సాలూరి వారికి కోపమొస్తే…

Meena Yogeshwar
February 6, 2024

గొప్ప సంగీత విద్వాంసులు కూడా ఉపయోగించడానికి భయపడే బేగడ వంటివి, మరి కొన్ని రాగాలను అలవోకగా, అందంగా వాడేవారు. అలాంటి క్లిష్టమైన రాగాలను కూడా ఉపయోగించాలంటే ఎంత విద్వత్తు ఉండాలి, సంగీతంపై ఎంత పట్టు ఉండాలి. ఆ పట్టు, విద్వత్తు వారి తండ్రి సన్యాసిరాజు గారి చలవే. ఎంతో కష్టపడి, శ్రమకోర్చి తన కుమారులు ఇద్దరికీ గొప్ప గొప్పవారి దగ్గర సంగీతం నేర్పించారు సన్యాసిరాజు గారు.ఈ అభ్యాసం అంతా వారిని తెలుగు సినీ రంగంలో గొప్ప సంగీత దర్శకునిగా నిలిబెట్టింది. తబలా, మృదంగం, హార్మోనీయం, పియానో, మాండలిన్, గిటార్, వయోలిన్ ఇలా ఎన్నో సంగీత వాద్యాలను అలవోకగా వాయించేవారు. మరి వారు ఎవరంటే ..

మెలోడీ అంటే గుర్తుకువచ్చే సంగీత దర్శకులలో సాలూరి రాజేశ్వరరావు గారు మొదటే వస్తారు. గొప్ప సంగీత విద్వాంసులు కూడా ఉపయోగించడానికి భయపడే కొన్ని రాగాలను అలవోకగా, అందంగా వాడడం సాలూరి వారికే చెల్లింది. బేగడ వంటి రాగాలు ఆ కోవలోకే వస్తాయి. అలాంటి క్లిష్టమైన రాగాలను కూడా ఉపయోగించాలంటే ఎంత విద్వత్తు ఉండాలి, సంగీతంపై ఎంత పట్టు ఉండాలి. ఆ పట్టు, విద్వత్తు వారి తండ్రి సన్యాసిరాజు గారి చలవే. ఎంతో కష్టపడి, శ్రమకోర్చి తన కుమారులు ఇద్దరికీ గొప్ప గొప్పవారి దగ్గర సంగీతం నేర్పించారు సన్యాసిరాజు గారు.

ఈ అభ్యాసం అంతా రాజేశ్వరరావు గారిని తెలుగు సినీ రంగంలో గొప్ప సంగీత దర్శకునిగా నిలిబెట్టింది. తబలా, మృదంగం, హార్మోనీయం, పియానో, మాండలిన్, గిటార్, వయోలిన్ ఇలా ఎన్నో సంగీత వాద్యాలను అలవోకగా వాయించేవారు ఆయన. దేశీ, పాశ్చాత్య అంటూ సంగీతంలో బేధ భావం చూపించకుండా, ఎక్కడ నేర్చుకోగలిగితే అక్కడ నేర్చుకుంటూ తన సంగీత జ్ఞానాన్ని పెంచుకున్నారు సాలూరి. అందుకే కర్ణాటక, హిందుస్థానీ, జాజ్, పాప్ ఇలా అన్నిటిలోనూ గీతాలు సృజించగలిగారు, అన్నిటి ద్వారా శ్రోతలను మెప్పించగలిగారు.

ఇక తెలుగు సినీ సంగీతంలో నిలిచిపోయే జావళీలు అందించినవారు సాలూరి వారే. పిలచిన బిగువటరా(మల్లీశ్వరి), బాలనురా మదనా(మిస్సమ్మ), రారా నా స్వామి రారా(విప్రనారాయణ), అందాల బొమ్మతో ఆటాడవా(అమరశిల్పి జక్కన్న), నిను చేర మనసాయెరా(బొబ్బిలి యుద్ధం) వంటి జావళీలతో జలతారు పరదా తయారు చేశారు సాలూరి వారు. అప్పటివరకూ జావళీలు అంటే ఎందరికో ఉన్న చిన్న చూపును దూరం చేసి, ప్రతివారి పెదవులపై ఆడేలా చేసినవారిలో ఆయన అగ్రగణ్యులు. జావళీలలో ఉండే అద్భుతమైన పదబిగువు, గొప్ప నాట్యానికి ఉండే ఆస్కారం వంటివి సాలూరి వారు గొప్పగా పట్టుకున్నారు అనడంలో సందేహం లేదు.

ఇక తెలుగునాట వీణ పాట అంటే సాలూరి వారు అన్న అభిప్రాయం ఎందరో సంగీత ప్రియుల్లో నాటుకుపోయింది. అందుకు కారణం వారు వీణను ఎంతో brilliant గా వాడుకున్న పద్ధతే. అంతే కాదు, హిందుస్థానీ రాగాలను కూడా సాలూరి వారు విరివిగా తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. కొన్ని కొన్ని పాటల్లో హిందుస్థానీ, కర్ణాటక రాగాలను అద్భుతంగా blend చేశారు కూడా. ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని విశేషణాలు, ఇన్నిందాల ప్రతిభా వెరసి, తెలుగువారు తరాల తరబడి వెన్నెట్లో పడుకుని, చల్లని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ, హాయిగా పాడుకోగలిగిన ఒక సంగీత భాండాగారాన్ని తయారు చేశారు సాలూరి వారు.

ఇంతకీ సాలూరి వారికి కోపమొస్తే ఏం జరుగుతుంది? ఆయన hurt అయితే ఏం చేస్తారు? ఎదుటివారి కోపానికి ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? తెలుసుకోవాలనుందా? ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఎలా తెలుస్తాయి? వారితో కలిసి ఉన్నవారిని కనుక్కుంటే తెలుస్తాయి. అదే చేశాం ఈ శనివారం నాడు. సాలూరి రాజేశ్వరరావు గారి శిష్యులు, స్వరకర్త, గాయకులు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారి ద్వారా పై విశేషాలే కాదు, మరెన్నో విశేషాలు తెలుసుకున్నాం. దాసుభాషితం ప్రతీ నెలా మొదటి శనివారం నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో తెలుసుకున్నాం. ఈ వీడియో ఎడిటింగ్ పూర్తి చేసిన తరవాత అతి త్వరలో దాసుభాషితం యూట్యూబ్ ఛానెల్ లో పెడతాం. తప్పకుండా చూడండేం. అంతవరకూ ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అంటూ పాడుకుంటూ ఆనందంగా గడిపేయండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :