స్మృతిచిహ్నం
Smruthichihnam
Jalandhara
మనసును మనసుతో చదవగలిగినవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. మనచుట్టూ మనవాళ్లు, మనకి నచ్చిన వస్తువులు, చాలినంత డబ్బు ఉన్నా కూడా కొందరు జీవితంలో ఒంటరిగా ఉన్నాము అంటారు. ఈ ఒంటరితనానికి కారణం ఏమిటి? దేనినో శోధిస్తూ ఉంటాడు అది ఏమిటి? మన చుట్టూ మనం నిర్మించుకున్న అర్ధంలేని, అర్ధం కాని ప్రశ్నలకి సమాధానాలు, ప్రేమకి - ఆరాధనకి నిజమైన అర్ధం ఇవన్నీ తెలుసుకోవాలంటే మనిషి ఆలోచనల్లో మార్పు రావాలి. తాను నిర్మిస్తున్న అనాధశరణాలయానికి ముందు తన తండ్రి జ్ఞాపకంగా ఒక విగ్రహాన్ని నిర్మించాలనుకుంటుంది జ్ఞాన. ఎంతోమంది కళాకారులు నిర్మించిన కళారూపాలు నచ్చని ఆమె, ప్రత్యగాత్మ చేసిన కళారూపాన్ని ఎందుకుమెచ్చుకుంది? అది నిర్మించడానికి అతను చేసిన పరిశోధన ఏమిటి ఈ నవలలో వినండి.
This Translation was Generated by AI :- "There are only a very few people who can read a heart with another heart. Even when surrounded by our loved ones, the things we like, and plenty of money, some people still say they feel lonely in life. What is the cause of this loneliness? What is it that a person keeps searching for? To find the answers to the meaningless and incomprehensible questions we build around ourselves, and to understand the true meaning of love and adoration, a shift in human thought is necessary. Gñana wants to build a statue in memory of her father in front of the orphanage she is constructing. Having disliked the sculptures created by numerous artists, why did she appreciate the artwork crafted by Pratyagatma? What was the research he conducted to create it? Listen to this novel to find out."