#16 ‘తెలుగు ఛవి’ పీవీ, శతజయంతి.

Dasu Kiran
June 26, 2020

తెలుగు వారి ఘనమైన ప్రతీక, భారత మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, సాహిత్య కృషీవలుడు, బహుభాషావేత్త కీ.శే. శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి జూన్ 28 న. ప్రపంచ తెలుగు రచయితల సంఘం వారు ఈ వేడుకను ‘తెలుగు భాషా చైతన్యమహోత్సవాలు’ గా నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్బంగా వారు ప్రచురించిన కర పత్రికలో పీవీ గారి తెలుగు భాషాభిమానం వ్యక్తమయ్యే కొన్ని విషయాలను ఈ విధంగా ప్రస్తావించారు.

‍తెలుగు వారి ఘనమైన ప్రతీక, భారత మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, సాహిత్య కృషీవలుడు, బహుభాషావేత్త కీ.శే. శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి జూన్ 28 న.ప్రపంచ తెలుగు రచయితల సంఘం వారు ఈ వేడుకను ‘తెలుగు భాషా చైతన్యమహోత్సవాలు’ గా నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్బంగా వారు ప్రచురించిన కర పత్రికలో పీవీ గారి తెలుగు భాషాభిమానం వ్యక్తమయ్యే కొన్ని విషయాలను ఈ విధంగా ప్రస్తావించారు.

"1967లో అధికారభాషగా తెలుగు అమలుకు చట్టబద్దతను సాధించటమేకాకుండా, ప్రామాణిక కీబోర్డులు, తెలుగు టైపురైటర్లను తయారు చేయించి, పాలనా భాషగా తెలుగు అమలు, తెలుగులో బోధనల కోసం కృషి చేశారాయన. అధికార భాషాసంఘం, తెలుగు అకాడెమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థల  వ్యవస్థాపనకు కారకుడు శ్రీ పీవీయే! భాషా చైతన్యం ప్రజల్లో కలిగించేందుకు తెలుగు భాషోద్యమం రూపుదిద్దుకోవడానికి అయన స్ఫూర్తి కలిగించారు. యావద్భారత దేశంలోనూ మాతృభాషల అభివృద్ధి గురించి ఆయన పరితపించారు.

'వేయిపగడలు' నవలకు 'సహస్రఫణ్' హిందీ అనువాదమే కాకుండా తెలుగు భాషకు తొలి జ్ఞానపీఠం విశ్వనాధకు దక్కేందుకు కారకులు, ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ మరాఠీ రచనకు ‘అబల జీవితం’ తెలుగు అనువాదం, జయప్రభ గారి కవిత్వానికి  ఆంగ్లానువాదం, "ఇన్సైడర్" పేరుతో ఆత్మకధాత్మక స్వతంత్ర నవల, “గొల్ల రామవ్వ కథ”, “విస్మృత కథ”, మరెన్నో వ్యాసాలు శ్రీ పీవీ సాహితీ వ్యక్తిత్వాన్ని మహోన్నతం చేశాయి. తెలుగు ప్రజలంతా శ్రీ పీవీని తెలుగు తనానికి ప్రతీకగా భావిస్తారు."

Golla Ramavva
Tap to listen
Mangayya Adrustam
Tap to listen
Asalem Jarigindante
Tap to listen

తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఒక అవ్వ చూపిన తెగువు బలిదానాల విషణ్ణతను _“గొల్ల రామవ్వ కథ”_ కథలో చూపిన పీవీ, అదే _“మంగయ్య అదృష్టం”_ అనే నవలికలో సున్నితమైన హాస్యాన్ని, వ్యంగాన్ని చూపుతారు. పీవీ రచనా ప్రతిభను అద్దంపట్టే ఈ రెండు రచనల శ్రవణ రూపాలు ఇప్పటికే దాసుభాషితం యాప్ లో ఉన్నాయి. ఆయన శతజయంతి సందర్భంగా వాటిని మళ్ళీ spotlight లోకి తీసుకువస్తున్నాము.

తెలుగు భాష, ప్రజల శ్రేయస్సుకే కాకుండా, క్లిష్ట సమయం దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టి దేశ దశను దిశను ఎలా ప్రభావితం చేశారో PVRK ప్రసాద్ గారి రచన ‘అసలేం జరిగిందంటే” లో తెలుస్తుంది. ఆ రచన శ్రవణ రూపం కూడా దాసుభాషితం యాప్ లో ఉంది.

మహనీయుడైన పీవీకి, ‘భారత రత్న’ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం ముదావహం. ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో పీవీది శాశ్వత స్థానం అనేది నిర్వివాదాంశం.

Image Credit: The Indian Wire

Image Courtesy :