ఇనుములో హృదయం మొలుచునా..?!

Meena Yogeshwar
November 28, 2023

iPhone లో సిరి, Alexa వంటి Voice Assistants ను చూసి అవాక్కయిపోయా. Tesla కార్ self-driving చేస్తుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇక ఇప్పుడు ChatGPT ఎంతో data చదివేసిందని, దానిని సహాయంతో నిమిషంలో మనం ఏది అడిగినా సమాధానం చెప్పడం, creative గా ఆలోచించి కథలు, కవితలు అల్లడం, ఓ మోస్తరు స్థాయిలో Thesis లు రాయడం లాంటి విచిత్రాలు ఎన్నో చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ..

మేము ఇంటరు చదువుకునేటప్పుడు NLP అనే కోర్సు గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు. తరువాత Engineering కి వచ్చాక, Google Translate చాలా విచిత్రంగా అనిపించేది. రోబో సినిమాలో చిట్టి, సెకనులో వందో వంతులోనే లావుపాటి పుస్తకాన్ని చదివేశాడని, క్షణంలో బొమ్మలు గీయడం, కారు నడపడం నేర్చుకోగలడని, సొంతంగా ఆలోచించి సమాధానాలు చెప్పడం, పనులు చేయగలడని చూపించినప్పుడు అదేదో సైన్స్ ఫిక్షన్ అనుకున్నాను.

కానీ ఆ తరువాత iPhone లో సిరి, Alexa వంటి Voice Assistants ను చూసి అవాక్కయిపోయా. Tesla కార్ self-driving చేస్తుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇక ఇప్పుడు ChatGPT ఎంతో data చదివేసిందని, దానిని సహాయంతో నిమిషంలో మనం ఏది అడిగినా సమాధానం చెప్పడం, creative గా ఆలోచించి కథలు, కవితలు అల్లడం, ఓ మోస్తరు స్థాయిలో Thesis లు రాయడం లాంటి విచిత్రాలు ఎన్నో చేస్తోంది. ఇప్పుడు కొత్తగా డావిన్సీ, పికాసో, రవివర్మ వంటి గొప్ప కళాకారుల శైలిని ఔపోశన పట్టి క్షణాల్లో వారిలా పెయింటింగ్ లు గీసేస్తోంది. షేక్స్పియర్ రాసినట్టు గొప్ప నవలలు రాస్తోంది. ఇవన్నీ చూస్తుంటే రోబో సినిమాలో లాగా అచ్చంగా మనలాగానే స్పందించే, వ్యవహరించే రోబోలు దైనందిన జీవితంలోకి వచ్చేస్తాయేమో అనిపిస్తోంది.

ప్రతీ విషయానికీ ఉన్నట్టే, ఈ విషయంలోనూ ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక సందర్భంలో ప్రముఖ వ్యాపారవేత్త Elon Musk మాట్లాడుతూ ‘AI మానవాళికి అతి పెద్ద ప్రమాదకారి అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది’ అని మాట్లాడారు. దీని ద్వారా మన వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు అనేది మస్క్ అభిప్రాయం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిప్రాయం కూడా. కానీ ఇందులో నిజమెంత? Photo morphing, Voice cloning వంటి వాటి ద్వారా ఎంత technical అభివృద్ధి సాధించవచ్చో, అంతా ప్రమాదం పొంచి ఉందనేది కాదనలేని నిజం.

అలాంటి రెండు వైపులా పదునున్న కత్తిని ఎలా ఉపయోగించుకోవాలి? సైన్స్ అత్యంత వేగంగా పురోగతి చెందుతున్న ఈ కాలంలో దానిని అందుకోవడానికి మనల్ని మనం upgrade చేసుకుంటూనే జాగ్రత్తగా ఎలా ఉండాలి? అసలు AI అంటే ఏమిటి? అది ఏ ఏ రంగాలలో ఎంత బాగా అభివృద్ధి చెందింది? వాటిని నేర్చుకోవడానికి, మెరుగుగా ఉపయోగించుకోవాడానికి ఎలాంటి tools and tips ఉన్నాయి వంటి విషయాలను వివరించబోతున్నారు దాసుకిరణ్ గారు. అలాగే దాసుభాషితం ఈ AI ను ఎలా ఉపయోగించబోతోందో కూడా చెప్పబోతున్నారు.

ప్రతి నెలా మొదటి శనివారం మనం నిర్వహించుకునే దాసుభాషితం ప్రసంగాలులో భాగంగా డిసెంబరు 2వతేది శనివారం ఉదయం 9.30గంటలకు ఈ విషయంపై ప్రసంగించనున్నారు. మీకు AI విషయంలో ఉన్న ప్రశ్నలను ఈ ఫాంలో నింపండి. వాటిని ప్రసంగంలో వివరిస్తారు కిరణ్ గారు.

https://tally.so/r/m6ZvjO

కిరణ్ గారికి నా ప్రశ్న ఒకటే, భవిష్యత్ లో రోబో సినిమాలో చూపించినట్టు ‘ఇనుములో హృదయం మొలుచునా?

జన ఘన మన

Tap to Listen

‘తల ఎత్తి జీవించు తమ్ముడా.. తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని’ అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మిగిలిన భాషాల వారితో పోలిస్తే ఈ గర్వం తెలుగువారికి చాలా తక్కువ. నిజానికి ఒకప్పుడు దాదాపు దక్షిణభారతదేశం మొత్తం తెలుగు రాజభాషగా వెలుగొందిన ఘనత ఉంది. కానీ ఈవాళ ఎందరికి ఈ విషయం తెలుసు?

మాకు తెలిసినవాళ్ళ పాప ఒకరోజు ఒక ఘోరమైన విషయం చెప్పింది. స్వయానా వాళ్ళ తెలుగు టీచర్ వాళ్ళతో ‘10క్లాసు తరువాత మీకు తెలుగు అనేదే ఇంక ఉండదు, కాబట్టీ దీని మీద పెద్దగా focus పెట్టి టైమ్ పాడు చేసుకోకండి’ అని చెప్పారట. ‘మేము ఇష్టంగా చదువుకుందాం అనుకున్నా, ఆమె పెద్దగా మాకు క్లాస్ చెప్పరు’ అంటూ చెప్పింది ఆ పాప. బాధ, కోపం, నిస్సహాయతా చుట్టుముట్టాయి ఈ మాట విన్నప్పుడు. తనకు అన్నం పెట్టే భాషనే అంత చులకనగా చూడడం అనేది ఎంతవరకూ సబబు? తల్లిదండ్రులూ అంతకు తక్కువేమీ లేరు. లెక్కలు, సైన్స్ చదివితే చాలు, మా పిల్లలకి మాతృభాష రాకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. ఫ్రెంచి, జర్మన్ క్లాసులకి పంపడానికి తాపత్రయపడుతున్నారే తప్ప తెలుగు నేర్పడానికి ప్రయత్నించే తల్లిదండ్రుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం ప్రమాదకరం.

అందరూ అలా ఉన్నారని ఖచ్చితంగా అనడం లేదు. చాలామంది తమ మాతృభాషను కన్నతల్లిలా ప్రేమించేవారు ఉన్నారు. అందుకు దాసుభాషితం లాంటి సంస్థల పురోగతే నిదర్శనం. తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు, దాని చరిత్ర వంటి విషయాలను వివరిస్తూ జంధ్యాల శరత్ బాబు గారు రాసిన ‘జన ఘన మన’ వ్యాససంపుటి మొదటి భాగం ఇదివరకూ విడుదల అయింది. ఈ వారం రెండో భాగం విడుదల కాబోతోంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన తెలుగుకు భవిష్యత్తును కూడా అంతే ఘనంగా నిర్మించాల్సిన బాధ్యత మన మీదే ఉంది.

హమాస్. ఇజ్రాయెల్. భగవద్గీత.

ఈవారం కూటమి గ్రూపులో #ఆనందకిరణం అంశంలో దాసుకిరణ్ గారు ఒక గంభీరమైన విషయాన్ని ఆధ్యాత్మిక కోణంలో వివరించే ప్రయత్నం చేశారు. Geopolitics ను పరిశీలించే ప్రతీవారూ ధర్మసంకటంలో పడుతున్న సమస్య ‘గాజా-ఇజ్రాయిల్’ యుద్ధం. రెండు వైపులా న్యాయమున్న ఈ సమస్యను ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఎలా చూడవచ్చో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవాలి. దాని పూర్తి పాఠాన్ని ఈ కింది లింకులో చూడగలరు.

https://twitter.com/Daasu_Kiran/status/1726825001238827284?t=KXlsWzUwWGQOd5X0WJeRxw&s=19

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :