అనువదించడం అంత వీజీ కాదు..

Meena Yogeshwar
May 27, 2024

రచనలలో అన్నింటికన్నా తక్కువగా అంచనవేయబడింది అనువాదం. మనకు వచ్చిన ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి తర్జుమా చేయడమే కదా అనుకుంటారు చాలామంది. కానీ, ఒక స్థల-కాలాలకు సంబంధించిన ఒక విషయాన్ని, మూల భాష సంస్కృతిని అర్ధం చేసుకుంటూ, రచయిత హృదయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడమే కాక, వారి అభిప్రాయాలను కూడా పూర్తిగా నమ్మి, వేరే రచయిత శైలిని కొనసాగిస్తూ, మన శైలిని రానీయకుండా జాగ్రత్త పడుతూ ఒక్క వాక్యం రాయాలన్నా ఎంత కష్టమో, అనువాదం చేసినవారికే తెలుస్తుంది. పక్కనుండి చూస్తే అర్ధం కాదు. పైగా రచయితగా మనకంటూ ఒక వ్యక్తీకరణ ధోరణి ఉంటుంది. రచనా శైలి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టాలంటే ...

ఒకసారి తెలిసినవాళ్ళు నాతో ఓ మాట అన్నారు. స్వంతంగా ఏదైనా ఊహించి, రాయడమే కళ. అంతేగానీ నువ్వు చూసిన కథలు చెప్పడం, లేదంటే నాలుగు చోట్ల చదివి ఒక వ్యాసం రాయడం సాహిత్యం అనిపించుకోదు. అంతకన్నా తక్కువ ఏమిటంటే అనువదించడం. అప్పటికే ఒక రచయిత రాసినదాన్ని వేరే భాషలోకి మార్చినంత మాత్రాన అది రచనా సామర్ధ్యం అంటే ఎలా కుదురుతుంది. అందుకే వాళ్ళందర్నీ రచయితలు అనాలంటే నాకు నచ్చదు అన్నారు. ఒక్కసారి దిమ్మతిరిగింది నాకు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా సాహిత్యం విషయంలో అని.

ఎలాంటివారైనా తను చూసినదానికి ఊహ జోడించి మాత్రమే రాయగలరు. ప్రపంచంలో జరగని విషయాన్ని ఎంతకని ఊహించగలం ఎవరమైనా? ఒకవేళ అలా ఊహించి రాసినా, అందులో లోతు ఎక్కడ ఉంటుంది. పైగా అనుభవాలేగా అందులో ఏముంది? నేనూ రాయగలను. నేను తలుచుకుంటే పొత్తూరి విజయలక్ష్మి, సోమరాజు సుశీలను మించిపోయేలా అనుభవాలు రాయగలను అనుకునేవారిలో, అనుభవాలను వ్యక్తీకరించడం ఎంత కష్టం అనేది తెలియదు అనే చెప్పాలి. ఒక్క కథ రాసి చూస్తే తెలుస్తుంది మన తడాఖా. అలాగే వ్యాసాలు కూడా. నాలుగు చోట్ల చదివి, మనం ఒక Opinion కి వచ్చి ఒక వ్యాసం రాయడమే సరైన పద్ధతి. అప్పుడే మన దృక్పధానికి వైశాల్యం లభిస్తుంది.

ఇంక అన్నిటికన్నా underrated అనువాదం. మనకు వచ్చిన ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి తర్జుమా చేయడమే కదా అనుకుంటారు చాలామంది. కానీ, ఒక స్థల-కాలాలకు సంబంధించిన ఒక విషయాన్ని, మూల భాష సంస్కృతిని అర్ధం చేసుకుంటూ, రచయిత హృదయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడమే కాక, వారి అభిప్రాయాలను కూడా పూర్తిగా నమ్మి, వేరే రచయిత శైలిని కొనసాగిస్తూ, మన శైలిని రానీయకుండా జాగ్రత్త పడుతూ ఒక్క వాక్యం రాయాలన్నా ఎంత కష్టమో, అనువాదం చేసినవారికే తెలుస్తుంది. పక్కనుండి చూస్తే అర్ధం కాదు.

పైగా రచయితగా మనకంటూ ఒక వ్యక్తీకరణ ధోరణి ఉంటుంది. రచనా శైలి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టాలంటే, మనం అనువదించే రచయితకు ఎంతగా subscribe అయితే అది సాధ్యం అవుతుంది? పాఠకుల్లో రెండు రకాలు ఉంటారు. ఒక రకం వాళ్ళకి ఏ భాషకి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి, ఏ సంస్కృతికి చెందిన సాహిత్యం అయినా అనువాదంలో అచ్చ తెలుగు అయిపోవాల్సిందే. మనం ఒక మాట వింటూనే ఉంటాం. ఇది తెలుగేతర రచన అంటే నమ్మబుద్ధి కావడం లేదు, అంతగా తెలుగీకరణ చేశారు అని.

ఇక రెండో రకం పాఠకులు ఆయా స్థల-కాలాలకు, ఆ ప్రాంతపు సంస్కృతికి, అక్కడి జీవన విధానానికి, ఆ ప్రాంతపు ప్రజల ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకునే స్థితికి తీసుకువెళ్ళగల అనువాదాలను ఇష్టపడతారు. ఈ రెండు విధానాలలోనూ అసలైన అనువాదం అంటే రెండోదే అంటాను నేను. పూర్తిగా అసలు భాష, ప్రాంతాల నుండి దూరమైపోయి, అనువదించబడిన భాషలోకి వచ్చేయడం అంటే ఒక ప్రాంతపు మట్టిలో మాత్రమే దొరికే సారాన్ని అందుకుని పెరిగిన ఒక మంచి చెట్టును పెకిలించి, వేరే మట్టిలో నాటడం లాంటిది. చెట్టు బతికే ఉంటుంది కానీ, దాని మట్టిలో ఉన్నప్పుడు ఉన్నంత బలం, వేరే చోట రాదు. అందుకే పూర్తిగా వేరే భాషలోకి తెచ్చేయడాన్ని అనుసృజన అనచ్చేమో, అనువాదం మాత్రం కాదు.

పైకి కేవలం తర్జుమా మాత్రమే అన్నట్టు కనపడే అనువాదం, నిజానికి ఒక కళ. కొన్నిసార్లు ఒక భాషలోని ఒక పదం, ఆ నేలకి ఎంత personal అంటే, దానిని అనువదించడం అసాధ్యం. ఒకవేళ అటూ ఇటుగా అనువదించినా, ఆ పదానికి ఉండే అసలైన విలువ రాదు. అలాంటప్పుడు ఒక అనువాదకుడు/రాలు ఏం చేయాలి? అలాగే కొన్ని విషయాలు ఆ ప్రాంతానికే ప్రత్యేకం. తెలుగువాళ్ళు ఎవరైనా మంచి కబురు చెప్తే, వెంటనే వాళ్ళ నోరు తీపి చేస్తారు. ఏదైనా పిండివంటతో ఆ సంతోషాన్ని celebrate చేసుకుంటారు. అదే అమెరికా లాంటి చోట్ల Champagne సీసా open చేస్తారు. Cheers చెప్పుకుంటారు. మనకి ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా ఎప్పుడూ వేరే దేశాలను చూడనివారికి. పుస్తకాలు, సినిమాలేగా మాధ్యమం.

అలాంటిది ఓ ఆంగ్ల పుస్తకాన్ని అనువాదం చేస్తున్న ఒక రచయిత, మన దగ్గర అలా మందు తాగరు కాబట్టీ, వాళ్ళు పాయసం వండుకున్నట్టు మారుస్తాను అంటే ఎంత అసమంజసంగా ఉంటుంది. మరీ ఇంత పెద్ద పెద్ద విషయాలు నిజంగా మార్చకపోయినా, చాలామంది పెద్ద అనువాదుకులే, తెలుగీకరించే ప్రయత్నంలో, అసలు పుస్తకంలోని ప్రాంతాలకు అన్యాయం చేసిన ఘట్టాలు చాలానే ఉన్నాయి. నా దృష్టిలో అందుకే అనువాదం అనిపించుకోదు, అనుసృజన అవుతుంది. నా దృష్టిలోనే సుమా. కొందరికి ఆ పద్ధతే నచ్చవచ్చు.  

అందుకే అనువాదం అంటే Decision Making. త్రాసుకు అటు ఉంటారా? ఇటు ఉంటారా? ఒక్కోసారి పాఠకులకు అర్ధం అవ్వడం కోసం మధ్యలో ఉంటారా అనేదే ఒక రచయితను గొప్ప అనువాదకుని/రాలుగా నిలబెడుతుంది. సమకాలీన సాహిత్యంలో అలాంటి ఒక మంచి అనువాదకురాలు నాకు తెలుసు. రచయితను జాగ్రత్తగా, ప్రేమగా పట్టుకుని, మనకి చూపిస్తారు ఆమె. భాష, ప్రాంతం, సంస్కృతి, రచయిత రచనా పటిమతో సహా మన కళ్ళెదురుగా సాక్షాత్కరింపజేయడం ఆమె ప్రత్యేకత.

ఎలమి ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు, కథకురాలు, అనువాదకురాలు శ్రీ పూర్ణిమ తమ్మిరెడ్డి గారి గురించే నేను మాట్లాడేది. మంటో, హమీద్ దల్వాయి లాంటి మహామహులను అనువదించిన ఘటికురాలు ఆమె. అందుకే, జూన్ నెల ప్రసంగానికి వారిని వక్తగా ఆహ్వానించాం. జూన్ మొదటి శనివారం 1వ తారీఖున ఉదయం 9.30గంటలకు ‘అనువాదం 101’ అనే అంశంపై మాట్లాడతారు పూర్ణిమ. అనువాద రచయితగా ఆమె అనుభవాల దగ్గర నుంచి ఈ సాహితీ ప్రక్రియలోని సులువులు, సూచనలు, కష్ట-నష్టాలు, తృప్తి కలిగించే సందర్భాలు ఇలా ఎన్నో మనతో పంచుకోనున్నారు. నేనైతే నా అనుమానాలు, ప్రశ్నలతో సిద్ధం. మరి మీరు?

జొయన్నా యులిసిస్ - విశ్లేషణ

మీకు ఎప్పుడైనా ఇంటి నుండి, బాధ్యతల నుండి, పని నుండి పారిపోయి, కొన్ని రోజులు ప్రశాంతంగా బతకాలి అనిపించిందా? అనిపించింది కదా. అనిపించాలి కూడా. ఎందుకంటే అది మానవ సహజం. చాలామంది అలా తమకి తాము సమయాన్ని కేటాయించుకోవడాన్ని తప్పుగా చూస్తారు. అలా చేయడం selfishness లాగా భావిస్తారు. ఒకవేళ అలా ఒక బ్రేక్ తీసుకుంటే తామేదో పెద్ద పాపం చేసేశాం అనుకుంటారు. ఇక ఇలాంటి ఆలోచన పంచుకుంటే మన పక్కన వాళ్ళ హడావిడి చెప్పాల్సిన పనే లేదు. అలా పని నుండి, బాధ్యతల నుండి బ్రేక్ తీసుకోవడం అంటే మహాపాపంగా చిత్రీకరిస్తారు.

ఆ మాటలేం వినకండి. ప్రతి వారికీ బ్రేక్ తప్పనిసరి. కాస్త ఊపిరి తీసుకోవాలి, కొంచెం ఒంటరిగా గడపాలి, ఉరుకులు పరుగులు లేకుండా కాస్త relax అవ్వాలి. అలా కాకుండా అక్కడే, ఆ చక్రంలోనే అలుపెరగక తిరగడం వలన మన quality of life, work కూడా తక్కువగానే ఉంటాయి. ఒక్కసారి refresh అయితే వచ్చే శక్తే వేరు. అంతకు ముందుకు, ఆ తరవాతకి మనం చేసే పనుల్లో, మనకే చాలా తేడా కనిపిస్తుంది. మనల్ని మనం చూసుకుంటేనే కదా, మన బాధ్యతల్ని మరింత passionతో నిర్వర్తించగలం? అదే మంత్రం. అదే కిటుకు.

Tap to Listen

అలా ఒక బ్రేక్ తీసుకున్న ఒక అమ్మాయి కథే ఈ నవల. ప్రముఖ ఆంగ్ల రచయిత్రి మేరి సార్టన్ 1963లో రాసిన నవల ఇది. తల్లిని కోల్పోయి, తండ్రి ఆలనా పాలనా, ఉద్యోగాలతో గానుగ బతుకు జీవిస్తున్న జొయన్నా అనే యువతి కథ ఇది. అదే చట్రంలో తిరిగే ఆమె తీసుకున్న ఒక చిన్న విరామం ఆమె జీవితాన్నే కాదు, ఆలోచనా ధృక్పధాన్ని కూడా మార్చేసింది. అంతే కాదు, అప్పటిదాకా కూతురిపై ఆధారపడే తండ్రిలోనూ పునురుజ్జీవనం నింపింది. 

అంతేకాదు యులిసిస్ జీవితాన్నీ మార్చేసింది. ఎవరా యులిసిస్? జొయన్నాకు యులిసిస్ కి సంబంధం ఏమిటి? జొయన్నా యులిసిస్ జీవితంలోకి ఎలా వచ్చింది? తరువాత ఏమైంది అనేవి ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు ఈ పుస్తకంపై రాసిన విశ్లేషణలో వినాల్సిందే. ఈ విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. పరుగులు పెట్టడం ఎంత ముఖ్యమో, ఒకసారి ఆపి, చుట్టూ చూడడం కూడా అంతే ముఖ్యం అని తెలుస్తుంది ఈ పుస్తకం గురించి వింటే. తప్పకుండా వినండేం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :