అపురూప శిల్పాలు అరగదీశారు.. మనవాళ్ళు

Meena Yogeshwar
February 20, 2023

అనగనగా ఒక యువరాజు. సింహాసనాన్ని అధిష్టించే వయసు వచ్చింది. రాజ్యంపై అవగాహన అవసరం అన్న తండ్రి ఆజ్ఞ ప్రకారం మారువేషంలో రాజ్యం చూడడానికి బయలుదేరాడు. ఇది ఒకప్పటి కథ. నేటి కాలంలో ఒక మధ్యతరగతి యువరాజు ఉన్న పళంగా ఉద్యోగం పోయింది. ఏం చేయాలో అర్ధం కాని సమయం. ఈ పరిస్థితి ప్రతీవారినీ ఒకోలా మారుస్తుంది. కొందరు ఉద్యోగంలో ఉన్నదాని కన్నా ఎక్కువ కష్టపడి కొత్త ఉద్యోగపు వేటలో మునిగిపోతారు. మరికొందరు...

అనగనగా ఒక యువరాజు. సింహాసనాన్ని అధిష్టించే వయసు వచ్చింది. రాజ్యంపై అవగాహన అవసరం అన్న తండ్రి ఆజ్ఞ ప్రకారం మారువేషంలో రాజ్యం చూడడానికి బయలుదేరాడు. ఇది ఒకప్పటి కథ. నేటి కాలంలో ఒక మధ్యతరగతి యువరాజు ఉన్న పళంగా ఉద్యోగం పోయింది. ఏం చేయాలో అర్ధం కాని సమయం. ఈ పరిస్థితి ప్రతీవారినీ ఒకోలా మారుస్తుంది. కొందరు ఉద్యోగంలో ఉన్నదాని కన్నా ఎక్కువ కష్టపడి కొత్త ఉద్యోగపు వేటలో మునిగిపోతారు. మరికొందరు కొత్త కోర్సులు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు డిప్రెషన్ లోకి జారిపోతారు.

అయితే, మన కథలోని ఈ యువరాజు మాత్రం కాస్త వెనక్కి వాలాడు. ఏం చేయాలో ఆలోచించే ముందు, తన ఆలోచనా పరిధిని విస్తృత పరచుకోవాలనుకున్నాడు. దాచుకున్న కొద్ది డబ్బుతో దేశాన్ని చూసి, లౌక్యాన్ని పెంచుకోవాలన్న కాంక్షతో బయలుదేరాడు. మన సంస్కృతికి పట్టుకొమ్మల వంటి దేవాలయాలను దర్శించాడు. అక్కడి శిల్ప సంపదకు దాసోహమయ్యాడు. ప్రతి రాయినీ, నదీతీరాన్నీ, పర్వత శిఖరాన్నీ, అక్కడి దుమ్ముని, చిన్న గడ్డి పరకనీ వదలకుండా పలకరించాడు. అవి చెప్పిన కథలు విన్నాడు. విని వదిలేయలేదు. తిరిగి మనకి చెబుతున్నాడు. చేయి పట్టుకుని తనతో మనల్ని కూడా ఆ ప్రదేశాలకి తీసుకువెళ్తున్నాడు. అతనే దాసుభాషితం డిజైన్ అసోసియేట్, ప్రముఖ కోరా రచయిత రామ్ కొత్తపల్లి. 

భారతదేశంలోని సమస్త విజ్ఞానాన్నీ మన దేవాలయాలలో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. ఉదాహరణకు నైవేద్యాలనే తీసుకుందాం. దక్షిణభారతదేశంలో చాలా ప్రాంతం వేడిగా ఉంటుంది. అలాంటి ఉష్ణ ప్రదేశాలలో కారం ఎక్కువగా ఉండే వస్తువులు తినడం ద్వారా మన శరీరానికి చెమటలు పట్టి, లోపల నుంచి చల్లగా ఉంటాం. కాబట్టీ, మన గుళ్ళలో ఎక్కువ భాగం మిరియాలు వేసిన పులిహార, దద్ధ్యోధనం, కట్టుపొంగలి వంటివి ప్రసాదాలుగా పెడతారు. ఇలా తీసుకుంటే, మన ఆధ్యాత్మిక, వృత్తి, ఆరోగ్య, విహార, జీవన, బాంధవ్య, సౌందర్యం ఇలా లౌకిక, పారలౌకిక విషయాలన్నిటినీ ఏదో రకంగా మన ఆలయాలలో చొప్పించారు.

ఆ విజ్ఞానాన్ని అందుకోవాల్సిన మనం, ఎదురు ఆ నిధులను పాడు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈనాటికీ పరమ పవిత్రమైన దేవాలయాలలో, చారిత్రకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశాలలో ఆనాటి రాజుల శాసనాల పక్కనే ఫలానా లవ్స్ ఫలానా అంటూ జుగుప్సాకరమైన శాసనాలు చెక్కేవారు కోకొల్లలు. ఇక గుప్తనిధుల కోసం గుహలలో, పురాతన దేవాలయాలలో తవ్వకాలు జరిపే వారికీ కొదవ లేదు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు ఉండే ప్రదేశాలను చెత్తతో నింపడంలో ప్రపంచ రికార్డు దక్కించుకునేవారిని లెక్కే వేయలేం. మరింత బాధాకారమైనది అజంతా, ఎల్లోరా, కంచి, రామప్ప, కోణార్క్, బేలూరు, హంపి వంటి ప్రదేశాలలో అపురూపమైన శిల్పాలను తాకి, తాకి అరగదీసి, నామరూపాల్లేకుండా చేసేసిన వారూ ఉన్నారు.

మన భారతీయులలో చాలామందిలో కళలపై ఉండే అవగాహనా లేమి, ప్రదేశాలను explore చేయడంపై ఉండే అలసత్వం, ఆ ప్రదేశాలను అలాగే అందంగా కాపాడుకునే విషయంలో ఉండే నిర్లక్ష్యం ఈ Destruction కి కారణం. మనలో చాలామందికి అమెరికా అంటే వల్లమాలిన ప్రేమ. కెరీర్, జీవనవిధానం, వ్యక్తిగత సంబంధాలు, ఆహారం ఇలా అన్నిటిలోనూ అమెరికన్లలా ఉండాలనుకుంటాం. కానీ వారి చీజ్ బర్గర్ ను తినే మనం, వారిలో ఉన్న Travelling అనే మంచి లక్షణాన్ని మాత్రం అలవరచుకోం. వారు తమ కెరీర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయినా సరే, ఏదైనా ప్రదేశాన్ని, సంస్కృతిని Explore చేయడానికి ప్రయత్నిస్తారు. తద్వారా తమ ధృక్పదాన్ని విస్తృతం చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు.

ఒకప్పుడు భారతీయులు తీర్ధయాత్రల పేరుతో లోకాన్ని చూసే వీలు కొంత మేరకు ఉండేది. అయితే గత రెండు, మూడు తరాలకు టూరిజంపై అందులోనూ ముఖ్యంగా మన దేశంలోని ప్రదేశాలపై శ్రద్ధ తగ్గింది. కానీ, కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ తరానికి మన భారతదేశంలోని ప్రదేశాలను Explore చేయాలన్న కుతూహలం పెరుగుతోందిట. అందులోనూ శిల్ప సంపద గల Heritage Tourism, పర్వతారోహణ వంటి వాటితో తమ రోజూవారీ ఒత్తిడి నుండి Relief పొందుతున్నారట. అలాంటి యువతరానికి ప్రతీక రామ్. విశేషం ఏమిటంటే అతనికి చూడడంతో పాటు, తన అక్షరాల విమానాలపై క్షణాల్లో ఆ ప్రదేశాలకు మనల్ని కూడా తీసుకువెళ్ళడమనే కళ కూడా బాగా వచ్చు. కాబట్టి ఆ రత్నాలు రాశులను అమ్మిన ఆ హంపి వీధులలో తిరిగి, తుంగ ఒడ్డున సేదతీరుదాం రండి.

రెండు మహానగరాలు - 2

Tap To Listen

ప్రపంచంలోని ఏ పనినైనా చేయాలనిపించే స్థితులు రెండే రెండు అవి ప్రేమ, ప్రతీకారం. రెండూ మనల్ని ఉన్నతస్థాయిలోనూ నిలపగలవు, అధః పాతాళానికీ తొక్కగలవు. ఈ నవల ఈ రెండిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. ఫ్రెంచి విప్లవ సమయంలో జరిగిన అల్లకల్లోలాన్ని ప్రతిఫలించే చారిత్రాత్మక నవల ఇది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాలలో ఇది కూడా ఒకటి. ఈ నవల ఆధారంగా 10కి పైగా సినిమాలు, ఎన్నో నాటకాలు, సంగీత-నృత్య రూపకాలు వచ్చాయి. ఈ నవల మొదటి భాగాన్ని మీరు ఇంతకుముందే రుచి చూశారు. అడుగడుగునా మలుపులతో, మతి చెదిరే సంఘటనలతో నిండిన ఈ రెండో భాగం ఈ వారం విడుదల అవుతోంది. ఆఖరికి ప్రేమ గెలుస్తుందా? పగ గెలుస్తుందా?

ది గర్ల్ ఇన్ ది వైట్ షిప్

Tap To Listen

మనలో చాలామంది ఎప్పుడైనా ఒక శశ్మాసనంలో ఒక్కరూ ఒక గంట గడపాలన్నా, కనీసం ఒక శవంతో ఒక్కరూ ఒక్క పూట గడపాలన్నా వణికిపోతాం. ఆ ఆలోచనే చాలామందికి నిద్ర లేని రాత్రులనిస్తుంది. కానీ ఒక 13ఏళ్ళ ఆడపిల్ల 50 శవాల మధ్య కొన్ని రోజుల పాటు ఒంటరిగా బతుకుతుంది. తిండి లేక, బతకాలన్న ఆశ చావక బతికిన అమ్మాయి కథే ఈ నవల. అంతే కాదు, ఉన్న దేశంలో బతుకు బరువై, ప్రభుత్వ ఆదరణ కరవై, వలస వెళ్ళే ఎన్నో దేశాలలోని, లక్షలాది ప్రజల కథ ఇది. ఇలానే ఎందరో కాందిశీకులు, ఎన్నో శతాబ్ధాలుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా వలస వెళ్తూ ధన, మాన, ప్రాణాలను కోల్పోయారు. వారందరి కథ ఇది. ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమతి మాలతీ చందూర్ రాసిన ఈ నవల విశ్లేషణ వింటే మనకు గుండె పిండేసినట్టు అనిపిస్తింది. అలాంటి అభాగ్యులకు మన వంతు ఏం చేయగలమా అని నిజంగా ఆలోచింపజేస్తుంది.

అభినందనలతో,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :