే, అది స్వీకరించబడదు. ఇందులోనూ పోటీ ఫలితాల నిర్ణయం లోనూ దాసుభాషితం న్యాయ నిర్ణేతల నిర్ణయమే అంతిమం. దీనిలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు ఉండదు.

బహుమతుల వితరణ సమయంలో పోటీలో పాల్గొన్న విద్యార్థులు సదరు పాఠశాలలో  పదవ తరగతి చదువుతున్నవారని ధృవీకరించవలసి ఉంటుంది.
Register Now
Deadline is Dec 12, 2018

Registrations have closed.
Watch this space for the 2019 Contest.

సి పీ బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ 2018
దరఖాస్తు ఫారం

ఒకటి కంటే ఎక్కువ సార్లు దరఖాస్తు చేస్తే, ఎదో ఒక దరఖాస్తు మాత్రమే పరిగణించబడుతుంది.
అందుకే  తప్పులు లేకుండా జాగ్రత్తగా English లో నింపండి ఒకసారే నింపండి.
* అని ఉంటె అది ఆ వివరం తప్పనిసరి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

To receive the Contest Link. You will have to give the same number again at the time of taking the contest.
To receive contest date information, important tips, and contest results.
If you have more than one teacher, give the senior teacher's name.

ఈ క్రింద Submit బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు పోటీ నిబంధనలకు అంగీకరిస్తున్నారు.

Thank you! Your submission has been received!
Oops! Something went wrong. Make sure you filled in all details.