పొన్నియిన్ సెల్వన్ ను పరిచయం చేసుకుందాం రండి.

Meena Yogeshwar
April 17, 2023

తమిళ చరిత్ర మనలో ఎంతమందికి తెలుసు? వారి చక్రవర్తులు సాధించిన విజయాలు మనలో ఎంతమందిమి లెక్కించగలం? కళింగ (ఒడిశా) నుండి మన ఆంధ్ర ప్రాంతమైన వేంగినాడు, కేరళ ప్రాంతమైన చేరనాడు, తమిళ నాడు, శ్రీలంకలోని సగం, లక్ష్యద్వీపం, మాల్దీవులను తన అధికారం కిందకు తెచ్చుకున్నవాడు, తంజావూరులో 216 అడుగుల ఎత్తుగల విమానగోపురంతో బృహదీశ్వరాలయాన్ని నిర్మించినవాడు, భూములు, పన్నులు, గ్రామాధికారాల విషయాలలో నేటి పాలకులు కుడా ఉండలేనంత ఆధునికంగా ఉన్నవాడు అయిన మొదటి రాజ రాజ చోళుని కథ...

భాష మూలాలలోనూ, సంస్కృతి - సంప్రదాయాలలోనూ, చరిత్రలోనూ మనకు అచ్చంగా సోదర సమానులు అనదగ్గ వారు తమిళులు. ‘తెలుగు, తమిళం జతకట్టెనెన్నడో’ అన్నారు వేటూరి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ రెండు జాతులు ఎంతో చరిత్రను కలిసి పంచుకున్నాయి. శాతవాహనుల తరువాత ఆంధ్ర, ఉత్తర తమిళ ప్రాంతాలను దాదాపు 600ఏళ్ళు పాలించిన పల్లవులు మన పల్నాడు (పల్లవనాడు కాబట్టే దానిని పల్నాడు అన్నారని కొందరు చరిత్రకారులు చెబుతారు) నుండే వచ్చారని ఒక వాదన. మన కాకతీయ, నాయక రాజులు మహావైభవంగా ఎన్నో ఏళ్ళు ఏలారు ఆ నాడును. 

తమిళ చక్రవర్తులైన పాండ్యులు, చోళులు మన ప్రాంతాన్ని కూడా ఎన్నో ఏళ్ళు పరిపాలించారు. విజయనగర రాజుల పరిపాలనలో అయితే ఆంధ్ర భాష తమిళనాడులోని ఎన్నో ప్రాంతాల్లో దాదాపుగా అధికారిక భాషగా వెలుగొందింది. ఇక్కడి విద్వాంసులు, పండితులు, సామాన్య ప్రజలు ఎంతమంది అక్కడి కావేరీ తీరానికి వలస వెళ్ళారో లెక్కించడం కష్టం. అలాంటి తమిళ చరిత్ర మనలో ఎంతమందికి తెలుసు. వారి చక్రవర్తులు సాధించిన విజయాలు మనలో ఎంతమందిమి లెక్కించగలం.

కళింగ (ఒడిశా) నుండి మన ఆంధ్ర ప్రాంతమైన వేంగినాడు, కేరళ ప్రాంతమైన చేరనాడు, తమిళ నాడు, శ్రీలంకలోని సగం, లక్ష్యద్వీపం, మాల్దీవులను తన అధికారం కిందకు తెచ్చుకున్నవాడు, తంజావూరులో 216 అడుగుల ఎత్తుగల విమానగోపురంతో బృహదీశ్వరాలయాన్ని నిర్మించినవాడు, భూములు, పన్నులు, గ్రామాధికారాల విషయాలలో నేటి పాలకులు కుడా ఉండలేనంత ఆధునికంగా ఉన్నవాడు అయిన మొదటి రాజ రాజ చోళుని కథ పొన్నియిన్ సెల్వన్ నవల.

కల్కి కృష్ణమూర్తి 1960ల ప్రాంతంలో రాసిన ఈ తమిళ నవల సాధించిన విజయం, పాఠకాదరణను కొలవడం కష్టం. పాతకాలం నాటి తమిళ భాషలో రాయబడిన ఈ నవలను ఎంతో శ్రమకోర్చి, శ్రద్ధగా, ఎంతో ప్రీతితో తెలుగులోకి అనువాదం చేశారు నాగరాజన్ కృష్ణమూర్తి గారు. ఐదు భాగాల ఈ బృహన్నవలను అనువాదం చేయడానికి ఆయనకు ప్రేరణనిచ్చిన విషయాల దగ్గర నుంచి, ఈ అనువాదంలోని శ్రమ, అదిచ్చిన తృప్తి, తమిళ చరిత్ర, ఈ నవలలో ఆ చరిత్ర వివరింపబడిన తీరు, ఈ నవలను మణిరత్నం తీసిన సినిమాపై ఆయన అభిప్రాయం. నవల-సినిమాల మధ్య వ్యత్యాసం వంటి ఎన్నో విషయాలను మనతో పంచుకోనున్నారు నాగరాజన్ గారు.

ఏప్రిల్ 22వ తేదీ, శనివారం ఉదయం 11గంటలకు(IST) పొన్నియిన్ సెల్వన్ తెలుగు అనువాదకులు నాగరాజన్ కృష్ణమూర్తి గారు, ప్రముఖ కోరన్, ‘నేడే చూడండి’ పుస్తక రచయిత పవన్ సంతోష్ సూరంపూడి గార్లతో దాసుభాషితం యూట్యూబ్ ఛానెల్ లో లైవ్ ఈవెంట్ జరగనున్నది. ఈ కింది లింకును ఉపయోగించి లైవ్ చుడవచ్చు.

Tap for the link

ఆచార్యదేవోభవ - 3

Tap to Listen

తెలుగు భాషకు దక్కిన గౌరవాలు, లాభాలలో ఎప్పటికీ గుర్తుంచుకోవలసినది ‘ఆంధ్ర విశ్వకళా పరిషత్’. 1926లో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం’ పేరుతో ప్రసిద్ధి చెందింది. తెలుగు మేధావుల కలలను సాకారం చేస్తూ ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం ఎందరో గొప్పవారిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం నుండి హేమాహేమీలైన ఆచార్యుల అడుగుజాడలలో నడిచి ఎందరో శిష్యులు తెలుగునాటే కాక, ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందినవారు ఉన్నారు. 

మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ సర్.సి. ఆర్. రెడ్డి దగ్గర నుండి, ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గర నుండి నేటి వరకూ ఎందరో గొప్పవారు ఈ సంస్థలో పదవులు చేపట్టారు. ఆ విశ్వవిద్యాలయంలో మరువలేని సేవలందించిన ఆచార్యులను తలుచుకునే అరుదైన అవకాశం ఈ ఆచార్యదేవోభవ ద్వారా మనం ఈ వారం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం వినబోయే మీలో ఎందరో ఈ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి ఉండవచ్చు, పూర్వ విద్యార్ధులు కావచ్చు, ప్రస్తుత విద్యార్ధులు కావచ్చు, అందులో చేరాలని కలలు కనేవారు కావచ్చు, కేవలం ఆ సంస్థ గురించి విని ఉన్నవారు మాత్రమే కావచ్చు. కానీ, వినే ప్రతీవారూ ఛాతీ పొంగించుకుని, మన తెలుగువారి విశ్వవిద్యాలయం అని అనుకోక మానరు అని మాత్రం  ఖచ్చితంగా చెప్పవచ్చు.

అభినందనలతో,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :