దాసుభాషితం తెలుగు లలిత కళల పూర్వ వైభవ కల్పనకు శ్రమిస్తోంది. మాతో చాలా మంది మీకు ఎలా సహాయపడగలము అని అడుగుతూ ఉంటారు. సాధ్యమైనంత తెలుగులో మాట్లాడడం, తెలుగు సాహిత్యాన్ని ‘కొని’ ఆస్వాదించడం, మన భాషకు అందరూ తెలుగు వారు చేయగలిగిన సేవ.
కొంత మందికి ఆర్థిక స్థోమత ఉండి, తెలుగు భాష కోసం మరింతగా ఏదన్న చేయాలనే తపన ఉన్నా, కేవలం వృత్తి పరమైన, వ్యక్తిగత బాధ్యతల నడుమ, సమయం దొరకక చేయలేక పోతుంటారు. వారి కోసం ఉద్దేశించినదే ఈ మహారాజ పోషక ప్లాన్.
మహారాజ పోషకులవడం ఒక గౌరవం, అంతకు మించి ఒక బాధ్యత. మహారాజ పోషకులుగా మీరు ఆర్థికంగానే కాకుండా మీ ఆలోచనలను, సూచనలను అందిస్తారని ఆశిస్తున్నాము.
దాసుభాషితం తెలుగు సాహిత్యాన్ని యాప్ ద్వారా అందించడమే కాకుండా, మన భాష, సాహిత్యం, ఇతర లలిత కళల ఉన్నతికి కొన్ని కార్యక్రమాలను తలపోసింది. అవి,
మహారాజ పోషకులకు మాత్రమే వర్తించే ఉపకారాలు.
పిల్లల్లో తెలుగు భాష మీద మమకారం, సాహిత్యం మీద ఆసక్తి కలిగించేందుకు ₹1 లక్ష రూపాయిల నగదు బహుమతితో ప్రతి యేడు సి పి బ్రౌన్ తెలుగు పోటీ నిర్వహించడం
పదవ తరగతి పిల్లలు తెలుగు పరీక్షకు మెరుగ్గా సిద్ధపడేందుకు, ప్రయోగాత్మకంగా శ్రవణ పునశ్చరణ మెటీరియల్ (audio revision material) ను నామ మాత్రపు రుసుముతో అందించడం
అలాగే, కావ్యాలను, కవిత్వాన్ని, అమ్మకాల (commercial viability) పై ఆపేక్ష లేకుండా, భావి తరాలకు వారసత్వంగా ఆడియోబుక్స్ రూపంలో అందించడం
ఇతర లలిత కళల (ఉ: నాటకం, నృత్యం, సంగీతం) డిజిటల్ రూపంలో వ్యాప్తి చేసేందుకు ప్రయోగాలు చేయడం
అంతర్జాలంలో తెలుగు కంటెంట్ ను పెంచే కార్యక్రమాలు చేప్పట్టడం
Bank: Yes Bank Branch: Prestige Obelisk, Kasturba Road, Bangalore IFSC: YESB0000022 AC No: 002281300002296 Company: Cimarron Lifecare Services Pvt. Ltd.
గమనిక
వీటిలో కొన్ని ఆచరణ దశలో, కొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయి. ఈ విషయాల పైన, ఇంకా దాసుభాషితం చేపట్టవలసిన కార్యక్రమాల పైన మహారాజ పోషకులుగా నిర్మాణాత్మక సహకారం అందిస్తారని ఆశిస్తున్నాము.
ఇపుడు కేవలం మహారాజపోషకులకి మాత్రమే వర్తించే ప్రయోజనాలు చూద్దాం:
₹999, అంటే $15 కన్నా తక్కువ నెలసరి రుసుముకి దాసుభాషితం యాప్ లో ఉన్న, రాబోయే కంటెంట్ అంతా, అది ఈబుక్స్, ఆడియో బుక్స్, పాడ్కాస్ట్స్ తో సహా, మరే అదనపు రుసుము చెల్లించనవసరం లేకుండా, లభిస్తుంది.
ఈ కంటెంట్ అంతా ప్రకటనలు లేకుండా ఆఫ్లైన్ లో వినే సౌకర్యంతో లభిస్తుంది.
కొత్త కంటెంట్ ముందు మీకు అందించబడుతుంది.
దాసుభాషితం నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమాలకి (live events) ఆహ్వానాలు అందుకుంటారు.
మహారాజపోషకుల పేజీలో మీ పేరు లిఖించబడుతుంది.
మీరు గమనిస్తే, దాసుభాషితం నిర్వాహకులకున్న వెసులే మహారాజ పోషకులకీ లభిస్తుంది. ఇది మహారాజ పోషకులుగా దాసుభాషితం మీకిచ్చే గౌరవం. మీరు మహారాజ పోషకులు అవదలచుకుంటే, క్రింది బటన్ ను క్లిక్ చేయండి.
99520 29498
పైన చెప్పిన ఉపకారాలు ఇపుడు నిర్మాణ దశలో ఉన్నాయి. ఒకటి రెండు నెలలలో వాటి నిర్మాణం పూర్తి అవుతుంది. ఎప్పుడైతే ఉపకారాలు అందుబాటులోకి వస్తాయో, అప్పటి నుంచే సంవత్సర చందా కాలం లెక్కించబడుతుంది.