పురాణయానం
Puranayanam
వేదములు, ఇతిహాసాలు, పురాణాలతో, వాటిలోని ధర్మసూక్ష్మాలను అవలంబిస్తూ మన భారతదేశం నడుస్తోంది. వాటిలోని ధర్మాలపై అనేకానేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మన పురాణాలలో ఎన్నో సందేహాలు. ఎన్ని కథలు మనకు సుపరిచితం అయినా, పిల్లలకు వాటిని కథలుగా చెప్పేటప్పుడో,ఎక్కడైనా ప్రవచనాలు వింటున్నప్పుడో, ఆ కథలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడో అనేకానేక సందేహాలు వస్తూ ఉంటాయి. మనకు తట్టని,ఆలోచించని రీతిలో పిల్లల ఆలోచనావిధానం, తర్కం ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలను ఇంట్లో జ్ఞానవృద్దులు ఉంటే తెలుసుకోవచ్చు. ఇలాంటి మనకు వచ్చే సందేహాల నివృత్తికి వేదికగా Quora ఉన్నది. దీని ద్వారా మన సందేహలు కొంతవరకు తెలుసుకుందాం.
...