#22 అవని పై ఒక వరలక్ష్మి

Dasu Kiran
August 7, 2020

వృత్తులలో, ఫైటర్ పైలట్ వృత్తి మగతనానికి పరాకాష్ఠ. ఉన్నత సాంకేతిక నైపుణ్యం అవసరమవడం, ధీరోదాత్తత ప్రదర్శించడం, మితమైన అవకాశాలుండడం వల్ల, ఈ వృత్తి అంటే, ఇతర రంగాల్లోఅత్యంత విజయవంతులైన పురుషులకి కూడా సంభ్రమమే. 2016లో అవని చతుర్వేది ప్రథమ మహిళా ఫైటర్ పైలట్ గా భారతీయ వాయుసేన నియోగించింది.

వృత్తులలో, ఫైటర్ పైలట్ వృత్తి మగతనానికి పరాకాష్ఠ. ఉన్నత సాంకేతిక నైపుణ్యం అవసరమవడం, ధీరోదాత్తత ప్రదర్శించడం, మితమైన అవకాశాలుండడం వల్ల, ఈ వృత్తి అంటే, ఇతర రంగాల్లోఅత్యంత విజయవంతులైన పురుషులకి కూడా సంభ్రమమే.

2016లో అవని చతుర్వేది ప్రథమ మహిళా ఫైటర్ పైలట్ గా భారతీయ వాయుసేన నియోగించింది. 

అవని సాధించిన ఈ విజయాన్ని 20వ శతాబ్దపు స్త్రీతో పోలిస్తే, నేటి స్త్రీ ఎన్ని సవాళ్ళను అధిగమించి ఎంత దూరం వచ్చిందో కదా అనిపిస్తుంది. అయితే ఈ పరివర్తన అంత సులువుగా వచ్చింది కాదు. 20వ శతాబ్దంలో కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి ఎందఱో మహానుభావులు చేసిన కృషి ఫలితమిది.

కనుపర్తి వరలక్ష్మమ్మది ఆధిక్య (privileged) కుటుంబం. ధనాధిక్యం కన్నా విద్యాధిక్యం ఎక్కువ. ఆ రెంటినీ, తన జీవితాన్ని, స్త్రీ ఉద్ధరణ కోసమే వెచ్చించారు. ఆమె పోరాడిన అసమానతలలో కొన్ని, బాల్య వివాహం వంటివి, ఈనాడు లేవు. మగ, ఆడ బిడ్డల పెంపకంలో తారతమ్యాలు కూడా కొన్ని సామజిక వర్గాలలో క్రమంగా తగ్గుతున్నది. పెళ్లే ధ్యేయం కాకుండా, అన్నీ వర్గాల తల్లి తండ్రులు ఆడ పిల్లలను తమ కాళ్ళమీద నిలబడగలిగేలా చదివిస్తున్నారు. 

అయితే వరలక్ష్మమ్మ గురించి, ఆమె రచనల గురించి ఈనాడు మనం ప్రత్యేకంగా ఎందుకు తెలుసు కోవాలి?

ఎందుకంటే, ఆడపిల్ల జీవితంలో పెళ్లికి  ముందు కొన్ని మంచి మార్పులు కనబడుతున్నా, పెళ్ళైయిన తర్వాత మాత్రం పెద్ద మార్పులేమీ లేవు. ఒక బహుళ జాతీయ సంస్థ పెప్సీ సీఈఓ అయినా, సాధారణ గృహిణి అయినా, వరలక్ష్మమ్మ చెప్పినట్టు, స్త్రీ ఇంకా మగవాడి సొత్తే.

ఉదాహరణకు ఒక ఉదంతం. కరోనా వల్ల 'ఇంటినుంచే పని అలవాటు' అయినందున, కరోనా తర్వాత కూడా ఇదే పద్దతి పాటిస్తే నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి కదా అని బహుళ జాతీయ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఒక పెద్ద బహుళ జాతీయ సంస్థ, ఈ విషయం మీద తమ ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. పురుషులు అనుకూలంగానూ, చాలా మంది మహిళలు ప్రతికూలంగానూ  స్పందించారు. కారణం దాసీ, మంత్రి, మాత, రంభ, లక్ష్మి అనే బాధ్యతల నుంచి కార్యాలయం, ఒక ఉపశమనంగా వారు భావించారు.

Kanuparthi Varalakshmi
Tap to listen

Facebook COO, షెరిల్ సాండ్బర్గ్ వ్రాసిన 'లీన్ ఇన్' పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా, ఉద్యోగం చేసే మహిళల్లో స్ఫూర్తిని నింపింది. ఒక్కసారి వరలక్ష్మమ్మ జీవితం, రచనల గురించి, వాటిని ఆమె రాసిన సాంఘిక నేపధ్యం గురించి, డా. మృణాళిని విశ్లేషణ వింటే, దానికి రెండింతలు ప్రేరణ కలుగుతుంది.

ఇదే స్పూర్తితో, జాషువా, శ్రీశ్రీ, సినారె, దాశరథి, ఆలూరి బైరాగి, పొట్లపల్లి రామా రావు వంటి ప్రముఖ కవుల రచనలని ఈ తరం వారికి పరిచయం చేయడానికి, ప్రముఖ కవి డా. నందిని సిధారెడ్డి గారు 'పద చిత్రాలు' అనే కార్యక్రమం ప్రారంభించారు. అది కూడా ఈ వారం విడుదల చేస్తున్నాము.

తిరుమల చరితామృతం 2వ భాగం

Tirumala Charitamrutam 2
Tap to listen

తిరుమల చరితామృతం రెండవ భాగంలో మొత్తం18 అధ్యాయాలున్నాయి. వీటిలో ప్రతిరోజూ వేకువ ఝామున శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో, గర్భాలయ ద్వారానికి వేసి ఉంచిన తెర వెనుక అర్చకులు ఏమి చేస్తారు? అలాగే ఉదయం నుంచీ కొనసాగిన వివిధ సేవలూ, దర్శనాలూ, ఆరగింపులూ అయిపోయాక స్వామివారిని నిద్రపుచ్చే కార్యక్రమం 'పవళింపు' సేవ విశేషాలు ఈ భాగంలో వినవచ్చు.

కాశీ మజిలీ కథలు 12వ ఆఖరి భాగం. 

Kaasi Majilee Kathalu 12
Tap to listen

రాక్షస బాలుడైన ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, విష్ణుభక్తులలో అగ్రగణ్యుడు కదా! అటువంటి ప్రహ్లాదుడు సాక్షాత్తు ఆ నారాయణునితోనే యుద్ధం చేయడమేమిటి? పురాణాల్లో అపుడపుడూ ఇలాంటి వింతలూ కనపడతాయి. 300వ మజిలీలో ఈ ఆసక్తికరమైన కథతో మొదలయ్యే కాశీ మజిలీ కథలు ఈ పన్నెండవ, చివరి భాగం 359వ మజిలీలో  గోపాలుడు, మణిసిద్ధుల కాశీ క్షేత్ర ప్రవేశంతో పూర్తవుతుంది.


Image Source: @dynamiclx Unsplash

Image Courtesy :