Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.
కొంతమంది సంగీతం నేర్చుకోనక్కరలేదు. ఒక పాటను విని, కొద్దిపాటి సాధనతోనే యథాతధంగా పాడి శ్రోతలకు ఆనందం కలిగించటమే కాకుండా, తాము కూడా ఆస్వాదించగలరు. అలాంటి ప్రతిభావంతులు సంగీతం కూడా నేర్చుకుని ఉంటే ఇక వారి గురించి చెప్పనే అక్కరలేదు. అటువంటి నైపుణ్యం పుణికి పుచ్చుకుని, ఏక గళ గీతమైనా, యుగళ గీతమైనా, తెలుగైనా, హిందీ అయినా, లలిత గీతమైనా శాస్త్రీయ సంగీత ఛాయలున్న గీతాలైనా, యథాలాపంగా, మరీ ముఖ్యంగా ఏ ఒక్క వాద్య సహకారమూ లేకుండా వెంట్రుకవాసి కూడా శృతి, లయ తప్పకుండా, ఆరోహణావరోహణలను అవలీలగా పాటిస్తూ, ఒళ్ళు పులకరింప జేసే గమకాలతో కేవలం తమ గాత్రంతో శ్రోతలను ఆనందడోలికల్లో ఓలలాడించి మైమరపింప జేసే నైపుణ్యం స్వంతం చేసుకున్న ఒక అక్కా చెల్లెళ్ళను సౌజన్య, సౌమ్యలను ఈరోజు పలకరిద్దాం. ఈ కార్యక్రమం పేరుకు ముఖా ముఖీయే కానీ దీనిలో మాటల కంటే పాటలే ఎక్కువ. ఎందుకంటే ఈ అక్కాచెల్లెళ్లు ప్రదర్శించే ఈ అద్భుతమైన ప్రక్రియ గురించి మాటల ద్వారా వివరించడం కంటే నేరుగా ప్రదర్శించటం ద్వారానే ఎక్కువ అనుభవంలోకి వస్తుంది. మరెందుకాలస్యం విందామా ! అపూర్వ సోదరీ మణులతో – ముఖా ముఖీ.
With nearly 4 Million views and over 14 thousand subscribers, Soumya and Soujanya are undoubtedly amateur singing sensations on YouTube. Listen to them in this Mukhaa Mukhee where is certainly more music than talk.