అరగంటలో అద్వైతం

Ram Kottapalli
April 8, 2024

మనిషి అద్వైత స్థితికి చేరుకునే ముందు అతను అడువులు, నదులు దాటక్కరలేదు. కొండలు, పర్వతాలు దాటి ఏదో అతీత శక్తిని చేరుకోవక్కరలేదు. అలా అన్ని వైపులకి తిరగకుండా సులువుగా నీ వైపుకే తిరిగితే అతి కష్టమైన ఆ అద్వైత సిద్ధి నీకు లభిస్తుంది. వెతుక్కుంటూ వెళ్ళే ఈ దేహానికి అడ్డంగా ఉన్నవి సందేహాలు, ఆ సందేహాల నుంచి వచ్చే ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి....

జ్ఞాన సముపార్జనకు మూలం సందేహం. సందేహం లేనిదే ప్రశ్న లేదు, ప్రశ్న లేనిదే సమాధానం లేదు. సమాధానం లేనిదే జ్ఞానం సమకూరదు. 

నిన్న జరిగిన అందరికీ అద్వైతం ప్రసంగం చివరలో కొండూరు తులసిదాస్ గారు చెప్పిన మాట ఇది. ఈ మాటను ఈ న్యూస్ లెటర్ కు ఓపెనింగ్ మెసేజ్ గా ఉంచడానికి ఒక కారణం ఉంది. 

మనిషి అద్వైత స్థితికి చేరుకునే ముందు అతను అడువులు, నదులు దాటక్కరలేదు. కొండలు, పర్వతాలు దాటి ఏదో అతీత శక్తిని చేరుకోవక్కరలేదు. అలా అన్ని వైపులకి తిరగకుండా సులువుగా నీ వైపుకే తిరిగితే అతి కష్టమైన ఆ అద్వైత సిద్ధి నీకు లభిస్తుంది. వెతుక్కుంటూ వెళ్ళే ఈ దేహానికి అడ్డంగా ఉన్నవి సందేహము, ఆ సందేహము నుంచి వచ్చే ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి దొరికాల్సిన సమాధానాలు. 

మీకు కలిగే ఆ సందేహాలు, ప్రశ్నలు కూడా ఒకరే వేసేసి వాటికి సమాధానాలు కూడా అరగంటలో ఇచ్చేస్స్తే ఎలా ఉంటుంది ? అవును తెలుసు సూక్ష్మంలో మోక్షం అనేది ఎప్పుడూ ఒక myth గానే ఉంటుంది కానీ అది సాధ్యమేనా కాదా ? దానికి సమాధానం మీరు ఈ ప్రసంగంలోనే చూడచ్చు. ఈ ప్రసంగంలో అద్వైత సాధన గురించి, అద్వైత సిద్ధి గురించి పోడూరి వెంకట రమణ శర్మ గారు అసలు Complicate చేయకుండా ఎక్కడ ప్రశ్న అక్కడ విరగ్గొట్టేస్తూ ఎంత సింపుల్ గా సమాధానం చెప్పారో మీరు చూస్తారు. ఆ సమాధానాలు ఎంత సింపుల్ గా ఉంటాయి అంటే ఒక 40 అంతస్తుల బిల్డింగ్ బయట నుంచుని పైకి ఎలా వెళ్ళాలి ? ఈ మెట్లన్నీ ఎక్కాలా ? ఇంత కష్టం పడాలా ? అమ్మో అసలు ఎందుకు ఎక్కాలి ? అసలు ఏంటి ఈ బిల్డింగ్ ? అని అసలు పైకి ఎక్కకుండా సంశయిస్తూ నుంచున్న వ్యక్తి దగ్గరకి వచ్చి “బాబూ నువ్వు అసలు ఇంత Complicate చేసుకొక్కరలేదు. ఇక్కడ లిఫ్ట్ ఉంది చూసావా అది ఎక్కు పైకి వెళ్తావు. అని ఒక్కసారిగా Lift Up చేసే విధంగా ఉంటాయి ఆ సమాధానాలు. 

పైన నేను చెప్పినట్లు అద్వైత సిద్ధికి అడ్డంగా ఉన్నవి అడువులు, నదులు, కొండలు పర్వతాలు కాదు. సందేహాలు, ప్రశ్నలు. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు ఎలా అనే ప్రశ్నలు. ఈ ప్రసంగంలో కొన్ని ప్రశ్నలని వక్త అయిన పోడూరి వెంకట రమణ శర్మ గారే వేసి వాటికి సరిగ్గా క్లుప్తంగా సమాధానాలు చెప్పారు. మరికొన్ని ప్రశ్నలు ప్రేక్షకులు వేశారు. అది కూడా అరగంటలో. మరి అరగంటలో అద్వైతం అంటే ఏమిటో వివరిస్తే ఏం అవుతుంది ? మళ్ళీ విభిన్న దృష్టి కోణాల నుండి వివిధ రకాల సందేహాలు, ప్రశ్నలు వస్తాయి. 

ఆ ప్రశ్నలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో చూడండి. 

1. ఆలోచనలు నీకు వస్తాయా ? నువ్వు తెచ్చుకుంటావా ? వస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి ? నువ్వు తెచ్చుకుంటే నీ తర్వాతి ఆలోచన ఎంటో నువ్వు వెంటనే చెప్పగలవా ?

2. నువ్వు అనేది ఏమిటో తెల్సుకోవాలి అంటే ధ్యానం చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి అన్నారు. నువ్వంటే కాళ్ళు చేతులూ మొహం ఉన్న శరీరమా ? ఆత్మ ? ఇలా ఎలా విచారణ చేస్తూ ధ్యాన ప్రక్రియ చేయాలో కొంచం వివరించగలరా?

3. మనం ఒక పాతికేళ్ళ వయసులో ఒక ఆర్ధిక లక్ష్యం పెట్టుకుంటాము. దాన్ని అద్వైత పరంగా ఎలా సాధించగలుగుతాము? 35 ఏళ్ల వయసులో అలాంటి లక్ష్యంతోనె ఉండి ఇప్పుడు నాకున్న ఇద్దరు పిల్లలని సరిగా చదివించడానికి వారి అవసరాలు తీర్చడానికి నేను చాలా శ్రమ పడుతూ త్యాగాలు చేస్తూ నా ఉద్యోగ బాధ్యత ఎలా నిర్వహించగలుగుతాను ?

4. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి పక్కాగా సమయపాలన చేయాల్సి ఉంటుంది. సమాయనికి లేవడం, సమయానికి సిద్ధం అయ్యి పనికి వెళ్ళి పని పూర్తి చేయడం ఇలా ఒక క్రమ శిక్షణ ఉంటుంది. కానీ అలా చేయలేం. ఎందుకంటే కొన్ని సార్లు అది వీలు అవ్వదు, మన చేతిలో ఉండదు. అప్పుడు చాలా గిల్ట్ గా అనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి ?

5. అద్వైతానికి కర్మ కి ఉన్న సంబంధం ఏంటి ?

6. ఒక వస్తువు కొన్నప్పుడు కంపెనీ వాడు యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, ఒక క్రికెట్ ఆట కి కూడా ఎలా ఆడాలో రూల్స్ అవి ఉన్నాయి. కానీ మనం మానవ జన్మ ఎత్తినప్పుడు దేవుడు అనేవాడు మనకు ఈ జీవితాన్ని మంచిగా ఎలా నిర్వహించుకోవాలో వచ్చి విధి విధానాలు ఎందుకు చెప్పలేదు ?

7. గీతలో కృష్ణుడు ఒక చోట ఇక్కడ అంతా నేనే వ్యాపించి ఉన్నాను అంటాడు. తర్వాత అర్జునా ఇక్కడ సగం నేను చంపాను, సగం నువ్వు చంపు అంటాడు, తర్వాత నువ్వు నేను ఒకటే అంటాడు, తర్వాత నువ్వు లేవు ఉన్నది మొత్తం నేనే అంటాడు ఎందుకు గీత మొత్తం ఇలా గందరగోళంగా ఉంటుంది ?

అద్వైతం అంటే ఎంటో అరగంటలో చెప్పేసినా ఇంకా రెండు గంటల సేపు ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలు శ్రోతలు రమణ శర్మ గారిని అడిగారు. వాటికి రమణ శర్మ గారు క్లుప్తంగా ముక్కుసూటిగా confusion లేకుండా సమాధానం చెప్పారు. ఈ ఆసక్తికరమైన ప్రసంగం వీడియోని మీ ముందుకి తీసుకురావడానికి మేము ఉవ్విళ్లూరుతున్నాము. ఈ ప్రసంగం రికార్డింగ్ త్వరలో ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఈ వారంలో మీ ముందుకు వస్తుంది. ఆ సిద్ధి కోసం సిద్ధంగా ఉండండి.

అభినందనలు, 

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :