కలంతో వైద్యం..

Meena Yogeshwar
September 19, 2023

మన మానసిక ఆరోగ్యం, మెదడులో విడుదలయ్యే hormones వంటివి మన పూర్తి ఆరోగ్యంపై, తద్వారా మన జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తాయో చాలామంది గుర్తించరు. ఇది చాలా ముఖ్యమైన అనారోగ్యం కాబట్టీ, వైద్యుల సహాయమే దీనికి పరిష్కారం. అయితే, చాలాసార్లు మన సాహిత్యం కూడా ఈ ఇబ్బంది నుండి మనని బయటపడేయడానికి, కనీసం మనకున్న రోగాన్ని గుర్తించడానికో ఉపయోగపడుతుంది. అలాంటిది ఈ రోగాలను, వాటి లక్షణాలనూ క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న ఒక వైద్యురాలు సాహిత్యం రాస్తే ఎలా ఉంటుంది?

మానసిక అనారోగ్యం. ఈ పదం వినగానే సగం మంది offend అయిపోతారు. ఇంకొందరు జాలిగా మొహం పెడతారు. మరికొందరు అదో పెద్ద తప్పు పదంలా భావిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో శారీరిక అనారోగ్యానికి ఇచ్చినంత ప్రాముఖ్యత మానసిక అనారోగ్యానికి ఇవ్వరు. చుట్టుపక్కల వారు కూడా మానసిక ఇబ్బందులను అయితే గుర్తించరు, లేదంటే హేళన చేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటారు. 

కానీ, నిజానికి మన మానసిక ఆరోగ్యం, మెదడులో విడుదలయ్యే hormones వంటివి మన పూర్తి ఆరోగ్యంపై, తద్వారా మన జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తాయో చాలామంది గుర్తించరు. ఇది చాలా ముఖ్యమైన అనారోగ్యం కాబట్టీ, వైద్యుల సహాయమే దీనికి పరిష్కారం. అయితే, చాలాసార్లు మన సాహిత్యం కూడా ఈ ఇబ్బంది నుండి మనని బయటపడేయడానికి, కనీసం మనకున్న రోగాన్ని గుర్తించడానికో ఉపయోగపడుతుంది.

అలాంటిది ఈ రోగాలను, వాటి లక్షణాలనూ క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న ఒక వైద్యురాలు సాహిత్యం రాస్తే ఎలా ఉంటుంది? తెలుసుకోవాలంటే డాక్టర్ పి.శ్రీదేవి రచనలు చదవాలి. మనందరికీ బాగా పరిచయస్తురాలైన రచయిత్రి ఈమె. ఆమె రాసిన ఏకైక నవల ‘కాలాతీత వ్యక్తులు’ మనలో చాలామంది చాలాసార్లు చదివి ఉంటాం. మన యాప్ లో ఆడియో పుస్తకం, మృణాళిని గారి విశ్లేషణ కూడా దాదాపు అందరం విని ఉన్నాం.

అయితే, శ్రీదేవి గారి కథలు చాలా తక్కువ మందికి పరిచయం. ముఖ్యంగా ఆత్మన్యూనత, జీవితంలోని ఒక బలమైన tragedy నుండి కోలుకోలేని మానసిక రుగ్మతల గురించి ఆమె కథలు చర్చిస్తాయి. కేవలం 32ఏళ్ళు మాత్రమే జీవించిన శ్రీదేవి గారు, తన కథలలో తాను చూసిన జీవితాన్ని మొత్తం నింపేశారు. డాక్టర్ గా ఆమె చూసిన ఎన్నో అనుభవాలను కథలుగా మలచారు. వాటి ద్వారా ఆమె వెళ్ళిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా మనందరికీ వైద్యం చేస్తున్నారు.

Tap to Listen

తెలుగు సాహిత్యంలో ఆత్మస్థైర్యానికి మారుపేరు అనదగ్గ పాత్రల్లో ఒకటైన ఇందిర పాత్ర సృష్టికర్త, ఒక అనారోగ్యం వల్ల ఆత్మన్యూనతలో కూరుకుపోయిన సుధ లాంటి పాత్రను ఎలా సృష్టించారో అని ఆశ్చర్యం అనిపిస్తుంది. వైద్యులు జీవితం, మరణం రెండూ అతిదగ్గరగా చూస్తారు. అలాంటివారి నుండి నేర్చుకోదగ్గది ఎంతైనా ఉంటుంది. ఈ వారం పి.శ్రీదేవి కథలు విడుదల కాబోతున్నాయి. తప్పకుండా వినండి. బహుశా మన ఇబ్బందులకు వైద్యం కూడా ఇందులో దొరకచ్చు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :