పేరెంటింగ్ ఒక కళ

Ram Kottapalli
November 6, 2023

ఒక గురువు, తన శిష్యుడు ఒక విద్యలో పురోగతి సాధించడానికి ప్రతి దశలోనూ పక్కనే ఉండి ఏ దశలో ఏం చేయాలో, ఏ సాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చెప్తూ శిష్యుని బుద్ధిని, శక్తిని సరిగా నిర్మించడానికి తరచూ కృషి చేసినట్లు, పేరెంటింగ్ లో కూడా తల్లిదండ్రుల కృషి అలాగే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఈ కళని ఎంత Complicate చేయకుండా ఉపయోగిస్తే అంత గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దవచ్చు. అందుకు అవసరమైన సహాయం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. పేరెంటింగ్లో తల్లిదండ్రులు ఎదుర్కునే సమస్యలు చాలా ఉన్నాయి. కొందరు పిల్లలకి మానసిక సమస్యలు అయితే, ఇంకొందరికి ప్రవర్తనా సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల్లో ఈ సమస్యలను పరిష్కరించడానికి.....

నేటి బాలలే రేపటి పౌరులు అని ఒక సూక్తి. అలాంటి పౌరులని భావి తరాలకి అందించగలిగే Super Power తల్లిదండ్రులకి లభించడం ఒక వరమూ, ఒక సవాలు కూడా. ఒక చిత్రకారుడు తన painting కొన్ని దశాబ్దాల పాటు వెలుగు వెలిగాలని గీసేటట్లు, ఒక శిల్పి దేవతా శిల్పాన్ని శతాబ్దాల పాటు మానవాళి మొక్కాలని చెక్కినట్లు, తల్లిదండ్రులు వారి పిల్లలను సమాజంలో ఒక మంచి పౌరులిగా, భవిష్యత్ ని నిర్మించే వారిగా తీర్చిదిద్దడం కూడా ఒక కళ. 

ఇప్పుడు “నేను” అనే స్థితి ఎలా ఏర్పడింది అని ప్రశ్నించుకుంటే చిన్నతనం నుంచి క్రమంగా ఎదుగుతూ సమాజంలో, స్నేహితుల్లో, బంధువుల్లో, పాఠాలు నేర్పే గురువుల్లో ఒకొక్క గుణాన్ని, సుగుణాన్ని మనలో నింపుకుంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరుచుకున్నాం అనే సమాధానం చెప్పవచ్చు. కాని ఏ గుణం నేర్చుకోవాలో, దేనిని విడిచిపెట్టాలో, దేనిని పట్టుకోవాలో ఒక అంతర్వాహినిగా పిల్లల్ని గమనిస్తూ, సరిగా craft చేసే శక్తి తల్లిదండ్రులకు ఉంటుంది. 

కాని ఈ శక్తిని తెలుసుకోవడం అందరి తల్లిదండ్రులకి సాధ్యం కాకపోవచ్చు. ఒక గురువు తన శిష్యుడు ఒక విద్యలో పురోగతి సాధించడానికి ప్రతి దశలోనూ పక్కనే ఉండి ఏ దశలో ఏం చేయాలో, ఏ సాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చెప్తూ శిష్యుని బుద్ధిని, శక్తిని సరిగా నిర్మించడానికి తరచూ కృషి చేసినట్లు, పేరెంటింగ్ లో కూడా తల్లిదండ్రుల కృషి అలాగే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఈ కళని ఎంత Complicate చేయకుండా ఉపయోగిస్తే అంత గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దవచ్చు. అందుకు అవసరమైన సహాయం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. 

పేరెంటింగ్లో తల్లిదండ్రులు ఎదుర్కునే సమస్యలు చాలా ఉన్నాయి. కొందరు పిల్లలకి మానసిక సమస్యలు అయితే ఇంకొందరికి ప్రవర్తనా సమస్యలు ఉంటాయి. Learning Disabilities, Shyness, Communication fear, Autism వంటి మానసిక సమస్యలు, మాట వినకపోవడం, అబద్దాలు చెప్పడం, అధికంగా కోపం తెచ్చుకోవడం, ఎదురు మాట్లాడటం వంటి ప్రవర్తనా సమస్యలు ఉంటాయి. 

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్లో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిపుణుల సలహా తీసుకుంటే, ఇంకొందరు అధికంగా ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్టడం, తిట్టడం, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం వంటి పద్దతులు ఎంచుకుంటారు. ఒకరు సహాయం కోరడం మంచి విషయం, మరొకరు అసలు సహాయం గురించి ఆలోచించపోవడం బాధకరమైన విషయం అయినా ప్రధానంగా వారు అసలు పిల్లల్లో ఉన్న ఆ సమస్యని గుర్తించలేక పోవడం ఇంకా బాధాకరమైన విషయం. 

ఈ వారం జరిగిన దాసుభాషితం ప్రసంగంలో పిల్లల్లో ఉన్న ఇలాంటి సమస్యల గురించి, వాటిని ఏ దృష్టికోణంలో మనం చూడాలి, ఎలా ఆలోచించాలి, ఎటువంటి పరిష్కారాలు ఎంచుకోవాలి అన్న విషయాలపై చాలా లోతైన విషయాలను Child Psychologist శ్రీమతి సుధా మాధవి యల్లాప్రగడ గారు, USA లో Remedial Instructor గా పనిచేస్తున్న శ్రీమతి లక్ష్మి భవాని గారు ప్రసంగించారు. 

ఈ ప్రసంగంలో పిల్లలు అధికంగా అల్లరి చేయడం, Attention Seeking కోసం వారు చేసే Destructive Behaviour వెనక ఉన్న కారణాలు, కొన్ని సందర్భాలలో వారు వ్యక్తపరచలేని బాధా, కోపం వలన వారికి కలిగే మానసిక పరిస్థితి లాంటి విషయాలపై చాలా వివరణాత్మకమైన చర్చ జరిగింది. 

Learning Disability ఉన్న పిల్లల్లో Remedial Intervention అనే పద్దతి ద్వారా మూడు ఇంద్రియాలు, చూపు, వినికిడి, స్పర్శ ప్రభావితం చేసి పాఠాలు ఎలా నేర్పవచ్చో సుధా మాధవి గారు చెప్పారు. కొంతమంది పిల్లల్లో Learning Disability వలన 2+2 నాలుగు అవుతుంది అని నేర్పడానికి నాలుగు చింత పిక్కలు వారికి చూపించి 2+2 కూడితే నాలుగు అవుతుంది అని వారికి ఆధార పూర్వకంగా నేర్పించాలి అని ఒక ఉదాహరణతో లక్ష్మీ భవాని గారు తెలిపారు. 

తల్లిదండ్రులుగా మనం చెప్పేది పిల్లలు వినాలి, మనకి గౌరవం ఇవ్వాలి అని కోరుకుంటాం. కానీ, పిల్లల నుండి గౌరవం పొందే స్థితిలో మన ప్రవర్తన ఉందా, లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఫోన్, టీవీ చూడద్దు అని చెప్తూ, మనమే ఫోన్ లో మునిగిపోతే, మన మాట వినాలని పిల్లలకి ఎలా అనిపిస్తుంది అంటూ సూటిగా ప్రశ్నించారు భవాని గారు. అలాగే చదువులో కాస్త వెనుకబడిన వెంటనే మా పిల్లలకి learning disability ఉంది అంటూ పేర్లు పెట్టేయకూడదు అని, వారు ఎందుకు చదవడం లేదు అనేది తెలుసుకోవాలని చెప్పారామె.

పిల్లలు ఎక్కువగా చెప్పింది పాటించడం కంటే, తల్లిదండ్రులు పాటిస్తున్నది గ్రహిస్తారు. వాళ్ళు గ్రహించిందే వాళ్ళు పాటిస్తారు. కాబట్టి పిల్లల ప్రవర్తనను ప్రతిభింబించేది, ప్రేరేపించేది తల్లిదండ్రుల ప్రవర్తనే. మరి మనల్ని ప్రభావవంతంగా నిర్మించుకుంటూ, పిల్లలని ప్రతిభావంతులుగా ఎలా తీర్చి దిద్దాలి అనే విషయాన్ని లోతుగా తెలుసుకోడానికి ఈ ప్రసంగం మీకు సహాయపడుతుంది. 

అలాగే పేరెంటింగ్ విషయంలో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, నేరుగా సుధా మాధవి, లక్ష్మీ భవాని గార్ల నుండి professional help పొందడం కోసం త్వరలో Taare parenting app ను అతిత్వరలో తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి www.taarecounselling.com వెబ్సైట్ ద్వారా పేరెంటింగ్ కి సంబందించిన ప్రధాన విషయాలు తెల్సుకోవచ్చు, support@taarecounselling.comఈ- మెయిల్ ద్వారా సుధా మాధవి గారిని సంప్రదించవచ్చు.

మన పిల్లల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో, వారి ప్రవర్తనకు కారణాలు ఏమై ఉండవచ్చో, ఏదైనా శారీరిక, మానసిక లోపలున్న పిల్లలను పెంచే విధానంలో ఉపయోగపడే విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ఈ ప్రసంగం మొదటి అడుగు వేయించగలదు. ఈ పూర్తి ప్రసంగాన్నిపై వీడియోలో చూడచ్చు. 

ఒకటి నిజం, శిష్యునికి నేర్పుతూ గురువు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాడు. అలానే పిల్లల్ని పెంచుతూ మనం కూడా నిరంతరం ఎదుగుతూనే ఉంటాం. ఈ రెండు ఎదుగుదలలూ మనకే కాదు, సమాజానికి కూడా చాలా అవసరం.

అభినందనలు,

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :