గోపీచంద్ - విశ్లేషణ
Gopichand - Visleshana
కాల్పానిక వచన సాహిత్యంలో అగ్రగాములైన రచయితల్లో గోపీచంద్ ఒకరు. తత్వవేత్తగా, రేడియో ప్రయోక్తగా, సినిమా రచయితగా, దర్శకునిగా ఇలా వారు బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరు రేడియోలో గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. గోపీచంద్ గారిపై పాశ్చ్యాత్త రచయితల ప్రభావం ఎక్కువగా ఉన్నది. వీరి రచనలు ఎక్కువగా వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.
ఎవరు ఎంతగా విమర్శించినా తానూ చెప్పాలనుకున్నది చెప్పేవారు. దీనివల్ల వారు వారి మిత్రులను కూడా శత్రువులుగా చేసున్నారేమో అని చాలా మంది అంటారు. సినీ రంగంపై వారికి అసంతృప్తి ఎందుకు వచ్చింది? వీరిని విశేషంగా ఆకర్షించింది ఏది? ఎక్కువగా దేనిని ద్వేషించారు? ఇంకా వీరి రచనలపై విశ్లేషణను మృణాళిని గారి ద్వారా వినండి.
Image : https://www.gotelugu.com/godata/articles/201405/gopichand_1399006593.jpg