#26 ప్రతీ రాత్రి వసంత రాత్రి

Dasu Kiran
September 4, 2020

“ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి…” ఈ పదాలు నేను అంటుంటే, background లో పాట బాణీ ఈపాటికి లీలగా మీకు వినిపిస్తూ ఉండుంటుంది. ఆ వెంటనే స్ఫురించే మరో విషయం, ఆ సినిమా పేరు, ఏకవీర. నా చిన్నప్పుడు టీవిలో ఈ చిత్రం చూసినప్పుడు ఏవి అర్థం కాలేదు. కారణం, జానపద చిత్రాల హీరో కాంతా రావు, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం, చిత్రం పేరే ఏకవీర అవడంతో ఏ అగ్గిపిడుగు, కంచుకోట లా ఉండి, బోలెడన్ని కత్తి యుద్దాలు ఉంటాయనుకుంటే, అంతా ఏడుపే.

“ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి…”

ఈ పదాలు నేను అంటుంటే, background లో పాట బాణీ ఈపాటికి లీలగా మీకు వినిపిస్తూ ఉండుంటుంది.
ఆ వెంటనే స్ఫురించే మరో విషయం, ఆ సినిమా పేరు, ఏకవీర.

నా చిన్నప్పుడు టీవిలో ఈ చిత్రం చూసినప్పుడు ఏవి అర్థం కాలేదు. కారణం, జానపద చిత్రాల హీరో కాంతా రావు, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం, చిత్రం పేరే ఏకవీర అవడంతో ఏ అగ్గిపిడుగు, కంచుకోట లా ఉండి, బోలెడన్ని కత్తి యుద్దాలు ఉంటాయనుకుంటే, అంతా ఏడుపే.  

ఏకవీర అంటే ఎన్టీఆరో, కాంతారావో కాదని, అది నాయిక పాత్ర వేసిన కే ఆర్ విజయ అని తెలిసే సరికి ఆసక్తి చచ్చిపోయింది. వీరత్వం లేదు పోనీ, హాస్యమైన ఉన్నదా అంటే అదీ లేదు. అయినా చిత్రమంతా చూశాను, ఎందుకంటే వేరే ప్రత్యామ్నాయం ఆ రోజుల్లో లేదు. చిత్రం ఏడిపించినా, ఈ పాట మాత్రం తెగ నచ్చేసి గుర్తుండి పోయింది.

వయసొచ్చిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే, ఏకవీర చిత్రాన్ని అదే పేరున్న నవల ఆధారంగా తీసారని. అది ఒక ట్రాజెడీ నవలని. ట్రాజెడీ అనే సాహిత్య ప్రక్రియ కూడా ఒకటి ఉంటుందని, Shakespeare అనే వాడు ఇవి రాసే బోలెడంత కీర్తి సంపాదించుకున్నాడని.

ఈ నవల రాసింది తెలుగు సాహిత్యంలో విరాట్స్వరూపుడు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని.
ఏకవీర నవల ఇంకో విశేషం ఏమిటంటే, అది విశ్వనాథ తన స్వదస్తూరీలో రాసిన ఏకైక గ్రంధం. మిగిలివన్నీ ఆయన అలా అలవోకగా చెబుతూవుండగా ఇంకొకరు వ్రాసినవే. ఈ విషయం వారి మనుమడే ధ్రువపరిచారు.  

సెప్టెంబర్ 10న విశ్వనాథ వారి 125 జయంతి సందర్భంగా, ఏకవీర నవల మీద డాక్టర్ మృణాళిని గారి విశ్లేషణను మీకందిస్తోంది దాసుభాషితం. ఈ నవల పూర్తి శ్రవణ రూపం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. త్వరలో దాసుభాషితం యాప్ లో అది కూడా విడుదలవుతుంది.

Ekaveera Visleshana
Tap to listen


మళ్ళీ ఏకవీర చిత్రంలో పాటల విషయానికి వస్తే, కాల గమనంలో ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేమిటంటే, ఈ చిత్ర నిర్మాణం సమయానికి ఘంటసాల   తన కరీర్ సంధ్యాసమయం లోకి జారుకుంటున్నదని, అందుకనే ‘ప్రతీ రాత్రి వసంత రాత్రి’ పాటకు బాలు గారిని ప్రోత్సహించి ఆయనే చేతనే మొదలుపెట్టించారని.

ఈ చిత్రంలో ఇంకొక అద్భుతమైన పాట, “తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వేను  నేడు.…”. ఈ పాటకు బాణీ చేసే సమయం లో కేవి మహదేవన్ తో జరిగిన చర్చ గురించి కీ. శే. నారాయణ రెడ్డి గారు చెప్పిన హాస్య భరిత సన్నివేశం తాలూకు వీడియోను చూడండి. ఆనందిస్తారు.

App Updates


ఈ పోడ్ కాస్ట్ లో ముఖ్యంగా చెప్పవలసింది గత రిలీజ్ లో యాప్ కు మేము చేసిన updates గురించి.
మీరు గత వారం లో యాప్ వాడి ఉంటె, మీరు ఇప్పటికే యాప్ చాలా వేగవంతంగా లోడ్ అవుతుండడం గమనించి ఉంటారు.

యాప్ వేగవంతంగా పని చేయడం, యాప్ ను అభిమానంగా డౌన్లోడ్ చేసుకుని వాడుతున్న వారి పట్ల మాకున్న బాధ్యత. పరిపోషకులు గానో, మహారాజ పోషకులు గానో చందా కడుతున్న వారి పట్ల మా బాధ్యత మరింత పెద్దది. అందుకనే వారికి అదనంగా రెండు సౌకర్యాలను ఇపుడు అందిస్తున్నాము. అవి,

ఒకటి, యాప్ ఎక్కువగా వాడబడుతున్న సమయం రాత్రి 10-12 గం మధ్య అని App Analytics చెబుతున్నాయి. అంటే పడుకునే ముందర అన్నమాట. నిద్రలోకి జారుకున్న తర్వాత కూడా అప్ ప్లే అవుతుండడం తో అసౌకర్యం కలుగుతున్నదని, స్లీప్ టైమర్ ను అందించమని చాల మంది అడిగారు.

రెండు, కొందరు ఆడియో వేగవంతంగా ప్లే చేసుకొనే వీలును,అంటే playback speed control ను  అందించమని కోరారు.

ఈ రెండు కోర్కెలను ఈ తాజా రిలీజ్ లో చందాదారులకు తీరుస్తున్నందుకు మాకు ఆనందంగా ఉన్నది. మీరు చందాదారులై ఇప్పటికీ యాప్ ను update చేసుకొని ఉండక పొతే, చేసుకొని ఈ కొత్త మెరుగులు ఆనందించమని కోరుతున్నాము. మీరు చందాదారులు కాకపోయినట్టైతే, చందాదారులు అవడానికి ఇంకో రెండు కారణాలు మీకు ఉన్నాయి.

చందాదారులవ్వండి మాకు తోడ్పడండి. చందాదారులు ఇలా అవ్వచ్చు.

బాంధవ్యాలు 2

Bandhavyalu 2
Tap to listen

భారతీయ సమాజం ఒక mosaic లాంటిది. దీంట్లో ఎన్నో వర్గాలు, సమూహాలు.

వివిధ వయోబేధాలున్న  యువతీ యువకుల నుంచి వయోవృద్ధుల వరకూ; స్త్రీ పురుషులు; వారిలో మళ్ళీ చదువుకున్న వారు, చదువులేని వారు; గ్రామీణ జీవితం, నగర జీవితమూ; ఉద్యోగాలలో తారతమ్యాలూ; గ్రామ, ప్రాంత, రాష్ట్ర, దేశ రాజకీయాలు;

ఇన్ని భిన్నమైన అంశాలను కుటుంబ బాంధవ్యాలతో ముడేసిన విధం నిజంగా ఒక అద్భుతం. ఎక్కడా కల్పితమనిపించకుండా ఎక్కడా విసుగు జనించకుండా, సమన్వయము చేస్తూ రచన చేయటం కత్తిమీద సామే. ఈ రచనా విన్యాసాన్ని బాంధవ్యాలు రెండవ భాగంలో మనం చూస్తాం.

తిరుమల చరితామృతం 6వ భాగం

Tirumala Charitamrutam 6
Tap to listen

తిరుమల శ్రీనివాసుడి మీద ఉన్న అచంచల విశ్వాసంతో అసంఖ్యాక భక్తులలో హుండీలో కానుకలు వేసే వారు ఎందఱో.

అలాగే రికార్డు పూర్వకంగా నగలూ, నగదూ, స్వామివారికి ఆభరణాలు తయారు చేయించి ఇచ్చే వారూ ఉన్నారు. కానీ ఆ విశ్వాసంకు భంగం కలిగే విధంగా తరచూ ప్రచారం ఎందుకు జరుగుతోంది. దీనిలో నిజానిజాలేమిటి? భక్తులకు భరోసా కల్పించే ఇటువంటి విషయాలతో పాటు, శ్రీనివాసుడు ధనికుల దేవుడా?

వేదాలు బ్రాహ్మణులకా సమాజానికా, తిరుమల హనీమూనుగా మారిపోయిందా వంటి అంశాలను సున్నితంగా స్పృశిస్తూ శరణాగతితో ఈ శ్రవణ పుస్తకం ముగుస్తుంది.

Image Courtesy :
Alexis Antonio