Kaasi Yatra
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

కాశీ యాత్ర

Kaasi Yatra

Chellapilla Venkata Sastri

హైందవ సంప్రదాయంలో తీర్థ యాత్రలకు ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ, భారతీయ ఆత్మగా కీర్తించబడుతున్న కారణాన కాశీ యాత్ర మరింత ప్రత్యేకం. ప్రాచీన సంప్రదాయ విద్యలకు అప్పుడూ ఇప్పుడూ అధ్యయన అధ్యాపన కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. తెలుగు సాహిత్యాన్ని భావి తరాల వారికి శ్రవణ రూపంలో అందించడానికి ‘దాసుభాషితం’ చేస్తున్న కృషిలో భాగంగా పుస్తకాలను అన్వేషిస్తున్న క్రమంలో కాశీ యాత్రకు సంబంధించిన రెండు పుస్తకాలు లభించాయి. రెండూ ప్రముఖమైనవే. ఒకటి శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య గారు వ్రాసిన కాశీ యాత్ర చరిత్ర, మరొకటి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు వ్రాసిన కాశీ యాత్ర. శతావధాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి 18 యేండ్ల వయసులో కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కొరకు వెళ్లారు. ఆ అనుభవాలను 64 ఏళ్ళ వయసులో 1934లో రాశారు. ఇది ఈనాటి పాఠకులకు ఆసక్తిదాయకంగానూ ఆమోద యోగ్యంగానూ తోచటం చెళ్లపిళ్ల వారి కాశీ యాత్ర నే ఎంచుకోవడం జరిగింది. ఈ పుస్తకంలో 'కాశీ యాత్ర' తో పాటు మరికొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. వాటిని విసర్జించి కేవలం కాశీ యాత్ర అధ్యాయానికి మాత్రమే ఈ శ్రవణ పుస్తకాన్ని పరిమితం చేయడం జరిగింది. ఇక రచనా, శైలి విషయానికి వస్తే చెళ్ళపిళ్ళ వచనంలో ఒక విలక్షణత ఉంది. పదాలు మెత్తగా ఉంటాయి. చెప్పడంలో చమత్కారం ఉంటుంది. వాక్య నిర్మాణంలో సౌందర్యం ఉట్టి పడుతూ ఉంటుంది. అన్నీ కలిపి పాఠకుడిని అనిర్వచనీయమైన ఒక మోహావేశంలో కట్టిపడేస్తాయి. అందుకే తిరుపతి శాస్త్రి పద్యంలో సొగసరి, వేంకట శాస్త్రి గద్యంలో గడసరి అంటారు. ఇన్ని విధాల విశిష్టమైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వ్రాసిన ఈ కాశీ యాత్ర గ్రంధాన్ని అన్నమయ్య గ్రంధాలయం ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన శ్రీ మోదుగుల రవికృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్ధిక సహాయంతో 2012 సంవత్సరంలో అందమైన గ్రంధంగా ప్రచురించారు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి "మా గురువు గారు.... " అనే ముందుమాటతో సహా ఈ పుస్తకాన్ని యథాతథంగా శ్రవణంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి "కాశీ యాత్ర”. శ్రవణానువాదం గళం: కొండూరు తులసీదాస్.
Listen to the Audio version of Sri Chellapilla Venkata Sastri's Kaasi Yatra, with a foreword by Sri Viswanadha Satyanarayana. Photo by James Princep 1834, wikimedia.org
Price in App
0
Chapters / Episodes
7
Rating
5.00
Duration
1:55:53
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu