CP-Brown-Potee
Register Now

Registration closes on October 31, 2019.

See you again in 2020.
Before registering please watch the video completely.
Registration closes on November 08, 2019.
Contest will be conducted Online on Sunday, November 10, 2019.

తెలుగు రాష్ట్రాల పదవ తరగతి విద్యార్థులు, వారి తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాల కూడా ₹ 1,00,000 వరకూ నగదు బహుమతులు, సత్కారాలు,  ప్రశంసా పత్రాలు, ఇంకా తెలుగు ప్రజలు ₹ 100,000 విలువైన బహుమతులు
గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.

వివరాలకు ఈ వీడియోను పూర్తిగా చూడండి.

శ్రీ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు వారికి నిత్య స్మరణీయుడు.
గాన గంధర్వుడు కీ. శే. శ్రీ SP బాలసుబ్రమణ్యం తెలుగు తల్లి ముద్దు బిడ్డ.

ఆ మహనీయుల సంస్మరణార్ధం 'దాసుభాషితం' తెలుగు రాష్ట్రాలలోని పదవ తరగతి బాలబాలికలకు,
అశేష తెలుగు జనవాళికీ, వార్షిక తెలుగు పోటీని నిర్వహిస్తున్నది.

ఈ పోటీ ముఖ్యోద్దేశం, తెలుగు భాష పట్ల బాలబాలికలలో ప్రేమను, పెద్దల్లో ఆత్మగౌరవాన్ని పెంచడం. 

1. పోటీ ఎందుకు?

తెలుగు భాషకు ఆలంబన తెలుగు సాహిత్యం. ఈ ఆధునిక యుగంలో ఆ సాహిత్యాన్ని సులువుగా ఆస్వాదించడానికి, దాసుభాషితం శ్రవణ మాధ్యమంలో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు సాహిత్యం పరిఢవిల్లడానికి భాషాభిమానం అవసరం. అది పాఠశాల దశలోనే ఏర్పడితే జీవితాంతం ఉంటుంది. 

ఒక విషయం మీద విద్యార్థులలో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా ఉపకరిస్తాయి. మాథ్స్ / సైన్స్ ఒలంపియాడ్ తరహాలో తెలుగుకీ ఒక పోటీ ఉండాలని భావించి, ఈ పోటీ రూపకల్పన చేయడం జరిగింది.

2. పోటీకి సీ పీ బ్రౌన్ – SPB పేర్లెందుకు?

విదేశీయుడై ఉండి, ఉద్యోగరీత్యా భారత దేశానికి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడమే కాకుండా, అందులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేసిన ఆంగ్లేయుడు, సి.పి.బ్రౌన్. ఆయన తెలుగు భాషా సాహితీ లోకానికే ఆదర్శప్రాయుడు.

తెలుగంతా ఆంగ్లమయం అయిపోతున్న ఈ రోజుల్లో, తెలుగు భాష పట్ల విద్యార్థులలో అభిమానం పెంచడానికి ఈ ఆంగ్లేయుడినే స్ఫూర్తిగా తీసుకోవడం ఉచితమనిపించింది. 

అందుకే ఆయన పేరున ₹ 1 లక్ష నగదు బహుమతిని 'దాసుభాషితం CPB బహుమతి' గా విజేతలైన విద్యార్థులకు వారి తెలుగు అధ్యాపకులకు అందజేస్తున్నాము. ఈ బహుమతి "కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి"తో సమానం.

ఇక, తెలుగు భాషపై శ్రీ S P బాలసుబ్రమణ్యం గారికి ఎంత ప్రేమ ఉండేదో మనందరికీ తెలుసు. గతంలో అడగ్గానే పోటీ కి ముందు మాటను చెప్పి పోటీను, విద్యార్థులను ఆశీర్వదించారు. ఆయన ఇపుడు మన మధ్య లేరు.

గత రెండు ఏళ్ళల్లో పిల్లలతో పాటు పెద్దలూ ఈ తెలుగు పోటీపై ఆసక్తి చూపారు. శ్రీ SPB పేరు మీద పోటీను తెలుగు వారందరికీ విస్తరించి, తెలుగు భాష పై మనకున్న ప్రేమను చాటి చెప్పే అవకాశంగా పోటీని మలచటం ఆయనకు సరియైన నివాళి అనిపించింది.

అందుకే ఆయన పేరున ₹ 1 లక్ష విలువైన దాసుభాషితం యాప్ సబ్‌స్క్రిప్‌షన్ ప్లాన్ లను 'దాసుభాషితం SPB బహుమతి' గా విజేతలకు అందజేస్తున్నాము.

3. పోటీ ఎవరికి ?

'దాసుభాషితం SPB బహుమతి' కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎవరైనా పోటీ పడవచ్చు.

ప్రవేశ రుసుమేమీ లేదు. అయితే పోటీలో పాల్గొనటానికి స్మార్ట్‌ఫోన్ అవసరం ఉంటుంది.
దాసుభాషితం CPB బహుమతి కి పోటీ ప్రధానంగా పాఠశాలల మధ్య. కేవలం ప్రజ్ఞ ఉన్న కొద్ది మంది విద్యార్థులకే ఈ పోటీ పరిమితం కాదు. తమతమ పాఠశాలల తరఫున ఎక్కువ మంది పదవ తరగతి విద్యార్థులు పాల్గొని, సంచితంగా (అంటే cumulative గా) అత్యధిక మార్కులతో, ఇతర పాఠశాలలపై గెలిచి పాఠశాలకు, గురువులకు, తమకు గుర్తింపు సాధించుకునే అవకాశం ఈ పోటీ కల్పిస్తుంది. 

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క పాఠశాల మాత్రమే విజేతగా నిలుస్తాయి. రెండవ మూడవ స్థానాలు ఉండవు. 

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.

4. విద్యార్థుల్లో పదవ తరగతి విద్యార్థులకే ఎందుకు?

ఇందుకు నాలుగు కారణాలు.
  1. మొదటిది, పోటీ రసవత్తరంగా ఉండాలంటే అందులోని ప్రశ్నలు, కొన్ని సులువుగా, కొన్ని కఠినంగా సరైన మిశ్రమంలో విభిన్నంగా ఉండాలి.
    పదవ తరగతి విద్యార్థులైతే ఎక్కువ పాఠ్యాంశాలని చదివి ఉంటారు కనుక, వేర్వేరు అంశాలలో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ప్రశ్నావళిని ఆసక్తికరంగా కూర్చవచ్చు.
  2. రెండవది, గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతి గణనీయమైన మొత్తంలో ఉంది కనక పెద్ద తరగతి విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.
  3. మూడవది, ఈ పోటీ పూర్తిగా Online మాధ్యమం ద్వారా నిర్వహించబడుతుంది. అంటే విద్యార్థికి కొంచెమైనా సాంకేతిక అవగాహన తప్పనిసరి. పరిణితి రీత్యా పదవ తరగతి విద్యార్థులకు ఈ  అవగాహన ఉంటుంది.
  4. నాల్గవది, పాఠశాలలో ఇదే తమ ఆఖరి విద్యా సంవత్సరం కాబట్టి, ఈ పోటీలో గెలిస్తే తమ తెలుగు ఉపాధ్యాయులకు, పాఠశాలకు అది తగిన గురుదక్షిణగా భావించి, విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు.

5. 2018, 2019 లో విజేతలు

2018 సంవత్సరంలో జరిగిన పోటీలో ₹ 32 వేలు గెలుపొందిన పాఠశాలలు ఇవి.
  1. ప్రగతి విద్యా నికేతన్ హై స్కూల్, గద్వాల్, తెలంగాణ
  2. శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ ఎయిడెడ్ హైస్కూల్, భీమవరం, ఆంధ్రప్రదేశ్
గెలిచిన పాఠశాల యాజమాన్యానికి జ్ఞాపిక, తెలుగు ఉపాధ్యాయులకు ₹ 5116, జ్ఞాపిక, పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఉమ్మడిగా ₹ 10116, ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది.
2019 సంవత్సరంలో జరిగిన పోటీలో ₹ 1 లక్ష గెలుపొందిన పాఠశాలలు ఇవి.
  1. న్యూ ఎరా హై స్కూల్, ఖమ్మం, తెలంగాణ
  2. శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ ఎయిడెడ్ హైస్కూల్, భీమవరం, ఆంధ్రప్రదేశ్
గెలిచిన పాఠశాల యాజమాన్యానికి జ్ఞాపిక, తెలుగు ఉపాధ్యాయులకు ₹ 10116, జ్ఞాపిక, పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఉమ్మడిగా ₹ 40,000, ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది.

6. 2020 బహుమతులు

దాసుభాషితం CPB బహుమతి భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో విజేతగా ప్రకటింపబడిన పాఠశాలకు సమకూరేవి:
  • పోటీలో పాల్గొన్న విద్యార్థులకు – రూ. 40000 (ఉమ్మడిగా), ప్రశంసా పత్రాలు.
  • తెలుగు ఉపాధ్యాయులకు (ఉమ్మడిగా) – రూ 10,116, సత్కారం, ప్రశంసా పత్రం. 
  • పాఠశాల యాజమాన్యానికి – జ్ఞాపిక 
దాసుభాషితం SPB బహుమతి లో భాగంగా
  • 5 గురికి - ₹ 12000 విలువ ఉన్న దాసుభాషితం మహారాజ పోషక వార్షిక ప్లాన్.*
  • 40 మందికి – ₹ 1000 విలువ ఉన్న దాసుభాషితం పరిపోషక వార్షిక ప్లాన్.**
* మహారాజ పోషక ప్లాన్ ద్వారా దాసుభాషితం యాప్ లో ఉన్న ప్రీమియం కాంటెంట్ అంతా వినవచ్చు.
** పరిపోషక ప్లాన్ ద్వారా దాసుభాషితం యాప్ లో ఉన్న ఉచిత కాంటెంట్ ను ప్రకటనల అంతరాయం లేకుండా, ఆఫ్‌లైన్ లో వినవచ్చు.

7. పోటీ – ముఖ్యమైన తేదీలు

నమోదు ఆఖరు తేదీ
  • Dec 10, 2020 (గురువారం)
పోటీ తేదీ
  • Dec 13, 2020 ఆదివారం (పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహింపబడుతుంది).
విజేతల ప్రకటన
  • Dec 20, 2020 ఆదివారంYouTube LIVE.

8. పోటీలో ఎలా పాల్గొనాలి?

  • పోటీలో పాల్గొనటానికి స్మార్ట్‌ఫోన్ లో దాసుభాషితం యాప్ ఉండడం తప్పనిసరి.
  • దాసుభాషితం యాప్ ను Play Store నుంచి App Store నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • పోటీ సంబంధిత సమాచారమంతా యాప్ నోటిఫికేషన్ ద్వారానే ఇవ్వబడుతుంది. కాబట్టి యాప్ నోటిఫికెషన్స్ కు అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.

9. 2020 పోటీ ఎలా ఉంటుంది ?

  • తెలుగు సాహిత్యం మీద సమగ్ర అవగాహనను పెంపొందించేందుకు, ప్రశ్నావళి రెండు రాష్ట్రాలకూ ఒకే విధంగా ఉంటుంది.
  • ప్రశ్నావళిలో తెలుగు భాష, సాహిత్యం, సమాజం కు సంబంధించిన మొత్తం 30 ప్రశ్నలుంటాయి.
  • ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు సమాధానాలుంటాయి. ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గడువులోగా గుర్తించాల్సి ఉంటుంది. పోటీ కి రిజిస్టర్ చేసుకున్న తరువాత, గత సంవత్సరం ప్రశ్నవళిని మీరు చూడవచ్చు.
  • ప్రశ్నలు జంబుల్ చేయబడతాయి. అంటే అందరికీ అవే ప్రశ్నలు రాకపోవచ్చు.
  • ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి పోటీలో ఒక్కసారి మాత్రమే పాల్గొనవచ్చు.
  • పోటీ నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది.
  • పోటీ నిబంధలు ఈపేజీ చివర్లో ఉన్నాయి. తప్పక చదవండి.

10. పోటీ కి ఎలా సన్నద్ధం కావాలి ?

పోటీలో పాల్గొనేవారందరూ స్వయంకృషితోనే రాణించాలని దాసుభాషితం అభిమతం.
పోటీలో మంచి ప్రదర్శన ఇవ్వటానికి దాసుభాషితం యాపె మంచి ఉపకరణం.
తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలకు ఇలా సన్నద్ధం కావచ్చు. 
యాప్ లో కవిత్వం, కావ్యం, కథలు, నవలల విభాగాల్లో ఉన్న శ్రవణ పుస్తకాలను పరిశీలించండి. ఈ పుస్తకాలు చాలా వరకు ఉచితంగా ఉన్నాయి. రుసుము ఉన్న పుస్తకాలలో మొదటి అధ్యాయం ఉచితంగా ఉంటుంది.  
తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్నలకు ఇలా సన్నద్ధం కావచ్చు.
యాప్ లో పదవ తరగతి 'తెలుగు పేపర్ 1 & 2' ఆడియో మెటీరియల్ ఉచితంగా ఉంది. వీటిని పరిశీలించండి.
Notifications ను అనుమతించండి.
మేము పోటీలో అడగబోయే ప్రశ్నలకు, యాప్ లో యే కాంటెంట్ వినడం ద్వారా సమాధానం ఇవ్వవచ్చో, యాప్ నోటిఫికెషన్స్ ద్వారా రోజూ తెలియజేస్తాము.

ఈ సూచనలను (clues) పొందటానికి App Notifications ను మీరు అనుమతిచాల్సి ఉంటుంది.అందుకనే యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత Notifications ను Allow చేయండి.

బ్లాక్ చేయబడిన Notifications ను తిరిగి అనుమతిచ్చేందుకు ఈ సూచనలు పాటించండి. 

iPhone
Android

ఎలా పాల్గొనాలి?

అర్హులైన పదవ తరగతి విద్యార్థులు December 12, 2018 తేదీ లోగా తమ దరఖాస్తును ఈ లింక్ ద్వారా సమర్పించాలి.

11. విజేతల నిర్ణయ విధానం

దాసుభాషితం CPB బహుమతి కి

ఒకో తెలుగు రాష్ట్రం నుంచి ఏ పాఠశాల విద్యార్ధులు సాధించిన మార్కుల స్థూల మొత్తం గరిష్టంగా ఉంటుందో, ఆ పాఠశాల విజేతగా నిలుస్తుంది.

పాఠశాల మధ్య మార్కులు టై అయితే, పోటీలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా విజేత  పాఠశాల నిర్ణయింపబడుతుంది. అందుకనే తెలుగు ఉపధ్యాయులు, విద్యార్థులు తమ తరగతిలో విద్యార్థులందరూ పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

ఒకవేళ మరో పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్ధుల సంఖ్య, వారు సాధించిన మార్కుల సంఖ్య కూడా సమంగా ఉన్నట్లయితే, ఇచ్చిన ప్రశ్నలలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసే ప్రశ్నలకు ఏ పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు సరియైన జవాబిస్తారో, ఆ పాఠశాలను విజేతగా ప్రకటించడం జరుగుతుంది.
దాసుభాషితం SPB బహుమతి కి

పోటీలో అత్యధిక మార్కులు సాధించిన వారిలో, 45 మంది విజేతలు చీట్లపద్ధతిలో (లాటరీ) ద్వారా నిర్ణయించబడతారు.

12. పోటీ నిబంధనలు

పోటీకి నమోదు చేసుకునేటప్పుడు మీ ఇమెయిల్, ఫోన్ నెంబర్ ను విధిగా ఇవ్వవలసి ఉంటుంది. పోటీ సంబంధిత సమాచారం మీకు మరో విధంగా చేరవేసేందుకు మాకు సులువవుతుంది. అయితే, మీ వివరాలు ఎవ్వరికి ఇవ్వబడవు.

పోటీ దరఖాస్తు ఫారంలో సరియైన వివరాలు ఇచ్చే బాధ్యత విధ్యార్థులదే.

బహుమతుల వితరణ సమయంలో విద్యార్థులు గెలిచిన పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నవారని ధృవీకరించవలసి ఉంటుంది.

ఫలితాల నిర్ణయంలో దాసుభాషితం న్యాయ నిర్ణేతల నిర్ణయమే అంతిమం. దీనిలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు ఉండదు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 31, 2019.

Register Now

దరఖాస్తు ఆఖరు తేదీ November 30, 2020