క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా బట్టల కొట్టువాళ్ళు పెట్టే పండుగ ఆఫర్లను మించిన ఆఫర్ దాసుభాషితం ఇస్తోంది. మనలాంటి పుస్తక పురుగులకు ఈ పండుగలతో సమానమైన పండుగ ఏమిటి? ఇంకేంటి, పుస్తకాల పండుగ కదా. అందుకే గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి ఆఫర్ తెచ్చేశాం మీ కోసం.
డిసెంబర్ 19 నుండి 29 వరకు హైదరాబాద్‌లో పుస్తకాల పండగ మొదలవుతుంది. ఈ పండుగ సందర్భంగా, దాసుభాషితం శ్రోతల కోసం గత సంవత్సరాల్లో మాదిరిగానే ఒక అద్భుతమైన ఆఫర్ ఇది. ఈసారి మేము బుక్ ఫెయిర్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేయకపోయినా, ఈ ఆఫర్ ఇస్తున్నాం అంటే మేం ఎంత మంచివాళ్ళమో కదా.
ఈ ఆఫర్ కొత్త యూజర్ల కోసం, అలాగే మా పాత శ్రోతలకు సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి ఒక సువర్ణావకాశం. ₹3600/- విలువ చేసే వార్షిక సభ్యత్వం ఇప్పుడు కేవలం ₹999/- కే లభిస్తుంది. వందలాది శ్రవణ పుస్తకాలు, సమగ్ర శ్రేయస్సు కంటెంట్‌తో కూడిన మా యాప్ సేవలను నిరంతరాయంగా పొందడానికి ఇదే సరైన సమయం.
ఈ ప్రత్యేక ఆఫర్‌ను పొందడం చాలా సులభం. మీరు ఈ న్యూస్‌లెటర్‌లో కింద ఇవ్వబడిన లింక్‌ను క్లిక్ చేసి కానీ, మీ దాసుభాషితం యాప్‌ను ఓపెన్ చేసి, హోమ్ స్క్రీన్‌పై ఉన్న ప్రత్యేక బానర్‌ను క్లిక్ చేయడం ద్వారా వెంటనే సభ్యత్వాన్ని పొందవచ్చు లేదా రెన్యూవల్ చేసుకోవచ్చు.
త్వరపడండి! ఈ ఆఫర్ గడువు జనవరి 15వరకూ మాత్రమే. గత సంవత్సరం పుస్తక ప్రదర్శనశాలలో సంవత్సర సబ్ స్క్రిప్షన్ ను తీసుకున్నవారికి జనవరి 15వ తేదీతో ఆ సబ్ స్క్రిప్శన్ ముగిసిపోతుంది. కాబట్టి ఈసారి మేము ఇస్తున్న ఈ ఆఫర్ ద్వారా 999కే మీ సబ్ స్క్రిప్షన్ ని renew చేసుకోండి.
స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు, మీరు ఓ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి. మీకు తెలిసిన ఇంకో ముగ్గురి చేత సబ్ స్క్రిప్షన్ తీయించండి. వారిని చెరో ముగ్గురి చేత సబ్ స్క్రిప్షన్ కట్టించమని చెప్పండి. బ్రహ్మానందం చెప్పినట్టు ‘knowledge is divine’ ఎంత తాగితే అంత బలం. మీరు తాగండి, నలుగురి చేత తాగించండి (మందు కాదండోయ్.. జ్ఞానం).
Offer Link : https://rzp.io/rzp/hbf-2025
అభినందనలు,
మీనా యోగీశ్వర్.


