వృధ్దాప్యపు వేదన

Lakshmi Prabha
May 2, 2023

మానవుని జీవిత చక్రంలో అతిసుందరమైన దశ శైశవదశ (శిశివుదశ). ఎప్పటికప్పుడు ఆ దశవారికి వారి జీవితం కష్టమే అయినా వృద్దాప్యం మాత్రం చాలా మంది ఆనందిస్తూ గడపలేరు. జీవిత చక్రంలో ప్రతీదశలో ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొని, ప్రయాసపడి డబ్బు సంపాదించి...

మానవుని జీవిత చక్రంలో అతిసుందరమైన దశ శైశవదశ (శిశివుదశ). ఎప్పటికప్పుడు ఆ దశవారికి వారి జీవితం కష్టమే అయినా వృద్దాప్యం మాత్రం చాలా మంది ఆనందిస్తూ గడపలేరు. జీవిత చక్రంలో ప్రతీదశలో ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొని, ప్రయాసపడి డబ్బు సంపాదించి చివరగా తన వృద్దాప్యదశలో సేదతీరుదాం అనుకునేసరికి అప్పుడు కూడా బాధను అనుభవించవలసి వస్తుంది. ఎవరెవరికోసమో కష్టపడి, అందర్నీ తనవారనుకుని ఆఖరిదశలో తనకంటూ ఒక తోడు లేక, ఆదరించే మనసు, మనిషిలేని జీవితం ఎంత అయోమయంగా, అర్ధరహితంగా ఉంటుందో ఈ నవలలో వివరించారు.

Tap to Listen

80 ఏళ్ల ఫిన్గాల్ తన వృద్దాప్యదశలో తనను ఆదరిస్తుందేమోనని, తన దూరపు బంధువు వరసకి మేనకోడలు అయిన వెన్ క్యాంప్ దగ్గర ఉంటుంది. ఫిన్ గాల్ తన భర్త వల్ల వచ్చే penssion డబ్బులతో తనకు షేర్స్ పై వచ్చే ఆదాయంతో కాంప్  దగ్గర ఉంటుంది. డబ్బులిస్తున్నాను కదా అని ఫిన్గాల్, కాంప్ ని సతాయిస్తుంది. 

బ్రిటన్ లోని వారందరూ  శీతాకాలంలో విహారయాత్రలకు ఇటలీకి వెళతారు. అక్కడ జోస్, మైసీలు ఈ ఇద్దరినీ పరిశీలించి వారితో మాట కలుపుతారు. అందమైన ఆ ప్రదేశంలో వీరు ఫిన్గాల్ ను వారి మాటలతో ఆదరిస్తారు, ఆకర్షిస్తారు. ఫిన్గాల్ వారి మాటలకు ప్రలోభపడి వారితో వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కాంప్ కి కూడా వారు మంచి మాటలు చెప్పి తమతో ఫిన్గాల్ ను  తీసుకెళ్లాడానికి ఒప్పిస్తారు. ఇటలీలో వీరు ఉంటున్న హోటల్ లో పనిచేసే గ్రెసిల్లా వీరందరిని పరిశీలిస్తుంది. హోటల్ లో పని అయిపోయాక ఫిన్గాల్ ను చూసుకునేలా  గ్రెసిల్లా పనిలో కుదురుతుంది. అక్కడ ఎవరులేని అనాధ అయిన గ్రెసిల్లా కు, ఫిన్గాల్ కు మంచి అనుబంధం ఏర్పడుతుంది. గ్రెసిల్లా  కు  జీవితంలో స్థిరపడే అవకాశం రాగా అక్కడనుండి వెళ్ళిపోతుంది. బ్రిటన్ లో పరిస్థితులు తారుమారవుతాయి. గ్రెసిల్లా స్థిరపడి, పెళ్లి చేసుకుని తన బిడ్డను ఫిన్గాల్ కు చూపిద్దామని బ్రిటన్ కు  తీసుకురాగా అక్కడ జోస్ తనకు చెప్పిన కథ, జరిగిన జరగబోతున్న విషయాలకు నివ్వెరపోతుంది. 

జీవిత చివరి దశలో వయోవృద్దులు పడే ఆవేదన గురించి వచ్చిన ఈ నవలపై ప్రముఖ కాలమిస్ట్, రచయిత శ్రీమతి మాలతి చందూర్ గారి విశ్లేషణను వినండి.

మే మొదటి శనివారం ప్రముఖ కార్టూనిస్ట్ సరసి గారితో ప్రసంగం వినండి.

Image Courtesy :