సద్గురు జగ్గీ వాసుదేవ్ ను విమర్శిస్తూ అతను మిస్ అయిన 'పెద్ద' పాయింట్.

Dasu Kiran
May 15, 2023

ఈ మధ్య ఒక యూట్యూబ్ వీడియోలో కాందేవ్ అనే అతను సద్గురు జగ్గీ వాసుదేవ్ జీవితంపై ఒక సమగ్రమైన డాక్యుమెంటరీ చేశాడు. దాని సారాంశం శ్రీ జగ్గీ వాసుదేవ్ ఒక బూటకపు గురువు అని. వీడియో చూసి శ్రీ జగ్గీ వాసుదేవ్ పై ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరుచుకోవచ్చు. అయితే, పనిలోపనిగా పై వీడియోలో ఆత్మ జ్ఞానం అనేది కూడా బూటకం అన్నాడు. ఆత్మజ్ఞానికి సంబంధించి అతను స్థూలంగా చేసిన మూడు వాదనలు ఇవి...

ఈ మధ్య ఒక యూట్యూబ్ వీడియోలో కాందేవ్ అనే అతను సద్గురు జగ్గీ వాసుదేవ్ జీవితంపై ఒక సమగ్రమైన డాక్యుమెంటరీ చేశాడు. దాని సారాంశం శ్రీ జగ్గీ వాసుదేవ్ ఒక బూటకపు గురువు అని. 

పై  వీడియో చూసి శ్రీ జగ్గీ వాసుదేవ్ పై ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరుచుకోవచ్చు. అయితే, పనిలోపనిగా పై వీడియోలో ఆత్మ జ్ఞానం అనేది కూడా బూటకం అన్నాడు.

ఆత్మజ్ఞానికి సంబంధించి అతను స్థూలంగా చేసిన మూడు వాదనలు ఇవి. 

1. అద్వైత స్థితి (Enlightenment) బూటకం. 

2. మహామహులే 50-60 ఏళ్ళ సాధన తర్వాత కూడా ఆత్మ జ్ఞానం పొందలేరు. ఇక సామాన్యులు ఎంత.
3. ముందు జీవిద్దాము తర్వాత ఎన్‌లైటెన్‌మెంట్ కోసం తపిద్దాము.

వీటికి నేను నా ప్రత్యక్ష అనుభవం ఆధారంగా ప్రతి వాదనలు చేశాను.

ఆ వీడియో పైన ఉన్నది.

సాధకులకు అతి తీవ్రమైన అడ్డంకి అసలు గమ్యం పైనే అనుమానం రావడం. బ్రహ్మజ్ఞానం అంతా బూటకం అనే వాదన కొత్త సాధకుల్లో అనాసక్తత దారి తీయవచ్చు. ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వం ఉన్న భారతీయులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎందఱో, శాస్త్రవేత్తలతో సహా, అద్వైతాన్ని ఆకళింపు చేసుకుంటున్నారు. Science and Non-duality వంటి ఎన్నో సదస్సులు జరుగుతున్నాయి.

శాస్త్రంతో దోస్తి - 3

Tap to Listen


మన శాస్త్ర విజ్ఞానం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. నిన్నటి వరకూ అంతుచిక్కని ప్రశ్నకు చిక్కు ముడులు విప్పేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలా కూడా శాస్త్రాన్ని ఉపయోగించవచ్చా అని ప్రతీరోజూ ఏదో ఒక విషయంలో మనం ఆశ్చర్యపోతూనే ఉన్నాం. విద్యుత్తు, టెలీగ్రాఫ్ వంటి ఎన్నో అంశాలు మానవ పరిణామ క్రమాన్ని శాశ్వతంగా మార్చేశాయి. మూడు శతాబ్ధాల క్రితం జనాలు కలలో కూడా ఊహించలేనన్ని మార్పులు సమాజంలో రావడానికి శాస్త్రజ్ఞుల నిత్య కృషే కారణం.

అయితే, సామాన్య మానవునికి ఈ శాస్త్ర విషయాలలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఉంటాయి. అందరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయిన సెల్ ఫోన్ పనితీరు గురించి మనలో ఎంతమందికి తెలుసు. దాని పనితీరుపై మనకు ఎన్నో అపోహలు, భయాలు కూడా ఉన్నాయి. ప్రతీ ఇంటిలోనూ ఇప్పుడు తల్లిదండ్రులకు పారాయణ మంత్రాలు అయిపోయిన కొన్ని మాటలున్నాయి. ‘ఆ సెల్ ఫోన్ వాడడం వలనే నీ జుట్టు ఊడిపోతోంది’, ‘ఆ ఫోన్ వలన క్యాన్సర్ వస్తుందిట’, ‘ఫోన్ లోని రేడియేషన్ వలన మతిమరుపు వచ్చేస్తుందిట’ ఇలా లెక్కలేనన్ని అభాండాలను మోస్తోంది మన ఫోన్.

మరి వీటిలో నిజం ఎంత? నిజంగా మన ఫోన్ మనల్ని చంపేయగలదా? లేజర్ అంటే ఏమిటి? అసలు రేడియేషన్ అంటే ఏమిటి? వంటి ఎన్నో విషయాలను అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా వివరించారు ప్రముఖ శాస్త్రవేత్త, ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు అయిన వేమూరి వేంకటేశ్వరరావు గారు. తెలుగు Quora తో దాసుభాషితం కు ఉన్న భాగస్వామ్యంలో భాగంగా వారు ఇచ్చిన శాస్త్ర సంబంధమైన సమాధానాలను మీకు లెసన్స్ రూపంలో అందిస్తున్నాం.

Image Courtesy :