కాళిదాసాదులు ఇచ్చిన అమృతాన్ని పారేసుకుందామా..?

Meena Yogeshwar
March 14, 2023

ఒక యువకుడు తాను కూర్చున్న కొమ్మని నరుకుతున్నాడు. రాజుపై కోపం కలిగిన ఒక పండితుడు ఇతణ్ణి తీసుకువెళ్ళి, మాహా విద్వాంసుడని అబద్ధం చెప్పి, రాకుమార్తెకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మొదటి రాత్రి భార్య అతణ్ణి పలకరిస్తూ ‘అస్తి కశ్చిత్ వాగ్ విశేషః’ అంటే ‘ఏమైనా కబుర్లు/విశేషాలు ఉన్నాయా’ అందిట సాహితీ చర్చకు ప్రారంభంగా. ఆయన బుర్ర గోక్కుని తనకేమీ రాదని చెప్పాడట. ఎంతో ఆశాభంగం అయిన భార్య, ఆ జగదంబను వేడుకుంటే కనీసం మాట్లాడడమైనా వస్తుంది అని భర్తకు ఉపదేశించింది.ఆ అమ్మ ఆలయానికి వెళ్ళాడు. మనసు లగ్నం చేసి, ఘోర తపస్సు చేశాడు. సకల విద్యల తల్లి శ్యామలాంబ ప్రత్యక్షమైంది. అతని నాలుకపై బీజాక్షరాలు రాసింది. అంతే...

ఒక యువకుడు తాను కూర్చున్న కొమ్మని నరుకుతున్నాడు. రాజుపై కోపం కలిగిన ఒక పండితుడు ఇతణ్ణి తీసుకువెళ్ళి, మాహా విద్వాంసుడని అబద్ధం చెప్పి, రాకుమార్తెకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మొదటి రాత్రి భార్య అతణ్ణి పలకరిస్తూ ‘అస్తి కశ్చిత్ వాగ్ విశేషః’ అంటే ‘ఏమైనా కబుర్లు/విశేషాలు ఉన్నాయా’ అందిట సాహితీ చర్చకు ప్రారంభంగా. ఆయన బుర్ర గోక్కుని తనకేమీ రాదని చెప్పాడట. ఎంతో ఆశాభంగం అయిన భార్య, ఆ జగదంబను వేడుకుంటే కనీసం మాట్లాడడమైనా వస్తుంది అని భర్తకు ఉపదేశించింది.

ఆ అమ్మ ఆలయానికి వెళ్ళాడు. మనసు లగ్నం చేసి, ఘోర తపస్సు చేశాడు. సకల విద్యల తల్లి శ్యామలాంబ ప్రత్యక్షమైంది. అతని నాలుకపై బీజాక్షరాలు రాసింది. అంతే గుక్కతిప్పుకోకుండా ఆమెను, ఆమె కటాక్షాన్నీ, ఆమె నివాసమైన మణిద్వీపాన్నీ అతి క్లిష్టమైన సమాసాలతో వర్ణించాడు. సకల విద్యల సారం భాసించింది. భార్య తనతో మాట్లాడిన మొదటి మాటలను గుర్తుపెట్టుకున్నాడు. అమ్మ అనుగ్రహానికి దారి చూపిన గురువుగా భార్యను భావించి, ఆమెకు గురుదక్షిణా అన్నట్టుగా మొదటి పదం ‘అస్తి’ తో ‘అస్తిత్యుత్తరస్యాం విశిదేవతాత్మ హిమాలయోనామ నగాధిరాజః’ అని మొదలుపెట్టి “కుమారసంభవం” కావ్యాన్ని రాశాడు. రెండో పదం ‘కశ్చిత్’ తో ‘కస్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారా ప్రమత్తః’ అంటూ మొదలయ్యే “మేఘసందేశం’ రచించాడు. ఇక మూడో పదం ‘వాక్’ ను తీసుకుని ‘వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అని కీర్తిస్తూ “రఘువంశం” కావ్యాన్ని మొదలుపెట్టాడు.

‘నా ఋషిః కురుతే కావ్యం’ అన్న శాస్త్రవాక్యానికి ఉదాహరణగా నిలిచిన కాళిదాసు గురించిన ఈ చాటు కథ మనలో చాలామందికి తెలిసి ఉండచ్చు. కానీ, ఆయన రాసిన కావ్యాలు మనలో ఎంతమందిమి చదివాం? ఆ కావ్యాలలోని సౌందర్యం, సౌకుమార్యం, జ్ఞానం, ఆ రససౌగంధం మనలో ఎందరిని తాకింది? భారతీయ సారస్వతంలో అత్యంత ప్రముఖమైన, ప్రసిద్ధి చెందిన ప్రక్రియ అయిన కావ్యం చదవగలవారం ఎందరం? అరాయించుకోగలవారం ఎందరం? ఆ కావ్య పరీమళాలను ఆఘ్రాణించగలవారం ఎందరం?

ఒకప్పుడు భారతీయ విద్యాభ్యాసంలో అత్యంత ముఖ్యమైన, విడదీయలేని పాఠాలుగా నిలిచిన సంస్కృత, తెలుగు కావ్యాలు నేటి విద్యా విధానం కింద పడి నలిగిపోయాయి. కనీసం ఈ రెండు భాషలలోని పంచమహాకావ్యాలను గురించి తెలిసిన పిల్లలు ఎంతమంది? దాదాపుగా ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోనూ రెండు రకాల తెలివితేటలు ఉంటాయి అంటారు. అవి ‘Book Smart’, ‘Street Smart’. మన కావ్యాలు ఈ రెండు రకాల తెలివితేటలనూ మనిషిలో నింపగల potential కలిగి ఉండేవి. అందుకున్నవారికి అందుకున్నంత జ్ఞానం. అలాంటి విలువైన జ్ఞానామృతాన్ని పారేసుకుంటున్నాం, ఆ రస భాండాన్ని వదిలేసుకుంటున్నాం. సరస్వతీ నదిలాగానే మన భారతీయ సారస్వతం అంతా అంతర్వాహిని అయిపోతోంది.

అయితే, ఈ కావ్య జ్ఞానాన్ని సామాన్యులకు చేర్చమని తన ప్రతినిధిగా ఆ చదువుల తల్లి ప్రతి తరానికీ ఒకరిని ఈ జాతికి పంపుతుందేమో. అలా మన తరానికి అందిన భారతీ అంశ డాక్టర్ మైథిలీ అబ్బరాజు. ఆమె రూపం, మాట, అక్షరం, ఊహ, ప్రతిపాదన ఇలా అన్నిటిలోనూ ఒక సౌకుమార్యం, ఒక ముగ్ధత్వం, ఒక స్థిరత్వం, ఒక కరుణ తొణికిసలాడతాయి. బహుశా, కాళిదాసు నుండి నేటి మైథిలీ గారి వరకూ శారదా అనుగ్రహం సంపూర్ణంగా పొందినవారి లక్షణాలు ఇలానే ఉంటాయేమో.

ఒక విషయాన్ని తను ముందుగా అర్ధం చేసుకుని, జీర్ణించుకుని, దానికి తన ఆలోచనను జోడించి, ఒక బిడ్డను తనలో తయారు చేసినంత జాగ్రత్తగా పెంచి, ఒక్కో అక్షరాన్నీ తూచి, ఏ పదం అయితే తన భావాన్ని గంభీరంగా పాఠకుణ్ణి చేరుతుందో దానిని అమర్చి, తనకు స్ఫురించినది మొత్తాన్నీ దాచుకుకోకుండా మనపై కరుణా వృష్టిలా కురిపిస్తారు ఆమె. తనకు స్ఫూర్తినిచ్చిన రచయితలకు, స్ఫురింపజేసిన మేధలకు జ్యోతలు చెప్పగల నిజాయితీ ఆమె సహజ స్వభావం. ఈ మూల స్తంభం లోపించిన ఎందరో మహా మేధావులు మనకు తెలిసు కాబట్టీ, ఆమె gestureకు ఎంతగానో ఆనందిస్తాం.

అగరుపొగలు అల్లుకున్న గదిలోకి తలుపు తోసుకుని వెళ్ళగానే, ఒక్క నిమిషం ఊపిరి ఆడదు. ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. కానీ ఆ సౌగంధాల వెనుక పరిగెట్టి, ఒక్కో వాయుకణాన్నీ పీల్చాలనుకుంటాం. అలా ఉంటాయి ఆమె అక్షరాలు. మొదట ఆ శైలి మనకు ఊపిరాడనివ్వదు. కానీ, ఒక్క నిమిషం గడిచాకా, ప్రతీ పదంలోని కూర్పు మనల్ని మురిసిపోయేలా చేస్తుంది. చదివిన వాక్యమే మళ్ళీ చదివి, ఆమె పదాల పొదిగిన తీరుకు సలాం కొట్టిస్తాయి. నిండుగా పరచుకున్న వెన్నెలలో, చల్లని మల్లెపందిరి కింద, దూరంగా మనకోసమే ఎవరో మీటుతున్న వీణను, నెమ్మదిగా వీస్తున్న గాలి చెవుల దాకా చేరవేస్తుంటే ఎలా ఉంటుందో, ఆమె రచన చదువుతుంటే అంత హాయిగా ఉంటుంది.

శాకుంతలం, కుమారసంభవం, నర్తనశాల, కుందమాల, రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలను మనకు అర్ధమయ్యేలా, ఆ నిధిలో ఉన్నవాటిని మనదాకా అందించే నిజాయితీతో కూడిన ప్రయత్నం చేశారు మైథిలీ గారు. ఆమెకు అర్ధమైనవి, స్ఫురించినవి, తన శక్తి కొలదీ అంతరార్ధాలను అందుకున్నవి, వేరే రచయితలు, అధ్యయనకారులు వివరించినవి అన్నిటినీ కలిపి మనకు అందంగా, అర్ధవంతంగా, అందుకోగలిగేంత దగ్గరగా తీసుకువచ్చారు. వాటన్నిటినీ దండ గుచ్చి ‘కావ్య భారతి’గా మీకు అందించ పూనుకున్నాం. ఈ వారం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంపై మైథిలీ గారు రాసిన వ్యాసం ‘సహృదయ ప్రమాణం.. సంస్మరణీయ శోభ శాకుంతలం’ విడుదల అవుతోంది. ఆ శరత్ జ్యోత్స్నలో, శకుంతల బాధకు కరిగి, ఆ వీణాపాణి మీటే  పదాలను వినండి.

ఆత్మదృష్టి

Tap to Listen

జీవితం ఎవరితోనూ అబద్ధాలాడదు. ఉన్నది ఉన్నట్టుగా నిర్మొమహమాటంగా అందించేస్తుంది. నిరుద్యోగి అయినా, గుమాస్తా అయినా, వ్యాపారస్తుడైనా, ఆఖరికి ప్రధానమంత్రి అయినా జీవితం దాని గమనాన్ని మార్చుకోదు. పదవికో, ఆస్తికో గౌరవం ఇచ్చి, తనని తాను తగ్గించుకోవడం/పెంచుకోవడం వంటివి చేయదు. అందుకే జీవితమే మనకు అతిపెద్ద బడి. అది నేర్పే పాఠాలు మరెక్కడా దొరకవు. అలాంటి జీవితం నుండే కథలు వస్తే అవి ఎంత ప్రభావవంతంగా ఉంటాయో మరి వివరించనవసరం లేదేమో.

తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఇంద్రగంటి జానకీబాల గారు, తాను నేర్చుకున్నదాని సారాన్ని అంతా తన కథలలో ఒంపారు. ప్రసిద్ధ సాహితీ కుటుంబం అయినా ఇంద్రగంటిలో మెట్టిన ఆమె,  మిగిలినవారి కీర్తి ఛాయలలో ఆగిపోలేదు. తనదైన సాహితీ శాఖలను విస్తరింపజేశారు. తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు. ఆంగ్లంలో ‘Slice of life’ అనేది ఒక గొప్ప భావజాలం. అంటే జీవితంలోని ఒక ముక్క అన్నమాట. మన బతుకును ఎన్ని ముక్కలుగా కోసినా, ప్రతీ ముక్కలోనూ అన్నీ  భావోద్వేగం, అనుభవం సమానంగా వస్తాయి. అలా అన్నిటి సమాహారమే జానకీబాల గారు రాసిన ‘ఆత్మదృష్టి’ కథా సంపుటి. ఈ వారం విడుదల అవుతోంది.

మీరు గమనిస్తే ఈ వారం విడుదల అవుతున్న వాటి రచయిత్రులు ఇద్దరూ సీతామహాలక్ష్ములే. పైగా ఇద్దరివీ సీతాదేవి పుట్టినింట ఉన్న రూపాల పేర్లే. ఒకరు జానకీ బాల అయితే, మరొకరు మిథిలా నగరపు ముద్దుల బిడ్డ మైథిలీ. అందులోనూ ఈ మహిళా దినోత్సవపు దగ్గర్లో ఒకరు భర్తచే మరచిపోబడిన ఒక ఆడకూతురు కష్టాన్ని వివరిస్తోంటే, మరొకరు జీవితపు సారాన్ని అందిస్తున్నారు. ఎంత చిత్రమో కదా. ‘శ్రీ భారతీ శిరసా నమామి’ అంటూ ఆ తల్లులిద్దరూ కటాక్షిస్తున్న జ్ఞాన క్షీరాన్ని అందుకుందాం రండి.

అభినందనలతో,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :