Tamoshi
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

తమోషి

Tamoshi

Jarasandha

తమోషి అనగా ఖైదు. ఖైదీకి నేరస్తుడికి చిన్న బేధం ఉంది. నేరం నిరూపణ కాకుండానేజైలులో ఉండే వారిని ఖైదీ అంటారు. రామ్ నిరూపణ అయి శిక్షను అనుభవించే వారిని నేరస్తుడు అంటారు. ఈ రచయిత జరాసంధ ఒక జైలు అధికారి. ఈయన జైలులో పని చేస్తున్నా అతని హృదయం బండబారిపోలేదు అని ఈ నవలను చదివితే అర్ధమవుతుంది. శిక్ష నిరూపణ అయినవారు శిక్షను అనుభవించి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొన్ని జీవితగాధలు మనల్ని, మనలో ఉండే మానవత్వాన్ని ప్రశ్నిస్తాయి. ఎలాగంటే అది నేరం కానప్పుడు శిక్ష ఎందుకు వేశారు అని . ఈ నవలలోని మల్లికా గంగూలి పల్లెటూరికి చెందిన అందమైన అమ్మాయి. ఆమె పెళ్లి ఇంకొంత సమయంలో జరగబోతోంది అనగా ఆ పెళ్లి కొడుకు పాము కాటుకి గురై మరణిస్తాడు. ఆమెని తన తండ్రి కన్నా పెద్ద వయసున్న అతనితో పెళ్ళిచేయాలని చూస్తారు గ్రామస్థులు. ఆ పరిస్థితుల్లో మహేష్ గంగూలీ ఆమెని పెళ్లి చేసుకుంటాడు.మహేష్ ఇంట్లో అందరికి దగ్గరవుతున్న సమయంలో ఒక జరగరాని సంఘటన జరుగుతుంది. దాని ప్రతిఫలంగా సంభవించిన పరిస్థితులకి ఆమె నేరస్తురాలవుతుంది. ఆ సంఘటన ఏమిటి? ఆమె ఎందుకు శిక్షని అనుభవిస్తోంది ఈ నవలా విశ్లేషణలో వినండి.
Image: https://www.groundxero.in/2021/08/11/where-are-the-sisters-of-bhagat-singh-and-kshudiram-the-women-political-prisoners-of-bengal-and-their-invisibilized-stories/
Price in App
0
Chapters / Episodes
1
Rating
5.00
Duration
0:27:45
Year Released
2023
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu