తెలుగు వెలుగులు

Lakshmi Prabha
August 28, 2023

తెలుగు లో చిక్కులు, అందాలు రెండూ ఉన్నాయి. అందం ఏమిటంటే మన మనసుకు కలిగిన భావాన్ని కాగితం పై ఉంచడానికి అనేక అందమైన పదాలు మన తెలుగు సొంతం. సున్నితంగా చిన్న చిన్న పదాలతో సామాన్యునికి సైతం అర్ధమయ్యేలా పాటలు, గేయాలు, వ్యాసాలు ఎలా ఎన్నో ప్రక్రియల్లో రాయవచ్చు. మరోవైపు భాష లోతులు, నియమాలు, సాహిత్య దృష్టి తెలిస్తే కానీ అర్ధమవ్వన్ని పద్యాలలోనూ రాయవచ్చు. ఇక చిక్కు ఏమిటంటే...

ఎన్ని హారాలున్నా మణులను పొదిగిన హారం ఎంత విలువైనదో అలాగే, ప్రపంచంలో ఎన్ని భాషాలున్నా మాతృభాష స్థానం దానిదే. కథలు, కథానికలు, నవలలు, వ్యాసాలు, శీర్షికలు ఇలా ఎన్నో ప్రక్రియలతో మన తెలుగు రత్నాల హారంలా మెరిసిపోతోంది.  

క్రీస్తు పూర్వం-తర్వాత అని ఎలా చెప్పుకుంటామో అలానే, తెలుగు భాష విషయానికి వచ్చేసరికి శ్రీకృష్ణ దేవరాయలు పూర్వం-తర్వాత అని చెప్పుకోవాలి. రాయల హయాంలో తెలుగు ఒక వెలుగు వెలిగింది. రాయలు ఎన్ని ప్రాంతాల్లో పరిపాలించారో అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు అధికార భాషగా వెలుగొందింది.సంగీతం సాహిత్యం పై మక్కువ ఉన్న రాయలు తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలను పోషించి తెలుగుకు వన్నె తెచ్చారని దక్షిణ భారతీయులు ఎవరికీ చెప్పనవసరం లేదేమో. 

ఈ తెలుగు లో చిక్కులు, అందాలు రెండూ ఉన్నాయి. అందం ఏమిటంటే మన మనసుకు కలిగిన భావాన్ని కాగితం పై ఉంచడానికి అనేక అందమైన పదాలు మన తెలుగు సొంతం. సున్నితంగా చిన్న చిన్న పదాలతో సామాన్యునికి సైతం అర్ధమయ్యేలా  పాటలు, గేయాలు, వ్యాసాలు ఎలా ఎన్నో ప్రక్రియల్లో రాయవచ్చు.

మరోవైపు భాష లోతులు, నియమాలు, సాహిత్య దృష్టి తెలిస్తే కానీ అర్ధమవ్వన్ని పద్యాలలోనూ రాయవచ్చు. ఇక చిక్కు ఏమిటంటే చిన్న ఒత్తు తేడా వచ్చినా, సరిగా పలకక పోయినా అర్ధం తేడా వస్తుంది. ఉదాహరణకు 'రామునితో కపివరుండు యిట్లనియె'. ఇది అందరికీ తెలిసినదే. పదం ఎక్కడ ఆపాలో తెలియకపోతే ఏమవుతుందో కూడా మనకి తెలిసిందే. 

తెలుగు భాష ఆధారంగా మన కాలాన్ని, కవులను (ఆధునిక, ప్రాచీన కవులుగా) విభజించారు. మన భాషలో ఉన్న ఒక వినూత్న ప్రక్రియ అవధానం. కొంత మంది ఇచ్చిన పదాలతో, సందర్భం కాని చోట, అంటే భారతంలో సీత, రాముడు వచ్చేట్టు పద్యం చెప్పాలి అంటారు. కవి ఆలోచించే లోగా మరో ప్రశ్న అడిగేవారు, వారిని రకరకాల ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టేవారు ఉండగా, అవధాని గారు వ్యాకరణం తో పద్యాన్ని పూర్తి చేయాలి. ఇది ఎంత కష్టమైన ప్రక్రియో ఒకసారి చూస్తే అర్థమైపోతుంది.

ఇదికాక చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు దగ్గర పెరిగిన వారైతే నానుడు లతో ఆటలాడతారు. ప్రతీ దానికి ఒక పిట్ట కథ ఉంటుంది. నవరసాలని తన కలంతో పాలించగల శక్తి కవులదైతే, ఆ కవులకు, చదివే మనకు ఆశ్చర్యాన్నిచ్చే పదాలు మన తెలుగులో కోకొల్లలు.

ఉగ్గు పాలతో ఉల్లాసంగా నేర్చుకోవలసిన తెలుగు కనుమరుగై మమ్మీ, డాడీల రోజులు వచ్చాయి. రాను రాను ఇంతటి అందమైన తెలుగును, దానిలోని సొగసును నేర్చుకునే వారు , నేర్పే వారు కూడా తగ్గిపోతున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న మన తెలుగును, దేశ భాషలందు తెలుగు లెస్స అని అనిపించుకున్న మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ గడ్డపై పుట్టినవారందరికీ ఉంది.

పత్రికారంగంలో చిరకాలం పనిచేసి, ఎన్నో వ్యాసాలు రాసిన శ్రీ జంధ్యాల శరత్ బాబు గారు మన తెలుగు పుట్టుపూర్వోత్తరాల నుండి అన్ని దశలను, కాలాలనూ వివరిస్తూ రాసిన 'జన ఘన మన' వ్యాసాలు ఈ వారం విడుదల అవుతున్నాయి. మన ఘనమైన తెలుగు చరిత్రను తెలుసుకుందాం.

Tap to Listen

తెలుగోళ్ళు.. సినిమాలు.. ఒక చరిత్ర -ప్రసంగం

ఏ ప్రాంత సంస్కృతి, చరిత్ర తెలియాలి అన్నా వారి ఆహార వ్యవహారాలు, భాషలోని యాసలు, వినోదాలు పరిశీలించాలి. అదే పట్టికలోకి ఆ ప్రాంత సినిమాని కూడా కలపాలేమో. ఎందుకంటే ఒక ప్రాంతం మొత్తం ఆ సినిమాల్లో ప్రతిఫలించేస్తుంది కాబట్టి.

అలాగే ఒక సినీ పరిశ్రమ గమనాన్ని బేరీజు వేయడానికి కూడా ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతిని దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు ప్రముఖ వికీపీడియన్, కోరన్, ' నేడే చూడండి-తెలుగోళ్ళు.. సినిమాలు.. ఒక చరిత్ర ' పుస్తక రచయిత శ్రీ సూరంపూడి పవన్ సంతోష్.

దాసుభాషితంలో ఆడియో పుస్తకంగా నేరుగా విడుదలైన మొట్టమొదటి పుస్తకం ఇది.  రెండవ భాగం ఆడియో పుస్తక విడుదల, అలాగే ప్రింట్ పుస్తకం వచ్చే నెలలో విడుదల అవుతున్న సందర్భంగా ఈ నెల ప్రసంగాలు కార్యక్రమంలో  పవన్ మాట్లాడబోతున్నారు.

తెలుగోళ్ళు తమ సినీ పరిశ్రమని, తెలుగు సినిమా తెలుగోళ్లని ఎలా ప్రభావం చూపారో సెప్టెంబర్ నెల మొదటి శనివారం అయిన 2వ తేదీ ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) పవన్ ద్వారా తెలుసుకుందాం.

అభినందనలు,

ప్రభ పొనుగుపాటి.

Image Courtesy :