డెపెండెంట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల జీవితాలు ఏ విధంగా మారతాయి?

Lakshmi Prabha
April 11, 2023

అసలు సంస్కరించడం అంటే ఏం చేయాలి? మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా అతనిలో తరతరాల నుంచి గూడుకట్టుకుపోయిన ఆచారం, సంప్రదాయం, మూఢ విశ్వాసాలు అంత సులువుగా హరించిపోవు, మరుగైపోవు. ఒకవైపు విదేశీ సంస్కృతి మెండుగా ఉన్న ఆధునిక నాగరికత మనపై ప్రభావం చూపుతుంటే, మరోవైపు మనలో చాలా మంది, ముఖ్యంగా...

అన్నెం, పున్నెం ఎరుగని అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో పెరిగి చదువుమీద తనకున్న ఆసక్తితో డాక్టర్ కోర్సులో చేరుతుంది వెనకబడిన కులానికి చెందిన అచ్చాయమ్మ. ఇంట్లోని వారందరూ నాగరికులై, స్వేచ్చా , స్వాతంత్య్రాల మధ్య తను అనుకున్నది సాధించే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఉంటుంది నిర్మల. ఇలాంటి రెండు విభిన్న వాతావరణాల నుండి వచ్చి వీరిద్దరూ స్నేహితులవుతారు.

భయపడుతూ అందరికీ బానిసలా మెలిగే అచ్చాయమ్మను, నిర్మల తన సావాసంతో అచ్యుతగా మారుస్తుంది. నిర్మలనే వెన్నుదన్నుగా చేసుకుని, ఆ ధైర్యంతో తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి అచ్యుత టూరింగ్ మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరుతుంది. అవసరమైనప్పుడల్లా అచ్యుతని ఆదుకుంటూ, ఆమెకు సలహాలు ఇస్తూ నిర్మల పై చదువులకు అమెరికా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో అచ్యుతని ప్రేమించిన తన అన్న శశి కోసం నిర్మల తల్లితండ్రులతో గొడవ పడుతుంది. అమెరికాలో తనను ప్రేమించిన లానీతో తన వివాహం జరపడానికి అంగీకరించిన తన వారు, అచ్యుత విషయంలో ఏమి చేశారు? నిర్మలే ప్రపంచంగా బతికిన అచ్యుత ఏమైంది? అచ్యుతలానే వెనుకబడిన కులం నుంచి వచ్చిన సాయి ఉన్నతంగా, ఆత్మస్థైర్యంతో ఎలా బతికింది? అచ్యుతని సంస్కరించడంలో నిర్మల చేసిన తప్పేమిటి?  

అసలు సంస్కరించడం అంటే ఏం చేయాలి? మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా అతనిలో తరతరాల నుంచి గూడుకట్టుకుపోయిన ఆచారం, సంప్రదాయం, మూఢ విశ్వాసాలు అంత సులువుగా హరించిపోవు, మరుగైపోవు. ఒకవైపు విదేశీ సంస్కృతి మెండుగా ఉన్న ఆధునిక నాగరికత మనపై ప్రభావం చూపుతుంటే, మరోవైపు మనలో చాలా మంది, ముఖ్యంగా నిరక్షరాస్యులు, మూఢత్వం నుంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రతీ ఒక్కరిలోనూ కాస్త దైవాంశ, జ్ఞానము ఉంటాయి. కొందరికి దాన్ని అంటే ఆ జ్ఞానజ్యోతిని తమంతట తాము ప్రజ్వలింప చేసుకునే శక్తి ఉంటుంది. కొందరికి వేరొకరి ప్రభావం (ఆదరణ) అవసరం చాలా ఉంటుంది.

మాలతీ చందూర్ గారు రచించిన “ ఓ మనిషి కథ” నవలలో త్యాగు తన ప్రపంచంలో నుంచి బయటకి  రావడానికి ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో విన్నారు. ఆవిధంగానే “గౌతమి పుత్రి” అనే ఈ నవలలో కూడా ఒక మనిషి తోడు కోసం ఆరాటపడే డెపెండెంట్ పర్సనాలిటీ [Dependent Personality] ఉన్న వ్యక్తుల జీవితాలు ఏవిధంగా మారతాయో తెలిపే కధనంతో సాగే ఈ నవలను కూడా మన దాసుభాషితంలో వినండి. 

Tap to Listen

క్రౌడ్‌ఫండింగ్ అంతిమ ఫలితాలు.

నవంబర్ 07 న మొదలైన దాసుభాషితం క్రౌడ్ ఫండింగ్ కాంపెయిన్, నాలుగు నెలలు నడిచి ఏప్రిల్ 6 న విజయవంతంగా ముగిసింది. ఈ విజయం అపూర్వం. తెలుగు భాషాధారిత సంస్థలకు స్ఫూర్తిదాయకం. ఆర్థిక వనరులు పరంగా దాసుభాషితం అనుకున్న లక్ష్యం సాధించడంలో తోడ్పడిన వారందరికీ దాసుభాషితం బృందం మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతుంది. 

ఇక ఇతర లక్ష్యాలు సాధించడంలో సదా నిమగ్నమై ఉంటాము.

Image Courtesy :