Mithunam (Navala)
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

మిథునం (నవల)

Mithunam (Navala)

Sriramana

‘మిథునం’. 1997 నవంబరులో ‘ఆంధ్రభూమి’ వారపత్రికలో ప్రచురించబడిన ఒక కథ. ఆ తరువాత వివిధ ఇతర సంచికలో ప్రచురించబడి కాలక్రమేణా విస్తృతమైన పాఠకాదరణ పొందింది. దీని రచయిత శ్రీ శ్రీరమణ. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మదురై టి.వాసుదేవన్ నాయర్ ఈ కథ ఆధారంగా సినిమా ‘అర విరిసిన చిరునవ్వు’ అనే అర్ధంతో మలయాళంలో తీసిన ’ఒరు చెరు పుంచిరి’ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇదే కథ ఆధారంగా తెలుగులో నిర్మింపబడిన చిత్రానికి తెలుగు చలనచిత్ర. సాహితీ ప్రముఖుడు శ్రీ తనికెళ్ల భరణి దర్శకత్వం వహించారు. అది 2012లో విడుదలై ప్రేక్షకులను ప్రత్యేకించి పాత తరం వారిని ఎంత బాగా ఆకర్షించిందో, ఎంత ఆదరణ పొందిందో మీకందరికీ తెలుసు. చాలా సినిమాల కథలు ఆయా సినిమాల కోసమే వ్రాసినవి. కనుక వాటిలో పాత్రధారులు తమ నటన ద్వారా కథను నడిపిస్తారు. కానీ కథల్లో పాత్రలు తప్ప పాత్రధారులు కనపడరు కనుక పాత్రలే కథని నడిపిస్తాయి. అందుచేత కథ పాఠకుల హృదయాలను నేరుగా తాకుతుంది. కథ ముందే తెలిసిపోతే సినిమాలో మజా ఏముంటుంది? అనే వాదన కొంత వరకూ సరైనదే కావచ్చు గానీ, బాగా తెలిసి ఉన్న కథను, ‘స’ దృశ్యమానంగా వీక్షించటం వల్ల కలిగే అనుభూతే వేరు. ఎందుకంటే కేవలం కథను ఆస్వాదించటమే కాకుండా, కథను నడిపించిన తీరు, పాత్రధారుల ప్రతిభ, సంగీతం, ఛాయాగ్రహణం ఇత్యాదులను మరింత విశ్లేషణాత్మకంగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఈ అంశాలన్నీ ఒక దానికొకటి ఉదాహరణగా నిలిచేవి ‘మిథునం’ కథ, సినిమా. మీరందరూ సినిమా ఎప్పుడో చూసి ఉంటారు. చాలా మంది కథ కూడా చదివి ఉంటారు. సినిమా మాత్రమే చూసి ఉంటె కథ మరోసారి చదవండి. ఒకవేళ కథ చదివి సినిమా చూసి ఉన్నా చూసి ఉండకపోయినా, కథ చదివి మరీ మళ్ళీ సినిమా చూడండి. మూల రచనలోని అందాలను, తెర మీదకు బదలాయించటంలో దర్శకుదు ప్రదర్శించిన ప్రతిభ అనుభవంలోకి వస్తుంది. తక్షణ అందుబాటు కోసం ఆ కథను మూల రచయిత శ్రీ రమణ గారికి ధన్యవాదాలతో శ్రవణ రూపంలో అందిస్తున్నాము, ఆలకించండి.
Sri Sriramana's Mithunam needs no introduction as it was made more popular through Sri Tanikella Bharani's screen adaptation starring Sri Balasubramaniam and Smt. Lakshmi. This is a unabridged audio version of the original story. Relive the experience.
Price in App
Chapters / Episodes
4
Rating
4.00
Duration
49.01
Year Released
2017
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu