బారిష్టర్ పార్వతీశం
Barishter Parvateesam
Mokkapati Narasimha Sastri
పార్వతీశాన్ని మీరు బహుశా మొదటి సారి మీ పదవ తరగతి తెలుగు క్లాసులో కలుసుకొని ఉంటారు. అమాయకత్వం, దర్పం రెండు సమపాళ్లలో ఉన్న పార్వతీశం ఆత్మ కథ విని నవ్వని వాళ్ళు తెలుగునాట లేరు. మొగల్తూరులో పార్వతీశం బాల్యం, బారిష్టర్ అవ్వటానికి ఇంగ్లాండ్ ప్రయాణం, అది పొందే వరకు పడిన పాట్లు, దేశం తిరిగి వచ్చి ప్రాక్టీసు నెరపడం, ఇలా పార్వతీశం కథని మూడు భాగాల్లో వివరించి, ఆద్యంతం నవ్వించారు రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు. ఇప్పుడు మీరు పార్వతీశాన్ని చూడలేక పోయిన, వినగలరు. వినండి, దాసుభాషితం అందిస్తున్న 'బారిష్టర్ పార్వతీశం' శ్రవణ పుస్తకం.
If you know about 'Barishter' Parvateesam, it is likely because you read about him in your Telugu Syllabus in School. You may remember laughing at his naivete and boastfulness. Gullible, bumptious and yet immensely likeable, Barishter Parvateesam is an iconic character of Telugu Literature created by Sri Mokkapati Narasimha Sastry in 1924. The novel is divided into three parts and recounts the travails of Parvateesam in his journey from Mogalturu in West Godavari to England, where he goes to become Barister-at-law, and back. Now Dasubhashitam brings you the 'voice' of Barishter Parvateesam. It will be a new experience. Come meet Parvateesam once again.