ఇదెక్కడి న్యాయం?

Dasu Kiran
March 8, 2022

చిన్న సాఫ్ట్వేర్ సంస్థలతో గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కొద్దిగా పెద్ద సంస్థకు యాప్ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని ఎంతో ఆశించి builder.ai అనే సంస్థను ఎంచుకున్నాము. స్వీయ పెట్టుబడులతో నడిచే అంకుర సంస్థ అయిన దాసుభాషితం తాహతుకు ఎక్కువే అయినా వారు అడిగినంతా ఇస్తామన్నాము.

నమస్కారం,

యాప్ విడుదల చాలా ఆలస్యమైనదని మాకు తెలుసు.

చిన్న సాఫ్ట్వేర్ సంస్థలతో గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కొద్దిగా పెద్ద సంస్థకు యాప్ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని ఎంతో ఆశించి builder.ai అనే సంస్థను ఎంచుకున్నాము. స్వీయ పెట్టుబడులతో నడిచే అంకుర సంస్థ అయిన దాసుభాషితం తాహతుకు ఎక్కువే అయినా వారు అడిగినంతా ఇస్తామన్నాము. 7 నెలల్లో (Aug, 21 - Feb, 22), 100% ఫీచర్స్ తో యాప్ విడుదల చేసినందుకు 9 నెలసరి వాయిదాల్లో ₹ 21 లక్షలు కట్టాలని ఒప్పందం.

కానీ గత నవంబర్ లో 50% ఫీచర్స్ తో విడుదల అవ్వాల్సిన యాప్ ఈ సంవత్సరం మార్చ్ కి కూడా కాలేదు. ఈ మధ్యలో ఆ సంస్థ అజాగ్రత్త వల్ల డేటాబేస్ హాక్ చేయబడింది. అదృష్టవశాత్తు పర్సనల్ డేటా లీక్ కాకపోయినా, మూడు నెలల డేటా కోల్పోయాము. ముందు జాగ్రత్త చర్యగా అందుబాటులో ఉన్న పాత యాప్ ను కూడా ఉపసంహరించవలసి వచ్చింది. పర్యవసానంగా ఆదాయం కోల్పోతున్నాము. అంత కన్నా ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నాము.

దీంతో మాకు ఆ సంస్థ మీద నమ్మకం సన్నగిల్లి మేము వారికి పేమెంట్స్ ఆపేశాము. నవంబర్ లో విడుదల కావాల్సిన version విడుదల అయిన తర్వాత ¼ పేమెంట్ ఇస్తామన్నాము. ఇంకా చాలా కొత్త ఫీచర్స్ నిర్మించవలసి ఉంది. ఈ లెక్కన అవి ఎప్పుడౌతాయో తెలియదు. అవి నిర్మాణం అయ్యి విడుదలైనప్పుడు విడతల వారీగా పేమెంట్స్ ఇస్తామన్నాము.  

కానీ వారు ప్రాజెక్ట్ కాస్ట్ (మొత్తం ₹ 21 లక్షలు) ఇప్పుడే ముట్టజెప్పితే కానీ యాప్ విడుదల చేయమంటున్నారు. విపరీతమైన ఆలస్యానికి, డేటా హాక్ కి, డేటా లాస్ కి, ఆదాయం గండికి, దాసుభాషితం బ్రాండ్ కు జరుగుతున్న నష్టానికి వారు బాధ్యత వహించరుట. కానీ మొత్తం డబ్బు కావాలిట. ఇదెక్కడి న్యాయం?

మేము వికల్పాలను ఆలోచిస్తున్నాము.  
యాప్ మీ చేతిలోకి వచ్చేసరికి ఇంకా జాప్యం అయేట్టు ఉంది కాబట్టి మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాము. సహృదయంతో అర్థం చేసుకుంటారని మా నమ్మకం.

అయితే, మీరు ఇంకా Subscription కు డబ్బులు కడుతుంటే, దయచేసి ఆపేయండి. మాకు మనసొప్పడం లేదు. యాప్ పునరుద్ధరించబడిన తర్వాత మళ్ళీ కొనసాగనిద్దురుగాని. మీరు డబ్బు కట్టి పుస్తకం వినలేకపోతుంటే మాత్రం ఓపిక పట్టండి. మేము మీకు వినే సౌకర్యం ఇవ్వలేమని తెలిసిన నాడు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాము.  

ఇప్పటి వరకూ అయిన యాప్ రూపురేఖలను మాత్రం మీకు చూపగలము.
ఈ 4 ని. వీడియో చూడండి. యాప్ UI / UX డిజైన్ Builder చేసింది కాదు.

మీ వంటి వినియోగదారులున్నందుకు మేము ధన్యులం.

Image Courtesy :