MLA Aatmakatha
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ఎమ్మెల్యే ఆత్మకథ

MLA Aatmakatha

Mannava Giridhar Rao

1956లో ప్రధమంగా ప్రచురింపబడిన ఈ నవల, తెలుగులో ఆనాటి రాజకీయాలపై చేసిన తొలి వ్యంగ్య రచనగా పేర్కొనబడింది. హాస్య రస ప్రధానమైనదని చెప్పబడినప్పటికీ, ఆ నాటి పాఠకులలో ఏపాటి హాస్యరసాన్ని ఒలికించిందో గానీ, ఈ నాటి రాజకీయ పరిస్థితులతో పోల్చుకుంటే హాస్యం పొంగిపొర్లటం తధ్యం. ఈ దేశంలో రాజకీయాలంటే స్వాతంత్ర్యానికి పూర్వం, దేశం కోసం త్యాగాలు, అనంతరం భోగాలు. అది మరింత వికృతమై పార్టీలు, సిద్ధాంతాలూ, నైతిక విలువలూ పట్టింపు లేకుండా పచ్చని చోట మేయడం వెచ్చని చోట పడుకోవడం ఆన్న చందంగా ఎప్పటికప్పుడు ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటేనే రంగంలో ఉండగలరు. అలా చేయలేని వారికి రాజకీయంలో స్థానం ఉండదు. ఈ నేపథ్యంలో కొత్త శాసన సభ్యుల ఉత్పత్తి-వృద్ధి-వ్యవహార-పరిణామ సరళిని పట్టి ఇస్తుంది ఈ ఆత్మకథ. అధికారం, ప్రజాసేవ వీటిని గురించి చక్కని ఆలోచలను ప్రేరేపిస్తుంది ఈ ఆత్మకథ. ఈ నవలా రచయిత శ్రీ మన్నవ గిరిధరరావు గారు వృత్తి రీత్యా అధ్యాపకులు. గుంటూరు హిందూ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులుగా 1990లో ఉద్యోగ విరమణ చేశారు. 1968లో గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై 1978 వరకూ ఎమ్మెల్సీగా ఉన్నారు. యువభారతి పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అనేక హాస్య, విద్యావిషయక ప్రసంగాలు చేశారు. వారు చేసిన అనేక రచనలనుంచి ఈ నవలను ఎంచుకుని శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి ‘ఎమ్మెల్యే ఆత్మకథ'.
This novel is a political satire by Sri Mannava Giridhar Rao, who was elected to the Legislative Council in 1968. By profession he was a lecturer of History and Political Science in Guntur Hindu College. So he approaches the subject with credentials. The most interesting aspect of this novel is that if you didn't know the year it was first published in (1956), you would think it is a contemporary novel inspired by events around us now. So what was fiction once, has now become a reality.
Price in App
0
Chapters / Episodes
29
Rating
5.00
Duration
3:25:6
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu