#15 ఆల్ ఇండియా రేడియో

Dasu Kiran
June 19, 2020

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ఆదివారం అనుబంధంలో కథలు చదివే వారికి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి సుపరిచితమైన పేరు. జీవితంలోని సాధారణ ఘట్టాల్లోనుంచి హాస్యాన్ని, మజ్జిగ మీద వెన్నని తీసినట్టు అవలీలగా తీసి వడ్డించడంలో విజయలక్ష్మి గారిది అందె వేసిన చేయి. ఉదాహరణకి ‘ఆల్ ఇండియా రేడియో’ కథని వింటే ఆమె హాస్యశైలి ఇట్టే తెలిసిపోతుంది.

మొదటగా చెప్పవలసింది, దాసుభాషితం App Android ఫోన్లకి 2.1.0, అదే iPhone కి 2.2.2 వెర్షన్ లు విడుదలైనాయి. App Store / Play Store వెళ్లి App ను update చేసుకోండి.

ఈ Update లో ముఖ్యంగా, మీరు చివరిగా విన్న పుస్తకం ఎక్కడ ఆపేశారో తిరిగి అక్కడ నుంచే వినే సౌలభ్యం అందిస్తున్నాము. App లో Contact Us లంకెను Freshdesk అనే Customer Support Software కి అనుసంధానించాము. మమ్మల్ని సంప్రదించడానికి మీరు దయచేసి ఈ లంకెనే వాడండి (WhatsApp కాదు).

Dasubhashitam Contact Us
Contact Us in the App menu


ఈ పద్దతి లో మీ ఇమెయిల్ కి మేము వేగవంతంగా స్పందించగలుగుతాము. పని దినాల్లో (Mon-Fri) 24 గంటల్లో ప్రతిస్పందించటానికి మేము కృషి చేస్తాము.

ఇంకో విషయం. కొంత మంది మాకు ఫలానా పుస్తకం App లో కనిపించటం లేదని తెలియజేసారు. Feature Page లో అన్నీ Titles ను చూపించటం సాధ్యం కాదు. ఇది App వేగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకనే మేము కొన్నింటిని ప్రతీ వారం తొలగిస్తాము. కానీ అవన్నీ యాప్ లో యథాతథంగా ఉంటాయి. App లో Magnifying glass icon ను టాప్ చేసి Search చేయటం ద్వారా మీరు వాటిని చూడగలుగుతారు.ఇక, ఈ వారం విడుదలలో కూడా హాస్యరసానిదే అగ్ర తాంబూలం. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ఆదివారం అనుబంధంలో కథలు చదివే వారికి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి సుపరిచితమైన పేరు. జీవితంలోని సాధారణ ఘట్టాల్లోనుంచి హాస్యాన్ని, మజ్జిగ మీద వెన్నని తీసినట్టు అవలీలగా తీసి వడ్డించడంలో విజయలక్ష్మి గారిది అందె వేసిన చేయి. 

ఉదాహరణకి ‘ఆల్ ఇండియా రేడియో’ కథని వింటే ఆమె హాస్యశైలి ఇట్టే తెలిసిపోతుంది. అవి ఇంకా ఊళ్ళల్లో కరెంట్ లేని రోజులు. ఓ ఊళ్ళో ఓ అమాయకపు అమ్మమ్మ తాతయ్యలకి వాళ్ళ అల్లుడు గారు ఒక రేడియో ఇస్తారు. అల్లుడి నుంచి వస్తువు తీసుకోవటానికి మనస్సంగీరించకపోయినా , మర్యాద కొద్దీ తీసుకుంటారు. రేడియోలో చాలా స్టేషన్లు ఉన్నా, అన్నీ ఊళ్లు తిరగలేమని విజయవాడలోనే ముల్లును ఉంచేయమంటారు. ఓ రోజు ఆ రేడియో చెడిపోతుంది. రోజూ గుమిగూడుతున్న ఊళ్ళో వాళ్లందరికీ వినపడేలా చెప్పటం వల్లనే రేడియో శక్తి క్షీణించి ఉంటుందని అనుమానిస్తోంది అమ్మమ్మ. ఇలా సాగుతుంది ఆల్ ఇండియా రేడియో కథ. 

విజయలక్ష్మి గారి కథలన్నింటిలో ఇటువంటి సునిశిత హాస్యమే ఉంటుంది. వింటున్నంతసేపు మీ పేదాల  మీద చిరునవ్వు ఉంటుంది. మనసు తేలికపడుతుంది. ఉదయం / సాయంత్రం మీ నడకలో వినటానికి అనువైన కథలివి. 

ఈ కథలతో, శ్రీమతి హిమజ సుమన్ అనే కొత్త గళ కళాకారిణిని పరిచయం చేస్తోంది దాసుభాషితం.  ఆమె తీయటి గళంలో ఈ కథలు మీకు తప్పక నచ్చుతాయి. ఈ కథలను వినటానికి ఇక్కడ టాప్ చేయండి.

Katragadda Murari
Tap to listen


తమిళ చలనచిత్రాలన్నింటికీ పేర్లు తమిళ పదాల్లోనే ఎందుకుంటాయో కాట్రగడ్డ మురారి గారి ముఖాముఖీ వింటేనే తెలిసింది. ఉదాహరణకు విశాల్ చిత్రం ‘తుప్పారివాలన్’ అంటే నేర పరిశోధకుడు అని అర్థం (దీనినే తెలుగులో డబ్ చేసి ‘డిటెక్టివ్’ అని విడుదలచేశారు). నిజానికి వ్యావహారికంగా తమిళులు కూడా డిటెక్టివ్ అనే అంటారు. కానీ తమిళ చిత్రాలకి పేర్లు తమిళంలో లేకపోతే సబ్సిడీలు ఇవ్వరు. భాషని నిలబెట్టుకోవడానికి వారు చేసే ప్రయత్నాలలో ఇదొక చిన్న ఉదాహరణ.

కాట్రగడ్డ మురారి 90 దశకం వరకు విజయవంతమైన చిత్రాలు తీసిన సినీ నిర్మాత. సీతామాలక్ష్మి, గోరింటాకు, జానకీరాముడు, నారి నారి నడుమ మురారి లు ఆయన తీసిన సినిమాలలో కొన్ని. డాక్టర్ చదువు మానేసి మరీ దర్శకుడవుదామని చిత్ర రంగం ప్రవేశం చేసిన మురారి గారు, దర్శకత్వం కూడా మానేసి నిర్మాతగా ఎందుకు మారారు? తాను తీసిన సినిమాలేవీ కళాఖండాలు కావు అని ఒప్పుకునే మురారి, తన చిత్రల్లో ఏ ఒక్క విషయంలో తన మాటే నెగ్గాలనుకునేవారు? ఇంకా చాలా ఆసక్తి కలిగించే విషయాలు ఈ చిన్న ముఖాముఖీ లో వింటారు.

Kaasi Majilee Kathalu
Tap to listen

కాశీ మజిలీ కథలు 6 భాగంలో 57వ మజిలీలో స్వయంప్రభ కథతో మొదలై, మొత్తం 45 కథలు, ఉపకథలతో, యజ్ఞ శర్మ, దుర్గ కథలతో 99వ మజిలి వద్ద ముగుస్తుంది.


Image Courtesy :