అందరికీ తమ కెరీర్ పై అవగాహన ఉండదు అని కాదు కానీ, చాలా ఎక్కువ శాతం మందికి పూర్తి అవగాహన లేదు అన్నది నిజం. గాలి ఎటు తీసుకువెళ్తే అటు కొట్టుకుపోతూ, ఆ మార్గమధ్యంలో తమకు నచ్చిన చోట ఆగిపోయి, దానినే కెరీర్ అనుకునేవాళ్ళు కోకొల్లలు. తమకు ఉన్న skills గురించి, వాటిని కెరీర్ గా మార్చుకోగలిగిన ఆలోచనా ధోరణిని తరుణ వయస్కుల్లో పెంపొందించడం చాలా అవసరం. అందులోనూ ముఖ్యంగా ఆంత్రపెన్యూరల్ ఆలోచనా విధానాన్ని వాళ్ళల్లో పెంచడం ఇంకా అవసరం. తమ సామర్ధ్యాలపై ఆధారపడి, తమకే కాక మరో నలుగురికి ఉపాధిని కల్పించగలగడం, తద్వారా...
Read moreతరతరాల నుండి దాంపత్యం సమాజాన్ని ఎంతగా నిలబెడుతోందో, ఎప్పటికీ మారని ఒక నిత్య నూతన సత్యంగా ఎలా ఉందో, అంతే స్థాయిలో సమస్యాత్మకంగా కూడా ఉంది. ఎందరు స్త్రీ, పురుషులు ఈ సమాజం నిర్మించిన ఉక్కు పిడికళ్ళ లాంటి కట్టుబాట్ల కింద నలిగిపోయారో మనందరికీ తెలుసు. పెళ్ళి అనేది ఎప్పుడూ ప్రధానంగా ఇద్దరు మనుష్యుల మధ్యన విషయం. వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటే, అది తమ చుట్టూ వారిని అంతగా కలిపి ఉంచగలుగుతుంది. అదే లోపించినప్పుడు...
Read moreతోటి మనిషిని చంపాలంటే మనసులో ఎంత కర్కశం ఉండాలి? అది కూడా అకారణంగా, వాళ్ళు మనకి ఏ హానీ చేయనివారైతే? అందులోనూ పసిపాపలైతే? అలాంటిది ఒక జాతి జాతి మొత్తాన్నీ ఈ భూప్రపంచంపై నుంచి తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఒకడు. తనదే గొప్ప జాతి అని. తన శరీరంలో ప్రవహించేదే శుద్ధమైన రక్తం అని, కొందరు జాతుల వాళ్ళు కనీసం బతకడానికి కూడా అర్హులు కారు అని. అసలు ఆ జాతిలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపం అని. అలా పుట్టినప్పుడే, వాళ్ళు తన చేతిలో చనిపోవడం రాసి పెట్టి ఉందని అనుకునే ఒక దురహంకారుడు చేసిన హత్యాకాండలో....
Read more