#33 – "భవ్యమైన..." విడుదల.

Dasu Kiran
January 11, 2021

తల్లితండ్రులు తమ పిల్లల చదువుపట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. పిల్లలందరూ అటుఇటుగా ఒక విధానానికి, ఒక curriculum కు స్పందిస్తారు. అయితే కొంతమంది పిల్లలు, సగటు కన్నా తక్కువగా స్పందిస్తారు. వారి తల్లితండ్రులు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు.

తల్లితండ్రులు తమ పిల్లల చదువుపట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. 

పిల్లలందరూ అటుఇటుగా ఒక విధానానికి, ఒక curriculum కు స్పందిస్తారు. అయితే కొంతమంది పిల్లలు, సగటు కన్నా తక్కువగా స్పందిస్తారు. వారి తల్లితండ్రులు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. నిజానికి, కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పరిశోధన జరిగింది. నేర్చుకోవటంలో ఇబ్బందులు పడే పిల్లలకే కాకుండా, పిల్లలందరిలో నేర్చుకునే సమర్ధతను పెంచటానికి చాలా సదుపాయాలూ వెసులుబాట్లూ ఉన్నాయి. ఇవి తల్లితండ్రులందరికీ ఉపయోగపడతాయి.

అయితే వీటిని తల్లితండ్రులకి తెలియజేసే మానసిక నిపుణులు 10 వేల జనాభాకి ఒక్కరు ఉండాల్సింది, భారతదేశం లో 2 లక్షల జనాభాకు ఒకరున్నారు. వారూ ఎక్కువ నగరాల్లోనే ఉంటారు. మరి చిన్న నగరాల్లో, గ్రామాల్లో ఉండే తల్లితండ్రులకి ఇవి తెలిసే అవకాశం ఏది. 

వారికి తెలుగులో సరళంగా సులువుగా ఈ విషయాలన్నీ అందేట్టు, శ్రవణ పుస్తక మాధ్యమం ద్వారా దాసుభాషితం ప్రముఖ మానసిక నిపుణులు శ్రీమతి సుధా మాధవి గారి సౌజన్యంతో ఇప్పుడు 'భవ్యమైన శైశవం, బాల్యం, కౌమారం' అనే మూడు శ్రవణ పుస్తకాల ద్వారా అందిస్తోంది. 

ఇప్పటివరకూ, వినోద ప్రధానంగా ఉండే కాంటెంట్ ను ఇప్పటి వరకు అందిస్తూ ఉన్న దాసుభాషితం, 'విశ్వదర్శనం' శ్రవణ పుస్తకం తో విజ్ఞానం, 'భవ్యమైన శైశవం, బాల్యం, కౌమారం' శీర్షికలతో 'వికాసం' పరమైన విషయాల మీద కూడా కాంటెంట్ ను అందిస్తుంది.

ఈ శీర్షికలను ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాసం నిపుణులు, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, Dec 20, ఆదివారం, సాయంత్రం 4 గం లకు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం లోనే 'దాసుభాషితం CPB SPB తెలుగు పోటీ' విజేతలను కూడా ప్రకటించారు.    


ఈ కార్యక్రమాన్ని మీరూ తప్పక వీక్షిస్తారని ఆకాంక్షిస్తున్నాము. మీ సర్కిల్ లో పిల్లల ప్రవర్తన తో ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులుంటే వారినీ ఈ కార్యక్రమ YouTube లింకును పంపండి. 
https://youtu.be/TH8E5VAq9Jo


Image Courtesy :