పాత్రికేయ రంగం యువతను ఆకర్షిస్తోందా?

Meena Yogeshwar
January 10, 2025

రాజకీయ, సాంస్కృతిక, భాష వంటి విషయాలపై సమగ్రమైన సంపాదకీయాలు అందించిన శ్రీనివాస్ గారికి ఇష్టమైన పుస్తకం ఏమిటి? ఆయనను అత్యంత ప్రభావితం చేసిన ఆ పుస్తకం ఏమిటో తెలుసా? ‘చలం ఆత్మకథ’. ఒకప్పటి సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన చలం జీవితమే శ్రీనివాస్ గారి ముఖ్యమైన ప్రభావం. చలాన్ని నిషిద్ధ రచయితగా భావించిన ఎన్నో తెలుగు కుటుంబాలలో శ్రీనివాస్ గారి కుటుంబం చేరదు. అన్ని రకాల సాహిత్యం వారికి అతి చిన్న వయసు నుండే అందుబాటులో ఉండడం వలన 14-15ఏళ్ళకే చలాన్ని చదువుకోగలిగారు శ్రీనివాస్ గారు.ఇంతటి సాహిత్యం వీరికి అందుబాటులో ఉండడానికి కారణం ...

ప్రముఖ పాత్రికేయులు, రచయిత, ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ ఎడిటర్ శ్రీ కె. శ్రీనివాస్ గారిని, దాసుకిరణ్ గారు అడిగిన ప్రశ్న. దానికి సమాధానం ఏమిటో తెలుసా? లేదు. ఇంకా డిజిటల్ మీడియాకి అయితే ఫరవాలేదు కానీ, ప్రింట్ మీడియా వైపు రావడానికి ఎక్కువ మంది యువత ఆసక్తి చూపడం లేదు. వారిని ఆకర్షించడంలో తెలుగు పాత్రికేయ రంగం సఫలం కాలేకపోతోంది అన్నారు. అసలు కోవిడ్ తరువాత ప్రింట్ మీడియాని చదివేవారే తక్కువ అయిపోయారు అని వివరించారు.

అదే శ్రీనివాస్ గారు తెలుగు చచ్చిపోతుందా? అన్న ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? లేదు. తెలుగుని నిర్లక్ష్యం చేసి, కావాలని తరువాతి తరాల వారు చదువుకోనివ్వకుండా చేస్తే తప్ప చనిపోదు. ప్రింట్ మీడియాలోకి వచ్చే కొద్దో గొప్పో యువత చక్కటి తెలుగు రాస్తున్నారు, చదువుతున్నారు. పదవ తరగతి దాకా వారు చదువుకున్న తెలుగు, వారికి జీవితాంతం గుర్తుండిపోతోంది అని చెప్పారు. ఆ ముఖ్యమైన సంవత్సరాల్లో వారి నుంచి తెలుగు లాక్కోకపోతే, తెలుగు చావదు అన్నట్టుగా మాట్లాడారు ఆయన.

రాజకీయ, సాంస్కృతిక, భాష వంటి విషయాలపై సమగ్రమైన సంపాదకీయాలు అందించిన శ్రీనివాస్ గారికి ఇష్టమైన పుస్తకం ఏమిటి? ఇంతకీ ఆయనను అత్యంత ప్రభావితం చేసిన ఆ పుస్తకం ఏమిటో తెలుసా? ‘చలం ఆత్మకథ’. ఒకప్పటి సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన చలం జీవితమే శ్రీనివాస్ గారి ముఖ్యమైన ప్రభావం. చలాన్ని నిషిద్ధ రచయితగా భావించిన ఎన్నో తెలుగు కుటుంబాలలో శ్రీనివాస్ గారి కుటుంబం చేరదు. అన్ని రకాల సాహిత్యం వారికి అతి చిన్న వయసు నుండే అందుబాటులో ఉండడం వలన 14-15ఏళ్ళకే చలాన్ని చదువుకోగలిగారు శ్రీనివాస్ గారు.

ఇంతటి సాహిత్యం వీరికి అందుబాటులో ఉండడానికి కారణం వారి తండ్రిగారు కండ్లకుంట అళహ సింగరాచార్యులు గారు. వారి పేరు అలా చెప్పడం కన్నా, ‘ఒక అధ్యాపకుడి ఆత్మకథ’ రచయిత అంటే బాగా తెలుస్తుందేమో. అలా సాహిత్యంలో రంగప్రవేశం చేసిన శ్రీనివాస్ గారిని,  దేశంలో జరిగుతున్న ఎన్నో విషయాలు పాత్రికేయ రంగంలో ప్రవేశించేలా చేశాయి. ఆ మొదటిరోజుల గురించి మాట్లాడుతూ శ్రీనివాస్ గారు ‘అప్పట్లో మాకు ఇది ఉద్యోగం కాదు, ఉద్యమం’ అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఆ తీవ్రత.

ఉభయ భాషా పండితుని కుమారుడు కాబట్టీ సహజంగానే భాష, వ్యక్తీకరణపై పట్టు వచ్చింది శ్రీనివాస్ గారికి. ఇక సాహిత్యపు నీడ ఉండనే ఉంది. చలంతో పాటు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు ఇలా ఎందరో దిగ్గజాల సాహిత్యాన్ని ఔపోశన పట్టడంతో వారికంటూ ప్రత్యేక శైలి ఏర్పడింది. ‘రెండు ప్రపంచ సాహిత్యాల మధ్య తెలుగు సాహిత్యం అనే అంశంపై వారు పి. హెచ్. డి చేశారు.

ఈ ఇంటర్వ్యూలో నేనూ పాల్గొన్నాను. వారిని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం నాకూ వచ్చింది. మా నాన్నగారు కొన్నాళ్ళ పాటు పాత్రికేయునిగా పని చేయడం, తన సహ పాత్రికేయులకు తరువాత కూడా అన్ని విషయాలలోనూ సహాయం చేయడం వలన నాకు కూడా ఆ రంగంపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే పాత్రికేయుల గురించి నేను ఒక ప్రశ్న అడిగితే, దానికి శ్రీనివాస్ గారు ఎంతో గొప్ప సమాధానం చెప్పారు. ఒక సీనియర్ ఎడిటర్ గా, వారి పట్ల ఆయనకు ఎంత గౌరవం ఉందో, వారి పని వలన తెలుగు పాత్రికేయ రంగంలో ఎలాంటి మార్పులు జరిగాయో వివరిస్తోంటే చాలా గర్వంగా అనిపించింది. అలా పనిచేసే వాళ్ళు మా నాన్నగారి ద్వారా నాకు తెలుసు కదా. వారందరినీ గుర్తు చేసుకుని ఆనందించాను నేను.

అబ్బో, ఇంకా చాలా మాట్లాడుకున్నాం అండి. శ్రీపాద గురించి, విశ్వనాథ గురించి, అటు పాత్రికేయ రంగాన్ని, ఇటు పోలీసు వారిని చేటలో పోసి చేరేగేసినట్టు నవలలు రాసిన కె.ఎన్.వై.పతంజలి గారి గురించి ఇలా చాలా మాట్లాడుకున్నాం లెండి. అవన్నీ చూసి తీరాలి అంతే. ఈ వారం ‘ఒక పుస్తకం ఒక సెలబ్రిటీ’ శీర్షికలో భాగంగా శ్రీ కె.శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ విడుదల అవుతోంది. తప్పకుండా చూడండి. నేను ఉన్నాను కాబట్టీ మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా చూడండేం. ఆ పూర్తి వీడియో ఈ లింకులో చూడవచ్చు. 

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :