పోల్ ఖోల్

Dasu Kiran
June 13, 2024

దాసుభాషితం మీ సమగ్ర శ్రేయస్సులో ఎంతవరకూ ఉపయోగపడింది? అంటూ మేము నిర్వహించిన పోల్ లో చాలామంది పాల్గొని, మాకు ఎంతో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నన్ను ఆకర్షించిన వ్యాఖ్యల్లో ఇది ఒకటి. ఒక మంచి పని కొనసాగించడానికి పొగడ్త మరింత ఉత్సాహాన్ని ఇస్తే, విమర్శ ఆత్మపరిశీలనకు, సమాచార లోపం ఉంటే సరి చేయడానికి దోహద పడుతుంది. దాసుభాషితం మొదటి ఉపశీర్షిక “తెలుగు సంగీత సాహిత్య కళా వేదిక”. దీని నుండి “సమగ్ర శ్రేయస్సుకు సోపానం” అవడం నిజానికి మాకు వచ్చిన ఆలోచన కాదు. కోవిడ్ కాలంలో...

“I am always confused why Wellbeing is stressed a lot by a Paid App. Where is the original content by your App in Wellbeing? I see it's a marketing gimmick by your App.”

దాసుభాషితం మీ సమగ్ర శ్రేయస్సులో ఎంతవరకూ ఉపయోగపడింది? అంటూ మేము నిర్వహించిన పోల్ లో చాలామంది పాల్గొని, మాకు ఎంతో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నన్ను ఆకర్షించిన వ్యాఖ్యల్లో ఇది ఒకటి. ఒక మంచి పని కొనసాగించడానికి పొగడ్త మరింత ఉత్సాహాన్ని ఇస్తే, విమర్శ ఆత్మపరిశీలనకు, సమాచార లోపం ఉంటే సరి చేయడానికి దోహద పడుతుంది. 

దాసుభాషితం మొదటి ఉపశీర్షిక “తెలుగు సంగీత సాహిత్య కళా వేదిక”. దీని నుండి “సమగ్ర శ్రేయస్సుకు సోపానం” అవడం నిజానికి మాకు వచ్చిన ఆలోచన కాదు. కోవిడ్ కాలంలో యాప్ లో కాంటెంట్ ను ఉచితం చేశాము. అపుడు ఒక ఈమెయిల్ వచ్చింది. “ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవల ఉచితంగా విన్నానండి, కాస్త ధైర్యం వచ్చింది. ఇపుడు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది కాబట్టి నేను యాప్ కు చందా కట్టాను” అని.

అపుడు మాకు అనిపించింది, పరోక్షంగానే సాహిత్యం ఇంత మేలు చేస్తే, మనం శ్రేయస్సు పెంచడాన్ని, పంచడాన్ని ఒక సంకల్పంగా చేస్తే ఇంకెంత మేలు చేయగలం అని. 

యాప్ లో Original Wellbeing కాంటెంట్ ఏదని అడిగారు. దాసుభాషితం యాప్ లో Jeevanam అనే విభాగంలో చాలా శీర్షికలు మేము కమిషన్ చేసినవే. అయినా దాసుభాషితం అంటే కేవలం యాప్ ఒక్కటే కాదు. YouTube లో దాసుభాషితం ప్రసంగాలు, ఈ WhatsApp కూటమి, ఇందులో మేము వ్రాసే వ్యాసాలు, వాటిపై జరిగే చర్చలు అన్నీ శ్రేయస్సును పెంపొందించేవే. ఇంకా చెప్పాలంటే, దాసుభాషితం తో ప్రత్యక్షంగా సంబంధం లేని అద్వైత సాధన WhatsApp గ్రూప్ కూడా శ్రేయస్సును పెంపొందిచే లక్ష్యంతో నిర్వహించేదే.

ఇంకొకరు ఇలా అన్నారు? “Listening to these books helping me grow, but I am a bit opprehensive about calling this as useful for my "shreyassu" - please don't get me wrong. I highly appreciate your efforts on offering lot of content but isn't that the expectation of such a platform?”

ఇక్కడ మళ్ళీ సంకల్పం గురించి చెప్పుకోవాలి. Pocket FM కు లక్షల్లో వినియోగదారులున్నారు. అందులో ఎక్కువ కాంటెంట్ ఏమై ఉంటుందని మీ ఊహ? సరిగ్గా ఊహించారు. Erotica. దాసుభాషితం కూడా లాభాపేక్ష కలిగిన సంస్థ (ఎందుకో అది వేరే చర్చ. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను.) లాభాలు పెంచాలంటే అధికులని ఆకర్షించే కాంటెంట్ నిర్మించాలి. మరి దాసుభాషితం లో Erotica ఎందుకు లేదు?

ఒరిజినల్ కాంటెంట్ ఉండడమే కాదు, ఏ కాంటెంట్ ఉండకూడదో కూడా శ్రేయస్సు అనే సంకల్పం నిర్దేశిస్తుంది. ఎన్ని లాభాపేక్ష సంస్థలు ఈ విధంగా ఆలోచిస్తాయి?

ఆనందకరమైన విషయం ఏమిటంటే మీలో 93% దాసుభాషితం మీ శ్రేయస్సును (కొంతైనా) పెంపొందిస్తుందని అన్నారు. కేవలం 7% చెప్పలేమనో, కాదనో అన్నారు. ఈ గణాంకాలు తిరగబడినా నాకు ఆనందమే. ఎందుకంటే పుస్తకాలు ఎవరైనా అమ్మవచ్చు. కానీ ఒకరైన ఈ క్రింది విధంగా అనుకుంటున్నారంటే మనం చేసే పనికి సార్థకత ఉన్నట్టే కదా. 

“As i have been using the app, many issues related to personality, peace, spirituality etc. are becoming more adaptable and reachable.”   

మీలో కొందరు సూక్షమైన వ్యాఖ్యలు చేసారు. ఉదాహరణకు Wellbeing is a long-term project. అదే విషయాన్ని ఒకరు ఇలా అన్నారు.  

”ఇది 30/60/90 రోజుల్లో ఏదో ఖచ్చితంగా ఇలా /అలా జరిగిపోయే విషయం/విషయాలు కావు కానీ దీర్ఘకాలిక శ్రేయస్సు కి ఖచ్చితంగా దోహదపడే విషయాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం కదా!”

WhatsApp కూటమి గురించి వేరొకరు ఇలా అన్నారు. 

“సమూహం వలన సానుకూల ఆలోచన అలవాటు అవుతుంది. ప్రస్తుతం మైక్రో కుటుంబ వ్యవస్థ వలన స్వద్ర చింతన తప్ప వేరే ఆలోచించే అలవాటు లేదు.”

ఒక సమూహం ఏర్పడాలంటే, ముందు మేము ఒక లోగో గా కాకుండా మనుషులుగా తెలియాలనుకున్నాము. మా మొహాలు తెలిసేందుకు ఫోటో షూట్ చేయించుకున్నాము. దాసుభాషితం ఉద్యోగస్తులందరికీ ఎవరి బాధ్యతలు వారికున్నా, అందరం వ్రాయాలని నిర్ణయించాము. 

అది సాకారమై అందరి వ్యాసాలు మీ అభిమానం పొందుతున్నాయని May 5 న జరిపిన పోల్ ద్వారా తెలిసి చాలా ఆనందం కలిగింది. మాలో ఎవరమూ ఇంతకు ముందు ఇంత విస్తృతంగా వ్రాసింది లేదు. ప్రభకైతే అసలు తనమీద తనకి నమ్మకం కూడా లేదు. కానీ ఒక వాయిస్ ఆర్టిస్ట్ గా, వ్యాసకర్తగా ఆమె ఎదుగుతున్న తీరు చూస్తే, గర్వం కలుగుతుంది. 

యువకుడు రామ్ కోరాలో వ్రాసిన కొన్ని వ్యాసాలు చదివినా, ఈ కూటమి లో అతను వ్రాసే వ్యాసాలు అతని ఆలోచనా పరిణితిని advertise చేస్తాయి.

ఇక #కథలు_కబుర్లకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. అన్నిటికన్నా నిడివి ఎక్కువున్న శీర్షిక ఇది. ప్రతీ వారం దాదాపు 50 వేల మందికి ఈ #కథలు_కబుర్లు ఈమెయిల్ లో వెళ్తాయి. Analytics పరంగా చూస్తే దీన్ని Open Rates చాలా సార్లు Industry benchmarks (22%) ను అధిగమిస్తాయి. ఈ భావలేఖ (Newsletter) ఇంతగా ప్రాచుర్యం పొందడం వెనుక మీనా శైలిది ప్రధాన పాత్ర అనిపిస్తుంటుది నాకు.

ఇంకా చేయవలసిన పనులు, మెరుగు పరచవలసిన అంశాలు చాలా ఉన్నాయి. All in good time. 

చివరగా ఒకరు కూటమి గురించి ఇలా అన్నారు. “Sometimes there is banter. It is impossible see all posts. I miss some good ones because of noise.” ఇది సహజం. కానీ ఈమాత్రం సంభాషణ కూడా లేకపోతే, కూటమి పండదు. 

అయితే, WhatsApp Channels అని ఒకటి ఉంది. అది one-way communication system. దాసుభాషితం ఛానల్ అని ఒకటి సృష్టించి, మన బృందం ఎంపిక చేసిన వ్యాసాలు ఇందులో ప్రచురించడం ఒక మార్గం. కేవలం కాంటెంట్ మీదనే ఆసక్తి ఉన్న వారు ఈ ఛానల్ కు subscribe చేసుకోవచ్చు.

మీ అభిప్రాయం తెలుపగలరు. 

దాసుభాషితం రేడియో

ఈ పోల్ ద్వారా మీ పల్స్ మాత్రమే కాదు, ఎన్నో మంచి సలహాలు, అభిప్రాయాలు కూడా మేం తెలుసుకున్నాం. ఇంకా ఏమేం విషయాలను దాసుభాషితం చేయవచ్చో, వాటిపై మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు పలువురు సభ్యులు. వాటన్నిటినీ పరిశీలించి, వెంటనే అమలుపరచగల సలహాలు కొన్నిటిని తయారుగా పెట్టుకున్నాం. అయితే, మిగిలిన వాటిని కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని, త్వరలోనే అమలుపరుస్తాం.

మీలో కొందరు ఇచ్చిన మంచి సలహాల్లో ఒకటి ‘దాసుభాషితం రేడియో’. ఈ సలహా మా బృందాన్ని చాలా త్వరగా ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు. వెంటనే దీనిపై ఎంతో ఉత్సాహంగా పనులు ప్రారంభించాం. ఎంత ఉత్సాహంగా అంటే, వచ్చే సోమవారం నుండి ‘దాసుభాషితం రేడియో’ ప్రారంభించేంతగా. ప్రస్తుతం ఉన్న యాప్ లోనే బ్యానర్ విభాగంలో ఈ రేడియో ప్రసారం జరుగుతుంది.

ఇందులో ఏ కాంటెంట్, ఎప్పుడు, ఎలా అందించాలి అనే విషయాన్ని కాంటెంట్ మేనేజర్ మీనా యోగీశ్వర్, లక్ష్మీప్రభలు ప్రణాళిక నిర్మిస్తున్నారు. ఈ సోమవారం నుండి మొదలయ్యే ఈ విన్నూత్న కార్యక్రమాన్ని వింటారని, వాటిపై సలహాలు, సూచనలు అందిస్తారని ఆశిస్తున్నాము.

అభినందనలు,

దాసుకిరణ్.

Image Courtesy :