తెలుగు సినీ సంగీత సాగరంలో ఒక చిన్న మునక

Meena Yogeshwar
July 10, 2023

తెలుగు సినిమా ఒక రత్నగర్భ. తప్పటడుగులు వేసినా, తన చుట్టూ ఉన్న వాటిని పట్టుకుని నడక నేర్చుకునే పసిపాపలా, మొదట్లో తెలుగు సినిమా కాస్త తడబడినా, తన చుట్టూ ఉన్న కళారుపాల ఊతంతో నిలబడింది. తానే ఒక పెద్ద కళారూపంగా ఎదిగింది. అలా నాటకాలు, కర్ణాటక సంగీతం, శాస్త్రీయ నృత్యం సినిమాకు ఎంతగానో సాయం చేశాయి అనడంలో సందేహం లేదు. ఈ ప్రసంగాలలో శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ప్రముఖమైన జావళీలు, పదాలు, సినిమాలోనాయికలు, వారి అవస్థలు, పదం వంటి శాస్త్రీయ నృత్య విషయాలతో మొదలుపెట్టి.....

తెలుగు సినిమా ఒక రత్నగర్భ. తప్పటడుగులు వేసినా, తన చుట్టూ ఉన్న వాటిని పట్టుకుని నడక నేర్చుకునే పసిపాపలా, మొదట్లో తెలుగు సినిమా కాస్త తడబడినా, తన చుట్టూ ఉన్న కళారుపాల ఊతంతో నిలబడింది. తానే ఒక పెద్ద కళారూపంగా ఎదిగింది. అలా నాటకాలు, కర్ణాటక సంగీతం, శాస్త్రీయ నృత్యం సినిమాకు ఎంతగానో సాయం చేశాయి అనడంలో సందేహం లేదు. శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ప్రముఖమైన జావళీలు, పదాలు సినిమాలో తమ తమ స్థానాలను అలంకరించాయి. సినిమా లోతును, స్థాయినీ మరింత పెంచాయి.

జులై మొదటి శనివారం జరిగిన ప్రసంగం ‘తెలుగు సినిమాలో జావళీలు’ లో ప్రముఖ నృత్య కళాకారిణి, పిల్లల మానసిక నిపుణురాలు శ్రీమతి లక్ష్మీ భవాని గారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి థియరీ లెక్చరర్ రాధిక గారు, నృత్య విమర్శకురాలు, నాట్య గురువు సుధాశ్రీధర్ గారు ఒక తరగతి విద్యార్ధులకు చెప్పినంత ఓపికగా ఈ విషయాలను వివరించారు. ఇందులో నాయికలు, వారి అవస్థలు, జావళీ, పదం వంటి శాస్త్రీయ నృత్య విషయాలతో మొదలుపెట్టి, తెలుగు సినిమాలో అలనాడు కనిపించిన ఎన్నో జావళీలను, పదాలను చూపించారు.

నిజానికి ఈ ప్రసంగం చూసినప్పుడు మనకి వారి పరిశోధనా పటిమకి నమస్కరించాలనిపించడం ఖాయం. ఎంత ఇష్టంతో పరిశోధించారో, అంతే ఓపిగ్గా మనకు అర్ధమయ్యేలా ఆ technical పదాలన్నీ వివరించారు. ఒక కళలో ప్రవేశం ఉన్నవారికి, ఆ కళని ఎలా ఆస్వాదించాలో కూడా వచ్చి ఉండాలి అనిపిస్తుంది వీరిని చూస్తే. ఆ పాటలనూ, పాడినవారినీ, నృత్యం చేసినవారినీ వివరించే తీరులోనే వారు ఆ కళను ఎంత అనుభవించి, ఆస్వాదించారో అర్ధమవుతుంది మనకి. 

ఒక విశ్వవిద్యాలయంలో, నాట్య థియరీ తరగతిలో, ఎంతో అనుభవం, ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులు, మనల్ని అలరించే విధంగా క్లాసు తీసుకుంటే ఎలా ఉంటుందో, ఈ ప్రసంగం అచ్చం అలానే ఉంటుంది. ఈ ప్రసంగంలో వారు చూపించిన పాటల nuances ని మనం ఎంతగా ఆకళింపు చేసుకుంటాం అంటే, ఆ తరహా సంగీత, నృత్యాలను ఎలా appreciate చేయాలో మనకు ఒంటపట్టేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.   సమయాభావం వలన కొన్ని పాటలు కేవలం పల్లవితో వాళ్ళు ఆపేసినప్పుడు మన గుండె ఎంత విలవిలలాడుతుందో. ప్రసంగం అయ్యాకా వారు ప్రస్తావించిన పాటలు YouTube లో వెతికి మరీ ఆస్వాదించాలనిపిస్తుంది. మీకా శ్రమ లేకుండా, ఆ లింకులన్నీYouTube వీడియో description లో ఇచ్చాము.  పై వీడియోలో చూసి ఆపాతమధురాల సాగరంలో హాయిగా ఒక బుజ్జి మునక వేసి రండి.

దేవుడు మీ కోరికలను ఎందుకు తీర్చడం లేదు? - ఆధునిక ఆధ్యాత్మికం వీడియో

కోరికలు - జీవితంలో ముందుకు వెళ్ళడానికి జీవునికి సహజంగా వచ్చిన లక్షణం. ఈ రోజు రాత్రి భోజనంలో ఫలానాది తినాలి అనే కోరిక దగ్గర నుంచి, మోక్షం కావాలి దాకా ప్రతీ వారికీ ఏదో ఒక స్థాయిలో కోరికలు ఉండి తీరతాయి. కోరికల్లో చిన్నా, పెద్దా ఉంటాయేమో కానీ, అవి తీరకపోతే కలిగే బాధలోనో, తీరితే కలిగే ఆనందంలోనో పెద్ద తేడా ఉండదేమో. చాలామంది కోరికలు లేకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి అంటుంటారు. కానీ అది సాధ్యమా? ఒకవేళ సాధించినా, ఆ స్థితి ఎంతో కాలం నిలవదు. ఎందుకంటే, కాలి కింద తొక్కిపెట్టిన పాము చిన్న సందు దొరికితే బుస్సున లేచి, ఎలా కాటేస్తుందో, అణిచిపెట్టిన కోరికలు కూడా అవకాశం చూసుకుని, పాతాళానికి లాక్కుపోతాయి.

మరి ఏం చేయాలి? అసలు దేవుడు మన కోరికల్ని ఎందుకు తీర్చడం లేదు? మనం కోరుకునేది ఒకటైతే, మనకు లభించేది వేరేది ఎందుకు అవుతోంది? కోరికలు తీరనప్పుడు మనకు ఎందుకు అంత బాధ కలుగుతోంది? దీన్లో మన కర్మ/విధి పాత్ర ఏమిటి? వీటన్నిటికీ సమాధానాలను ఈ వారం ‘ఆధునిక ఆధ్యాత్మికం’ సిరీస్ లో భాగంగా విడుదలయ్యే వీడియోలో వివరించే ప్రయత్నం చేశారు దాసుకిరణ్ గారు. అలాగే, ఒక గొప్ప జ్ఞానిని, వారి జీవితాన్ని కూడా మనకు పరిచయం చేశారు. వారెవరో, వారికి ఈ కోరికల conceptకి ఉన్న ముడి ఏమిటో, ఈ కింది  వీడియోలో చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలోనో, మెయిల్స్ గానో మాకు తెలియజేయండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :