#01 నేటి దాసుభాషితం

Konduru Tulasidas
August 15, 2020

నేను 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత, కేవలం కాలక్షేపం కోసం మొదలు పెట్టిన ఈ శ్రవణ పుస్తకాల ప్రక్రియ, ప్రారంభంలో శ్రీ పి.వి.ఆర్ కే ప్రసాదుగారు, శ్రీ రావి కొండలరావుగారి వంటి పెద్దల, హితుల ఆశీస్సులు, శ్రోతల విశేష ఆదరణ, పొంది క్రమంగా ఇపుడు తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తక వేదికగా వికసించింది...

ఇది దాసుభాషితం అధికారిక పాడ్ కాస్ట్ ఛానెల్, నేటి దాసుభాషితం.

నేను మీ హోస్ట్, తులసీదాస్, మీకు స్వాగతం పలుకుతున్నాను.

అసలేమిటి ఈ ‘నేటి దాసుభాషితం’


నేను 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత, కేవలం కాలక్షేపం కోసం మొదలు పెట్టిన ఈ  శ్రవణ పుస్తకాల ప్రక్రియ, ప్రారంభంలో శ్రీ పి.వి.ఆర్ కే ప్రసాదుగారు,  శ్రీ రావి కొండలరావుగారి వంటి పెద్దల, హితుల ఆశీస్సులు, శ్రోతల విశేష ఆదరణ, పొంది క్రమంగా ఇపుడు తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తక వేదికగా వికసించింది. 


ఇప్పటికి  నేను చదివిన పుస్తకాలు అన్నీ, నా దృక్పధాన్ని విశాల పరచి వ్యక్తిత్వాన్ని ధృడపరచాయి.  కొన్ని పుస్తకాలు జ్ఞానాన్ని ప్రసాదిస్తే మరికొన్ని, తీరూ తెన్నూ లేని ఆలోచనలు  ప్రయోజనకరమైన దిశలో స్థిరపడటానికి తోడ్పడ్డాయి.  కొన్ని మధురానుభూతులు పంచితే, మరికొన్ని గిలిగింతలు పెట్టాయి, ఇంకొన్ని “ఆహా!” అనేంతగా అబ్బురపరిచాయి. కొన్ని పుస్తకాలు ఆర్ద్రతతో  కన్నీరు తెప్పిస్తే, కొన్ని హాస్యంతో తెప్పించాయి. మాటల్లో వర్ణించ వీలు గాని అపురూపమైన ఈ అనుభూతులను నాకు కలుగ జేసిన ఆ పుస్తకాలలో ఏ ఒక్కటీ నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో చదవలెకపొయాను. ప్రస్తుతం ఈ అవస్థను అనుభవిస్తున్నవారు ఏ భాషకు చెందిన వారైనా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉంటారు. అటువంటి వారిలో తెలుగు వారికి ఏ కొన్ని పుస్తకాలనైనా వినిపించ డానికి దాసుభాషితం ఆవిర్భవించింది. 


ఆ కొన్నే ఇప్పటికి వందలైనాయి. ప్రతీ వారం కొత్త కాంటెంట్ యాప్ లో చేర్చబడుతోంది. పుస్తకమైతే  శ్రవణ రూపంలో ఉంటున్నది గానే ఆ పుస్తకం యొక్క వైశిష్ట్యం, అది అందించగల జ్ఞానం,  కలిగించగల అనుభూతులను శ్రోతలతో పంచుకునే అవకాశం దాసుభాషితంలో ఇప్పటివరకు లేదు. ఇప్పుడు కొత్త విడుదలల సంక్షిప్త పరిచయాలు, అలాగే దాసుభాషితం యాప్ లో ఉన్న కాంటెంట్ ను ఎప్పటికప్పుడు మీకు పరిచయం జేసే సౌలభ్యం ఈ పాడ్ కాస్ట్ కల్పిస్తుంది. తద్వారా దాసుభాషితం యాప్ యొక్క పూర్తి లబ్దిని మీరు పొందుతారు. 


ఇప్పటివరకూ  చెప్పినదంతా,  తెలుగు సాహిత్యంతో నా ఒక్కడి అనుభవ సారాంశమే.


ప్రస్తుతం దాసుభాషితం బృందంలో ఉన్న అందరూ చదువరులే.  కేవలం వినోదమే కాకుండా విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం రంగాలలో ఇతర భాషా సాహిత్యాలలోని మణిపూసలను కూడా వారు  తెలుగు వారికి తెలుగులోనే అందించగలరు. అయితే వాటిలో చాలావరకు శ్రవణ పుస్తక రూపంలో ఇమడవు. వాటికి అనువైన అమరిక ఈ ‘నేటి దాసుభాషితం’ పాడ్ కాస్ట్.


ఒక రోజులో దాసుభాషితంతో సాంగత్యంకు మీరు కేటాయించగలిగే ఏ కొంత సేపయినా అది ఆ మేరకు  నిశ్చయంగా మీకు ప్రయోజనం కలిగిస్తుంది. వినోదంతో పాటు, ప్రపంచం లోని అతి ప్రకాశవంతమైన ఆలోచనలను మీకు తెలుగులో పరిచయం చేయడం. ఆ  ఆలోచన పరిధులను విస్తృత పరిచి, విషయ  గ్రహణలో మీ క్షమతను పెంచి, మీ సాఫల్య కాంక్షిగా, నేస్తంగా అను నిత్యం మీ వెన్నంటి ఉండడం దాసుభాషితం ధ్యేయం. 

దాసుభాషితం, జీవితాన్ని సమగ్రంగా ఆస్వాదింప జేసే పంచామృతమైతే ‘నేటి దాసుభాషితం’ పాడ్ కాస్ట్’, దాని తీర్థ రూపం. 


ఈ వారం ముఖాముఖీ


చిన్నతనంలో, ఒక వస్తువు మీద మోజుతో, చదువును, ఇంటిని వదిలి, దేశ దిమ్మరులైన బాలలు ఎందరో ఉండుంటారు. కొందరు తమ తప్పుని తెలుసుకుని ఇంటికి తిరిగొచ్చి ప్రయోజకులు అయుంటారు, మరికొందరు జీవితాన్ని వ్యర్థం చేసుకుని ఉంటారు. బహుకొద్ది మంది మాత్రమే, కీర్తిని పొంది ఉంటారు. 


చిన్నతనంలోనే సైకిల్ కొనుక్కోవాలని, ఇంటినుంచి బయటపడి, మద్రాస్ కు చేరి, చిత్ర రంగంలో స్థిరపడి, విజయవంతమైన చిత్రాల్లో నటించటమే కాకుండా, నిర్మించిన ఘనులు శ్రీ పద్మనాభం గారు.

padmanbham-actor
Tap to listen

పద్మనాభం గారి నటనా పటిమకు ఒక ఉదాహరణ. వాగ్దానం చిత్రంలో శ్రీనగజాతనయం హరికథ అందరికి తెలుసు. రేలంగి గారు హరికథ చెప్తుంటే, నా అభిమాన సూర్యకాంతం గారు, వయోలిన్ సహకారం ఇస్తుంటారు. కానీ వయోలిన్ వాయించటం చూపించే భాగాలన్నీ క్లోజ్-అప్ షాట్లే. ఎందుకంటే, ఆమె వాయించిన విధానం ఆమె వయోలిన్ నిజంగా వాయిస్తున్నట్టు, దర్శకులైన ఆచార్య ఆత్రేయ గారికి అనిపించి ఉండదు. చిత్రమంటేనే మేక్-బిలీవ్ కాబట్టి, చిన్న అపశృతి కూడా, వీక్షకుడిని కథలోనుంచి బయటకు తీసుకువస్తుంది. 

కానీ మృదంగం వాయించే పద్మనాభం గారివి మాత్రం వైడ్ షాట్లు. ఎందుకంటే ఆయనకు నిజంగానే మృదంగం వాయించటం వచ్చా అన్నంతగా ఆయన హావభావాలు, నడత ఉంటాయి ఆ పాటలో. అన్నిటి లోకి హైలైట్ ఏంటంటే, ముక్తాయింపు ఇచ్చేసి చివరికి గ్లాస్ అందుకోవటం. 

ఆయన పేరు చెప్పగానే ఠక్కున గుర్తువచ్చే ఇంకొక పాత్ర, చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో ఆనంద్ పాత్ర.  అమాయకుడిలా కనిస్పిస్తూ, ప్రతీ వాక్యం చివరన “మీరు నా మాట నమ్మాలి” అని నవ్వుతూ అర్థిస్తూ, స్నేహితుడినే కేసులో ఇరికించి, మోసం చేసే పాత్రలో ఆయన మెరిశారు. 

ఆగష్టు 20 న పద్మనాభం గారి జయంతి. ఈ సందర్భంగా, ఇటీవలే కీర్తిశేషులైన శ్రీ రావి కొండల రావు గారు జరిపిన సంభాషణను వినండి. ఆనందిస్తారు.


తిరుమల చరితామృతం 3వ భాగం విడుదలైంది.

tirumala charitamrutam
Tap to listen

తిరుమల ఆలయానికి ఏయే గ్రామాలను దేవదేయాలుగా రాజులు లేదా సంస్థానాధీశులూ ఇస్తారో ఆయా గ్రామాల్ని, మాన్యాల్ని శ్రీనివాసుని సుదర్శన చక్రం కాపాడుతుంది. అదెలాగో ఈ 3వ భాగంలో “గుడి మాన్యాల్ని కాపాడిన “సుదర్శన చక్రం” అధ్యాయంలో వినండి. ఇది కాక ఇంకా ప్రసాదాలతో భక్తి వ్యాపారం, భక్తుల కోసం గజ్జె కట్టిన ముద్దు కుప్పాయి వంటి ఆసక్తి కరమైన విషయాలు ఈ భాగంలో వినవచ్చు. 

తిలక్ కథలు Vol 2

Tilak Kathalu
Tap to listen

కవులతో కిటకిటలాడుతున్న రైలులో ఎక్కిన ఒక కవిత అనుభవమేమిటో కేవలం ఒకే ఒక్క పేజీలో ఇమిడ్చిన అతి పొట్టి కథ “కవుల రైలు’ కథలో మనం చూస్తాం. రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అది అతని స్వభావమైనట్టు. కానీ దాని వెనక ఉన్న కారణం ఏమిటి, అది తెలిసిన ఒకే ఒక్కరు ఎవరు? నవ్వు కథ వింటే గానీ తెలియదు. వినండి. పదహారు కథలున్న ‘తిలక్ కథలు’ రెండవ సంపుటం. 


ఈ పాడ్‌కాస్ట్ దాసుభాషితం App లో వినడానికి ఇక్కడ టాప్ చేయండి. ఇంకా ఈ పాడ్‌కాస్ట్ ను YouTube లో, Apple, Google Podcasts లోను, ఇంకా దాసుభాషితం భాగస్వామ్య వేదికలన్నింటిలో మీరు వినవచ్చు.


Image Courtesy :