అలసత్వంతో అప్రమత్తం

Lakshmi Prabha
June 18, 2025

చదువుకునే చదువు ఒకటైతే, చేసేపని ఇంకోటి. వీధికొకటి పుట్టుకొస్తున్న కళాశాలల్లో విద్య నేర్పే ఉపాధ్యాయులు కరువై కొంత, చిన్నప్పటి నుండే ఏది నేర్చుకోవాలి, ఎందులో స్థిరపడాలి అనే అవగాహన లేక కొంత ఈనాటి యువత చాలా తికమకలో ఉన్నారు. చదువుకున్న చదువులో నిష్ణాతులవ్వడానికి చదివేసిన పుస్తకాలను మళ్ళీ చదువుకోకుండా, బోర్ కొడుతోందని ఫోన్లలో ఇంస్టాగ్రామ్లు, యూట్యూబ్ షాట్స్ చూస్తూ కాలం గడుపుతున్నాం. మన లక్ష్యాలని సాధించడానికి ఒక క్రమ పద్దతిలో నడవకుండా, మనకున్న మాధ్యమాలకి ఆకర్షితులవ్వకుండా అనుసరించాల్సిన పద్దతులు, పాటించవలసిన నియమాలు ఏమిటో ...

మన పూర్వికుల మనుగడకి మనకి ఎంత తేడా? వారు చదువుకునేటప్పుడే ఒక దృక్పథంతో ఉండేవారు. శాస్త్ర విద్య కాక, ఏదైనా ఒక వృత్తిలో నిష్ణాతులవ్వడానికి సరిపడా కృషి చేసేవారు. కుటుంబ బాధ్యత ఇంటి పెద్ద తీసుకుంటే, ఆ ఇల్లాలు(గృహిణి) గృహ బాధ్యత మొత్తం నిర్వహించేది. మారుతున్న కాలాన్ని బట్టి అన్నీ మారుతున్నాయి. ఇప్పుడు వచ్చే వృత్తి విద్యా కోర్సులు, అవకాశాలు ఎన్నో ఎన్నెన్నో. 

పూర్వకాలంలో కూడా వేదాధ్యయనంతో బాటూ అనేక శాస్త్రాలు చదివినా ప్రతీ ఒక్కదానికి ఒక నిర్దిష్ట మార్గం ఉండేది. ఇప్పటి రోజుల్లో అనేక దారులు. ఏ దారి ఎటు పోతుందో తెలుసుకోవడం కష్టంగా ఉన్నది. 

చదువుకునే చదువు ఒకటైతే, చేసేపని ఇంకోటి. వీధికొకటి పుట్టుకొస్తున్న కళాశాలల్లో విద్య నేర్పే ఉపాధ్యాయులు కరువై కొంత, చిన్నప్పటి నుండే ఏది నేర్చుకోవాలి, ఎందులో స్థిరపడాలి అనే అవగాహన లేక కొంత ఈనాటి యువత చాలా తికమకలో ఉన్నారు. 

మా తాతగారు టీచర్ గా పనిచేశారు. ఆయన ఖాళీ సమయాల్లో హోమియోపతి పుస్తకాలు చదివేవారు. ఆయుర్వేదం చిట్కాలు తెలుసుకునే వారు. తరువాత తరాలకి ఉపయోగపడుతుందని ఇంగ్లీషు, తెలుగు ఫోనెటిక్స్ పుస్తకాలుగా రాసేవారు.  అవి చాలా మందికి ఉపయోగపడ్డాయి. 

ఖాళీగా ఉన్న బుర్ర దయ్యాల పాలవుతుందని ఒక నానుడి ఉంది. చదువుకున్న చదువులో నిష్ణాతులవ్వడానికి చదివేసిన పుస్తకాలను మళ్ళీ చదువుకోకుండా, బోర్ కొడుతోందని ఫోన్లలో ఇంస్టాగ్రామ్లు, యూట్యూబ్ షాట్స్ చూస్తూ కాలం గడుపుతున్నాం. ఒకరికి మనం మార్గదర్శకులు(ideal person) కాలేక పోయినా కనీసం మనం సరైన మార్గం లో నడవలేకపోతున్నాం. 

అందుకే ఈ కాలం పిల్లల్ని నిముషం ఖాళీగా ఉంచనివ్వకుండా చాలా రకాల వ్యాపకాలలో ఉంచుతున్నారు. ఏదో ఒక దాంట్లో వారికి ఇష్టం వస్తుందని, అందులో వాళ్ళు నిష్ణాతులవ్వాలని పెద్దల కోరిక. మన చిన్నప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు ఉన్న అవకాశాలను సరిగా వినియోగించుకుంటే ఎంతో అభివృద్దిని సాధించగలం. 

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనలో చాలా మంది చాలా తక్కువ సమయంలో అయ్యే పని అయినా సరే ఒక పని చేయాలంటే నెలలు వాయిదా వేస్తారు. మన ఆహార విహారాలలో తేడా, సమయపాలన పట్ల నిర్లక్ష్యం వీటికి కారణాలు. 

అలవాటు అనేది చిన్నప్పటి నుంచి ఉన్నా, ఒక్కసారి దాని నడక, పద్దతి మారిస్తే మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. మా ఇళ్ళల్లో చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాను చిన్నప్పుడు మొదలు పెట్టిన సంగీతం కానీ, సంధ్యావందనం కానీ, ఒక్కసారి సమయం సరిపోవడం లేదు మరలా చేద్దాం అని అనుకున్నవారు వాటిని పూర్తిగా వదిలేశారు. 

పట్టరాదు, పట్టి విడవరాదు అంటారు పెద్దలు. ఇలాంటి నానుడి లను, మంచిమాటలని దృష్టిలో పెట్టుకుని ఒక క్రమ పద్దతిలో నడవకుండా, మనకున్న మాధ్యమాలకి (TV, Phone) ఆకర్షితులవ్వకుండా మన లక్ష్యాలని సాధించడానికి అనుసరించాల్సిన పద్దతులు, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈవారం విడుదల అవుతున్న, మన మీనమ్మ రాసిన, స్వయంగా చదివి మనకి వినిపించిన లెసన్స్ లో వినండి. 

Tap to Listen
Tap to Listen

అభినందనలు,

లక్ష్మీ ప్రభ.

Image Courtesy :