#03 జనతాపోటీ లో పాల్గొనండి.

Dasu Kiran
March 27, 2020

మీరు దాసుభాషితం జింగల్ విని ఉంటే, దా....సుభాషితం అని వినిపిస్తుంది. ఓ మంచి విషయం విను అని ఉద్దేశం. ఈ సంకట సమయంలో ఆశావాహ దృక్పధం అలవరచుకునేందుకు మంచి విషయాలను వినాలి. అందుకోసమని దాసుభాషితం యాప్ లో ఉన్న ప్రీమియం కంటెంట్ అంతా ఉచితం చేశాము. ఇంకా...

మీరు దాసుభాషితం జింగల్ విని ఉంటే, దా....సుభాషితం అని వినిపిస్తుంది. ఓ మంచి విషయం విను అని ఉద్దేశం.

ఈ సంకట సమయంలో ఆశావాహ దృక్పధం అలవరచుకునేందుకు మంచి విషయాలను వినాలి. అందుకోసమని దాసుభాషితం యాప్ లో ఉన్న ప్రీమియం కంటెంట్ అంతా ఉచితం చేశాము.

ఇంకా, మార్చ్ 26 నుంచి ట్విట్టర్లో ఓ పోటీను ప్రారంభించాము. రోజు ఈ విషయాల మీద ఓ ప్రశ్న వేస్తాము. Google సహాయం తీసుకోకుండా సమాధానం ఇవ్వాలి. 

తెలుగు > సాహిత్యం,
> సినిమా,
> కళాకారులు,
> స్వాతంత్ర్యోద్యమకారులు,
> పర్యాటక కేంద్రాలు,
> శాస్త్రవేత్తలు,
> టెక్నాలజిస్ట్స్,
> పదాలు,
> మాండలికాలు,
> వంటకాలు.

ఇది జనతా పోటీ. అంటే మీరూ ప్రశ్నలు వేయచ్చు. పై విషయాలే కాకుండా, తెలుగు సమాజానికి సంబంధించిన ఏ విషయమైనా (రాజకీయాలు, మతం తప్ప) మీరు ఎంచుకోవచ్చు. రోజూ, ఎక్కువ సమాధానాలు వచ్చిన ప్రశ్న వేసిన వ్యక్తిని విజేతగా ప్రకటించి ₹999/m విలువైన 'దాసుభాషితం మహారాజ పోషక' ప్లాన్‌‌ను బహుకరిస్తాం.  

ప్రశ్న అడగడానికి Twitter Poll ఫీచర్‌ను వాడండి. ఎలాగో లింక్ చూడండి.
https://help.twitter.com/en/using-twitter/twitter-polls

Poll వల్ల సమాధానాలను Votes గా లెక్కించడం సులభం. మీ ప్రశ్నకు #JanataPotee @dasubhashitam జతపరచండి.
లేకపోతే మీరు ప్రశ్న వేసినట్టు మాకు తెలియదు.

ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెట్టండి.     

Photo by eberhard grossgasteiger on Unsplash

Image Courtesy :