పగ? కరుణ? దేనికి ఓటు?

Meena Yogeshwar
December 11, 2023

నిత్య జీవిత సంఘర్షణలే ఒక కొలిక్కిరాని సామాన్యుడికి తన చేతిలో లేని విషయాలతో కూడా సంఘర్షణ జరపాలంటే ఎంతటి అన్యాయమో కదా. మనిషి చేతిలో లేని పుట్టుక, జాతి, మతం, ప్రదేశం వంటి విషయాలను అడ్డుపెట్టుకుని హింసించడం మానవ సమాజానికే సిగ్గుచేటు. అలాంటి అకృత్యాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. మనం కలలో కూడా ఊహించని దారుణాలు, హింసాకాండ మానవజాతి చవి చూసింది. అలాంటి దారుణమైన మారణకాండలలో...

‘రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు, గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్ళతో.. చల్లారిన సంసారాలూ, మరణించిన జన సందోహం, అసహాయుల హహాకారం చరిత్రలో నిరూపించినవి’ అన్నారు శ్రీశ్రీ. నిత్య జీవిత సంఘర్షణలే ఒక కొలిక్కిరాని సామాన్యుడికి తన చేతిలో లేని విషయాలతో కూడా సంఘర్షణ జరపాలంటే ఎంతటి అన్యాయమో కదా. మనిషి చేతిలో లేని పుట్టుక, జాతి, మతం, ప్రదేశం వంటి విషయాలను అడ్డుపెట్టుకుని హింసించడం మానవ సమాజానికే సిగ్గుచేటు.

అలాంటి అకృత్యాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. మనం కలలో కూడా ఊహించని దారుణాలు, హింసాకాండ మానవజాతి చవి చూసింది. అలాంటి దారుణమైన మారణకాండలలో గత శతాబ్దం చూసిన genocide యూదుల ఊచకోత.

ఎన్నో శతాబ్దాల పాటు అణచివేతను అనుభవించిన ఆ జాతి, రోమన్ల చేత ప్రపంచం అంతటికీ తరిమివేయబడిన ఆ జాతి, అందరి చేతా second class citizens గా వ్యవహరించబడిన ఆ జాతికి జరిగిన అన్యాయం పరాకాష్టకు చేరినది నాజీల చేతిలో జరిగిన ఊచకోత.

టి.బి వంటి ప్రాణాంతక వ్యాధులను పెంచే క్రిములను, క్యాన్సర్ కణాలను వారి శరీరంలోకి ఎక్కించి, ఆ వ్యాధిపై పరిశోధనలు చేయడం, మత్తు ఎక్కించకుండా శస్త్రచికిత్సలు చేసి, ఎంతవరకూ ఆ నొప్పిని భరించగలరో చూడడం, 15, 16 ఏళ్ళ వారికి కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం, వారిని sex slaves గా ఉపయోగించుకోవడం, అంతకూ చనిపోనివారిని gas chamber లో పెట్టడం వంటి అమానుషాలు వారిపై జరిపారు.

ఏసుక్రీస్తు మరణానికి వారి జాతిని కారకులుగా చూపిస్తూ, god killers అంటూ వారిపై మొదలైన ద్వేషం anti- semitism అనే భయంకరమైన సామాజిక pandemic గా రూపంతరం చెందింది. 2000 ఏళ్ల క్రితం యూదు జాతిపై మొదలైన ద్వేషం, హింస నేటికీ పూర్తిగా తొలిగిపోయిందా అంటే, ‘లేదు’ అనేది సమాధానం. ఈ మాట చెప్పాలన్నా ప్రపంచంలోని నాగరిక జాతి అని చెప్పుకునే వారందరూ సిగ్గుపడవలసిందే.

అలాంటి అకృత్యాలకు బలైన ఒక 21 ఏళ్ల యువతి, gas chamber లో కుటుంబాన్ని సమూలంగా పోగొట్టుకున్న ఆ అమ్మాయి ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. మనలాంటి వాళ్ళం ఎప్పటికీ ఊహించలేని నిర్ణయం అది. తనపై అత్యాచారాలు జరిపిన వారికి శిక్ష వేయడమా? క్షమించి తన మిగిలిన అతికొద్ది జీవితాన్ని ప్రశాంతతలో గడపడమా అనే dilema ఎదురైనప్పుడు తీసుకుంది ఆ విచిత్ర నిర్ణయం.

రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల ఊచకోత నేపథ్యంలో రాసిన నవల ‘ది ఇన్ స్పెక్టర్’. ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతి చందూర్ రాసిన విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. బాధ, కోపం, ప్రతీకార వాంఛ, ఆ యువతి ఆలోచన విన్నాకా పునరాలోచన, ఆ భావాల పునస్సమీక్ష చేసుకుంటాం ఈ నవల గురించి వింటే.

Tap to Listen

2014లో మలాలాతో పాటుగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న బాలల హక్కుల పోరాట నాయకుడు కైలాష్ సత్యార్థి, ప్రపంచవ్యాప్తంగా compassionate behavior(అందరి పట్ల కరుణ కలిగే వ్యక్తిత్వం) రూపొందాలని, అందుకు అన్ని రకాల సామాజిక సంఘాలు కృషి చేయాలని అంటారు. అదే జరిగి అందరిలోనూ సహృదయ భావం పెరిగితే ఏ యుద్ధాలూ ఉండవు కదా.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :