Alpajeevi
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అల్పజీవి

Alpajeevi

Raavi Sastri

అసమర్ధుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, అల్పజీవి - ఇవి తెలుగులో మనోవైజ్ఞానిక రచనలుగా పేరుగడించాయి. అంపశయ్య నవీన్ గారు ఈ రచనలని ఇలా నిర్వచించారు. “ఇలాంటి రచనల ముఖ్య లక్షణం పాత్రల బాహ్య రూపాన్ని కాకుండా మనసుల్ని శోధించటం. ప్రధానంగా పాత్రల మనస్సుల్లో చెలరేగుతున్న సంఘర్షణను చిత్రించటం.” ప్రేమ కథా చిత్రాల్లోని సన్నివేశాలు మన జీవితంలో జరిగినవే అయితే మన ఆసక్తి పెరిగి ఆ సన్నివేశాలని ఇంకా ఆస్వాదిస్తాము. అదే విధంగా ఈ రచనల్లో ఇతివృత్తం, కథానాయకుల వ్యక్తిత్వం ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే, వారికి తాము జీవితంలో ఏకాకులం కాదనే ఉపశాంతిని పొందవచ్చు. ఇప్పటికే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్ధుని జీవయాత్ర’ పుస్తకాల శ్రవణ రూపాలను అందిస్తున్న దాసుభాషితం, రావిశాస్త్రి గా పేరుగడించిన, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచన ‘అల్పజీవి’ ని, వారి కుమారుడు రాచకొండ ఉమాశంకర శాస్త్రి గారి సౌజన్యంతో మీకు ఈ వారం అందిస్తోంది. ఈ శ్రవణ పుస్తక విడుదలతో, తెలుగు మనోవైజ్ఞానిక రచనా త్రయాన్ని మీకు అందిస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాము.
This novel is considered among the three best novels in the psycho-analysis genre. This was first published in 1952. The author Rachakonda Viswanatha Sastry, more popularly known as Raavi Sastry, claimed no knowledge of this being a psycho-analytical novel. Yet this continues to be a Telugu Classic. With this Dasubhashitam is proud to offer all three novels as audiobooks on the platform.
Price in App
179
Chapters / Episodes
13
Rating
5.00
Duration
3:50:50
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu