నా రాతలో అమెరికా లేదేమో..?!

Meena Yogeshwar
February 4, 2025

‘రాముడు సముద్రం దాటి లంకకెళ్ళలేదా? ఆయన పితృకార్యాలకు పనికిరాకుండా పోయాడా? హనుమంతుడు దాటలేదా? దేవుడు అంతర్యామి, ఆయన ఇక్కడా ఉంటాడు, అమెరికాలోనూ ఉంటాడు. కాలిఫోర్నియా అంటే ఏమనుకున్నారు? కపిలాశ్రమం. అక్కడి ash hill అంటే సగరుల బూది కుప్పలు. నారాయణుడి మీద కోపం తెచ్చుకుని లక్ష్మీదేవి ఆ కాలిఫోర్నియాలో కూర్చుని తపస్సు చేసింది. అక్కడి నుండి మునుల కోరిక మేరకు కోల్హాపూర్ వచ్చింది అని ఒకాయన ఈ మధ్య వీడియో చేశారు. పైగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శాంకరీదేవి ఆలయం శ్రీలంకలో ఉంది. మరి అది చూడకపోతే ....

Read more

కెరీర్ ను మలచుకోవడం ఎలా?

January 28, 2025

ఒకరికి కెరీర్ విషయంలో గైడ్ చేసేవారు లేక కెరీర్ లో చాలా ఎదురుదెబ్బలు తిన్నాడు. తనకి సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ అంటే చాలా ఇష్టం. లెక్కల్లో దిట్ట. తను ఇంటర్ పూర్తిచేసిన సమయంలో అంటే 90ల్లో ఇంజినీరింగ్ గురించి సరిగ్గా చెప్పేవారు లేకపోయారు. వాళ్ళ నాన్నగారు ఆడిటింగ్ వైపు ఉండడం వలన తనకు అస్సలు ఇష్టం లేని అప్పటి I.C.W.A చదివించారు. కొన్నాళ్ళు అటు పని చేసి, ఎన్నో ఎదురుదెబ్బలు తిని, తన అదృష్టం కొద్దీ మంచి మెంటార్ లు దొరకడం వలన సాఫ్ట్ వేర్ కోర్సులు చేసి, ఇప్పుడు ...

Read more

ఎవడు విశ్వనాథ?

Meena Yogeshwar
January 20, 2025

లెక్కప్రకారం విశ్వనాథను, చలాన్ని ఆరాధించేవారైనా, అసహ్యించుకునేవారైనా 90శాతం మంది, వారి రచనలను కనీసం ఒక 10శాతమైనా చదివి ఉండరు. తాము విన్నదాన్ని బట్టీ, తమ సిద్ధాంతాలు ఎటు లాగుతున్నాయో అటు వైపుకు వెళ్ళేవాళ్ళే అత్యధిక శాతం. విశ్వనాథ హిందూ మత పునరుజ్జీవనం అనే ఏకైక లక్ష్యంతో, ఒకే ఉద్ధేశ్యంతో రచనలు చేశాడు అనుకుని ఆయన్ను ఇష్టపడడమో, పడకపోవడమో చేస్తారే కానీ, ఆయన ఎన్నో చోట్ల ఎన్నో చెప్పాడని గ్రహించరు.వారికి కీచకునిలోని ప్రేమ తీవ్రతను విశ్వనాథ గుర్తించాడని తెలియదు. నాగసేనుడు నవలలో ఒక సత్పురుషుడైన బౌద్ధ భిక్షువును అభినందించాడని తెలియదు. సలీంను ప్రేమ యోగిగా దర్శించాడని తెలియదు. ఎంతసేపూ...

Read more