Tene Santakam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

తేనె సంతకం

Tene Santakam

Rasavihari

తేనె సంతకం కవితా సంకలనం లో కవి ఎంచుకున్న ప్రక్రియ హైకూ. ఇది జపనీయులది. ఇది త్రిపంక్తి. మొదటి ఒకటి లేదా రెండు పంక్తుల్లో ఒక పడమో చిన్న వాక్యంమో చెప్పి మూడవ పంక్తిలో పాఠకుడు ఊహించని రీతిలో పాఠకుడికి ఒక ఆలోచనని అనుభూతిని అందిస్తూ విషయాన్ని మెరిపించడం మురిపించడం ఈ ప్రక్రియలోని విశిష్టత. హైకూ అంటే మెరుపు. ఇందులో కొన్ని మెచ్చుతునకలు. మొదటి కవిత లోనే "అరిటాకులో / అన్నం ఆవకాయ / మన జెండా గుర్తుకువచ్చింది" అంటూ తెలుగింటి భోజనం పెట్టారు. భోజనం పెట్టగానే మనకి రుచులు గుర్తుకొస్తాయి. కవికి మాత్రం జాతీయ జెండా అందులోని రంగులు కనిపించాయి. ఇది పాఠకుణ్ణి ఒకింతసేపు నిలబెట్టి ఆలోచింప చేస్తుంది అర్థం చేసుకోవడానికి సామ్యం వెతుక్కోవటానికి. ఎవరికైనా చిన్నతనపు జ్ఞాపకాలు మధురంగానే ఉంటాయి. ఈ కవి వాటిని చక్కగా అక్షరీకరించి మనక్కూడా ఆ అనుభూతిని పంచి పెడతాడు. "చిన్నప్పుడు కొబ్బరాకు వాచీ / ఇప్పటికీ తిరుగుతూనే ఉంది / జ్ఞాపకాల్లో" అంటూ. నిజానికి ఆ కొబ్బరాకు వాచీ ఆటబొమ్మే కానీ అది ఈనాటికి జ్ఞాపకాల పొరల్లో తిరుగుతూనే ఉందనడం ఓ nostalgic feeling. అలాగే పిల్లలెలా ఉన్నా అమ్మకి అందంగానే కనిపిస్తారని కాకి ఉపమానాన్నే ఉపయోగించి కొత్తగా ఇలా చెప్పాడు కవి – "ముళ్లగూడు / నల్ల పిల్ల / మురిసిపోతోంది తల్లి కాకి". (రివ్యూ శ్రీ శశిధర్ పింగళి - 9440386331) అలాగే, అందరు తల్లులూ సౌందర్యవంతులే అని చెప్పడానికి, "గులాబీ గర్వంగా చెప్పింది / మా అమ్మ / ముళ్ళకొమ్మ అని" అంటదు కవి. రసవిహారి గా పరిచయమైన శ్రీ పాకలపాటి వేణుగోపాల కృష్ణంరాజు గారికిది తొలి కృతి. ఇందులోని రసగుళికలను ఆస్వాదిస్తూ రసజ్ఞులైన పాఠకులు కవిత్వం పట్ల ఈయన తపనని, కృషిని గుర్తించి, ప్రోత్సహించాలని, దాసుభాషితం ఈ హైకూలు, ఆడియో రూపంలో అందిస్తోంది. ఇవి పడుకునే ముందర headphones లో వింటే, ఒక అందమైన ప్రపంచంలోకి వెళ్లి, అటునుంచి మంచి నిదురలోకి జారుకుంటారు.
Rasa Vihari (Pen name of Sri Paakalapaati Venugopala Krushnamraju) adopts the Japanese Haikus style to present nostalgic and endearing thoughts about childhood, village life, nature, and relationships in sweet Telugu language. These are best listened to using headphones before you retire to bed. You are guaranteed to slip into sleep in a good frame of mind.
Price in App
0
Chapters / Episodes
13
Rating
4.50
Duration
00:24:05
Year Released
2019
Presented by
Various
Publisher
Dasubhashitam
Language
Telugu