విస్మయం గొలిపే మానవ ప్రవర్తనలు అర్థం చేసుకోవడం ఎలా?

Dasu Kiran
April 3, 2023

జీవితంలో విజయం సాధించిన వారందిరిలో కనబడే తత్త్వం, రేపటి ఫలాల కోసం నేడు కష్టపడడం. అయితే ఇది అత్యంత కష్టమని మనకి తెలుసు. ఎందుకంటే ఇది స్వాభావికం. Behaviour Scientists ఈ విషయం మీద పరిశోధన లో భాగంగా The Marshmallow Test అనే ఎక్స్పరిమెంట్ చేశారు. అందులో పిల్లలకి ఒక marshmallow ఇచ్చి, "10 నిమిషాల్లో వస్తాను, ఇది నువ్వు తినకుండా ఉంటే, నీకు రెండు marshmallows ఇస్తాను" అని చెప్పారు. తర్వాత ఆ పిల్లల ప్రవర్తనను గమనించారు. చాలా మంది పిల్లలు ఆ రెండు ఆప్షన్స్ మధ్య నలిగిపోయారు. ఈ టెస్ట్ లో తేలింది ఏంటంటే...

జీవితంలో విజయం సాధించిన వారందిరిలో కనబడే తత్త్వం, రేపటి ఫలాల కోసం నేడు కష్టపడడం. 

The capability to defer gratification.

అయితే ఇది అత్యంత కష్టమని మనకి తెలుసు. ఎందుకంటే ఇది  స్వాభావికం. Behaviour Scientists ఈ విషయం మీద పరిశోధన లో భాగంగా The Marshmallow Test అనే ఎక్స్పరిమెంట్ చేశారు. అందులో పిల్లలకి 

ఒక marshmallow ఇచ్చి, "10 నిమిషాల్లో వస్తాను, ఇది నువ్వు తినకుండా ఉంటే, నీకు రెండు marshmallows ఇస్తాను" అని చెప్పారు. తర్వాత ఆ పిల్లల ప్రవర్తనను గమనించారు. చాలా మంది పిల్లలు ఆ రెండు ఆప్షన్స్ మధ్య నలిగిపోయారు. ఈ టెస్ట్ లో తేలింది ఏంటంటే, ఒక పని మంచిది, చేస్తే సత్ఫలితాలుంటాయి అని తెలిసి కూడా మనము ఆ పని చేయము. మరి మనిషి rational being ఎలా అవుతాడు?

ఇంకో ఉదాహరణ. మసక చీకట్లో తాడును చూసి పాము అని భ్రాంతి చెంది గబుక్కున తప్పుకుంటాము. గణాంక శాస్త్రం ప్రకారం, ఇంట్లోకి పాము రావడం అరుదు, అందులో అది విష సర్పం అవడం ఇంకా అరుదు. (సర్పాలన్నిటిలో విషసర్పాల నిష్పత్తి 20 శాతం). కానీ మనం ఈ గణాంకాలు లెక్కించం. వెంటనే పక్కకు తప్పుకుంటాము. ఈ ప్రవర్తన ఆది నుండి మన జాతిని సంరక్షించినా, ఇదే ప్రవర్తన ఆధునిక యుగంలో వెంటనే ఒకరి గురించి తప్పుగా అర్థం చేసుకోవడానికి కూడా కారణం. దీనికి డేనియల్ కన్మన్ అనే నోబెల్ గ్రహీత System 1 Thinking అని పేరు పెట్టాడు. అదే నిలకడగా ఏది మంచి ఏది చేడు అని అలోచించడమే System 2 Thinking అన్నాడు.    

ఇలా మన biases ను, System 1, System 2 ల మధ్య interplay ను గమనిస్తూ, ఎక్కువ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడేదే బిహేవియర్ సైన్స్.  

ఏప్రిల్ 1, దాసుభాషితం ప్రసంగంలో భాగంగా, బిహేవియర్ సైన్స్ పై శ్రీ పవన్ మామిడి ఇచ్చిన ప్రసంగంలో ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. 

ఆయన ఇంకా ఎన్నో విషయాలు స్పృశించారు. అందులో ఇంకొన్ని. 

Monkey Experiment ద్వారా సమానత లేకపోతే ఎదురు తిరిగే స్వభావం గురించి వివరించారు. 

Gorilla Experiment ద్వారా మనము ఎందుకు ఎక్కువ విషయాలపై ఒకేసారి దృష్టి నిలపలేమో చూపించారు. 

చివరకు జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నకు, 1990 సంవత్సరంలో, 6 బిలియన్ కిలోమీటర్లు దూరం నుంచి Voyager 1 తీసిన The Pale Blue Dot అనే మన భూమి ఛాయా చిత్రం చూపుతూ, ఖగోళ-భౌతిక శాస్త్రజ్ఞుడు Carl Sagan చెప్పిన మాటలను ఉటంకించారు.

ఇలా ఆద్యతం రసవత్తరంగా సాగిన శ్రీ పవన్ గారి ప్రసంగం పూర్తి వీడియో ఇది.  

https://youtu.be/C-oi-XTUkYI

 ఈ ప్రసంగం పై మీ అభిప్రాయాలను మాతో ఈ ఈమెయిల్ కి రిప్లై ఇవ్వడం ద్వారా పంచుకోండి. 

అభినందనలతో,

దాసు కిరణ్

Image Courtesy :