గత కొన్ని వారాలుగా దాసుభాషితం బృందం Content లో కొన్ని మార్పులు తేవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దాసుకిరణ్ గారు. మన దాసుభాషితంలో self help, professional content తీసుకురావాలని కిరణ్ గారి అభిలాష. ఏప్రిల్ లో మా బృందం అంతా హైదరాబాద్ లో కలిసినప్పుడు ఈ నిర్ణయాన్ని మా అందరికీ చెప్పి, content ఎలా ఉండాలో కూడా వివరించారు. అంతా విన్నాను నేను. తల కూడా ఊపాను. కానీ, ఇక్కడొక ఇబ్బంది ఉంది. నాకు ఆ తరహా సాహిత్యం గురించి ఇసుమంత కూడా తెలీదు. నిజానికి ఆసక్తి కూడా లేదు.
గట్టిగా మాట్లాడాలంటే, దాని అవసరమే నాకు అర్ధం కాలేదు. మొదట్నుంచీ మనం సమగ్ర శ్రేయస్సు మార్గంలో ఉన్నాం కాబట్టీ, professional గా ఎదగడానికి content తీసుకురావాలి అనే ఉద్దేశ్యం ఉన్నమాట నిజమే అయినా, ఎప్పుడు దాని అవసరం నాకు తెలీలేదు. నిజంగా, ఇలాంటి సాహిత్యం ద్వారా మనల్ని మనం improve చేసుకోవచ్చు అంటే, నేను నమ్మలేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి, ఇదుగో ఇలా చేయండి మీ ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గుతాయి, లేదంటే ఫలానా విధంగా మీరు ఉద్యోగంలో ఎదుగుతారు అని చెబితే మనం వినేస్తామా? విని, పాటిస్తామా? పాటించినా అవి ఫలిస్తాయా? నాకైతే నమ్మబుద్ధి కాలేదు.
అందుకే కిరణ్ గారు వచ్చే 2 quarters లో మన లక్ష్యం ప్రధానంగా professional content విడుదల చేయడం అని చెప్పగానే యాంత్రికంగా తల ఊపానే కానీ, మనస్పూర్తిగా కాదు. అలాగని ఇష్టం లేకుండా ఈ పని చేయాలని గానీ, కిరణ్ గారు నాకు అర్ధం అయ్యేలా చెప్పలేకపోయారని గానీ కాదు. ఇలాంటి సాహిత్యం ఒక సామాన్య ఉద్యోగి/వ్యాపారికి తమ వృత్తి జీవితంలో ఉపయోగపడుతుంది అని నాకు తట్టలేదు. సరే, సర్ కి చాలా experience ఉంది. ఎన్నో ఏళ్ళు corporate లో పని చేసిన ఆయనకన్నా ఈ విషయం నాకు ఎక్కువ ఎలా తెలుస్తుంది అని నన్ను నేను సమాధాన పరచుకున్నాను.
గతవారం దీనిపై research చేయాలని పూనుకున్నప్పుడు కూడా నేను fail అయ్యాను. నాకు ఏ విషయమైనా మా అన్నయ్యతో పంచుకోవడం అలవాటు. 100లో 90సార్లు తన దగ్గర సరైన సమాధానం కూడా దొరుకుతుంది. అదే ఆశతో నా ఈ సమస్యని తనకి చెప్పుకున్నాను. అలా చెప్పి నేను మంచి పని చేశాను అని మరొక సారి రుజువు అయింది. తను తన గురించే ఉదాహరణ చెప్పాడు. కొన్ని నెలల క్రితం వరకూ తన work life balance దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. తినే సమయం కూడా తనకి ఉండేది కాదు. ఓ పక్కన పని చేసుకుంటూనే ఒక ముద్ద తిని, చేతులు కడుక్కుని, ఏదో టైప్ చేసి, మళ్ళీ ఇంకో ముద్ద తిని ఇలా ఉండేది తన పరిస్థితి.
ఆరోగ్యం, నిద్ర, తిండి అన్నిటిమీదా ప్రభావం పడేది. నిజానికి ఇవన్నీ బ్యాలెన్స్ లో లేని కారణంగా తన పని కూడా effect అయ్యేది. ఇదంతా ఒక self help పుస్తకం మార్చేసింది. ‘జేమ్స్ క్లియర్’ రాసిన ‘atomic habits’. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎలాంటి అలవాట్లు మనల్ని సమూలంగా మార్చి, better person గా మార్చగలవు అనే విషయాలపై చాలా ఆసక్తికరంగా, ఆచరణయోగ్యమైన సూత్రాలు చెప్పారు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం వలన తను ఎంతగా improve అయ్యాడో చెప్తూ, ‘ఇలాంటి గొప్ప విషయాలు ఇంగ్లీషు రాని చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్న మన తెలుగు యువతకు చేరవేసే బాధ్యత నీపై లేదా మీనా?’ అని అడిగాడు.
కిరణ్ గారు ఇన్నాళ్ళూ చెప్తూ వస్తున్నది ఇదే. నిజానికి ఇది దాసుభాషితం లక్ష్యమే కాదు, కిరణ్ గారిలక్ష్యం కూడా. సమగ్ర శ్రేయస్సులో భాగంగా వృత్తి జీవితాన్ని మెరుగుపరచుకునే దారులు మారుమూల ప్రదేశాల్లో ఉన్న మన తెలుగు యువతకు చేరవేయడం. కానీ అప్పడు అర్ధం కానిది, పవన్ ఆ ప్రశ్న అడిగినప్పుడు అర్ధమైంది నాకు దాని అవసరం ఎంతటిదో. అక్కణ్ణుంచీ ఈ సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడంలో నా దృష్టి కోణమే మారిపోయింది. ఈ సాహిత్యం ఎందరి జీవితాన్ని నేరుగా, విస్పష్టంగా ప్రభావితం చేయగలదో, నా చేతిలో ఎంతటి పెద్ద బాధ్యత ఉందో అర్ధమైంది.
ఇంకో నిజం చెప్పనా, ఈ వారం, రెండు వారాల్లోనే procrastination, distractions at work లాంటి వ్యక్తిగత ఇబ్బందుల నుండి ఎలా బయటపడచ్చో ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా నేర్చుకున్న కొన్ని సూత్రలను అమలుపరిచాను. అందులో success అయ్యాను కూడా. మన పనిలో, సాధారణ జీవితంలో improvement వైపు అడుగులు వేస్తే వచ్చే ఆనందం, సంతృప్తి, తద్వారా productivityలో వచ్చే మార్పులు నా కళ్ళారా చూశాను. ఇప్పుడు నేను 100శాతం self help సాహిత్యం ప్రతీవారికీ పనికివచ్చి తీరుతుంది అని నమ్ముతున్నాను.

ఈ ప్రయాణంలో మొదటి అడుగుగా ప్రముఖ రచయిత, కౌముది వెబ్ పత్రిక నిర్వాహకులు కిరణ్ ప్రభ గారు వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిగత జీవితంలోనూ positive changes తెచ్చుకోవడం ఎలాగో వివరిస్తూ రాసిన కాలమ్ ‘కౌముది కిరణాలు’ ఈ వారం విడుదల చేస్తున్నాం. ఆయన గొంతులో, ఆయనకు స్వంతమైన విలక్షణమైన శైలిలో ఈ విషయాలను సోదాహరణలతో వివరించారు కిరణ్ ప్రభ గారు. ఎంతో విలువైన సూత్రాలు వీటిలో పొందుపరిచారు ఆయన. దాదాపు 7గంటల కాంటెంట్ ఇది. అందుకే రెండు భాగాలుగా చేసి, మొదటి భాగం ఈ వారం విడుదల చేస్తున్నాం. తప్పకుండా వినండి. రోజుకు ఒక సూత్రం పాటించగలిగినా చాలు, మన జీవితంలో గొప్ప మార్పులు మన కళ్ళారా మనమే చూడొచ్చు.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.