కొత్త దాసుభాషితం యాప్ విడుదల.

Meena Yogeshwar
December 23, 2023

2023 ఆరంభంలో యాప్ పునర్నిర్మించడానికి నిధులు సమకూర్చుకునేందుకు ₹7550 లకే జీవిత సభ్యత్వం ఆఫర్ చేశాము. 800 మంది తీసుకునేటప్పటికే మేము అనుకున్న ఆర్థిక లక్ష్యం అందుకున్నాము. అందుకే ఆ ఆఫర్ ను ముగించాము. మాట ప్రకారం మళ్ళీ పొడిగించలేదు.అయితే అప్పట్లో చాలా మంది అడిగారు. మళ్ళీ ఆఫర్ ఉంటే చెప్పమని. ఇపుడు కొత్త యాప్ విడుదలను పురస్కరించుకుని మళ్ళీ ఒక ఆఫర్ ను ఇస్తున్నాము. ఇప్పటి వరకు Subscriptions, Credits, One-time purchases ఇలా ఉన్నవాటిని సరళీకరించి, కేవలం ఒక్క ప్లాన్ మాత్రమే ఇపుడు అందిస్తున్నాము. అదే ...

దాసుభాషితం కొత్త యాప్ Play Store, App Store లకు సబ్మిట్ చేయబడింది.

కొన్ని రోజులలో కొత్త యాప్ లభ్యమవచ్చు. లభ్యమైనపుడు, మీది Android ఫోన్ అయితే, మీరు యాప్ తెరిస్తే, కొత్త యాప్ కు update అవ్వమని సందేశం కనపడుతుంది. iOS యాప్ వాడుకరులు మేము పంపే లింకు ద్వారా కొత్త యాప్ ను App Store నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త అంశాలు.

  • పూర్తిగా కొత్త UI. మెరుగైన కాంటెంట్ వర్గీకరణ.
  • యాప్, కాంటెంట్ మరింత వేగవంతంగా పనిచేయడం.

కొత్త Subscription ప్లాన్

ఇప్పటి వరకు Subscriptions, Credits, One-time purchases ఇలా ఉన్నవాటిని సరళీకరించి, కేవలం ఒక్క ప్లాన్ మాత్రమే ఇపుడు అందిస్తున్నాము. అదే సర్వజ్ఞ ప్లాన్.

ఈ ప్లాన్లో ఎంచుకున్న కాలపరిమితిలో (1, 3, 6, 12 నెలలు) దాసుభాషితం లో కాంటెంట్ అంతా వినవచ్చు. 12 నెలల చందా తీసుకుంటే, నెలసరి చందా కేవలం ₹ 299 అవుతుంది. అంటే, ఒక పుస్తకం ఖర్చుతోనే యాప్ లో కాంటెంట్ అంతా వినవచ్చు అన్న మాట.

కొత్త రీలాంచ్ ఆఫర్

2023 ఆరంభంలో యాప్ పునర్నిర్మించడానికి నిధులు సమకూర్చుకునేందుకు ₹7550 లకే జీవిత సభ్యత్వం ఆఫర్ చేశాము. 800 మంది తీసుకునేటప్పటికే మేము అనుకున్న ఆర్థిక లక్ష్యం అందుకున్నాము. అందుకే ఆ ఆఫర్ ను ముగించాము. మాట ప్రకారం మళ్ళీ పొడిగించలేదు.

అయితే అప్పట్లో చాలా మంది అడిగారు. మళ్ళీ ఆఫర్ ఉంటే చెప్పమని. ఇపుడు కొత్త యాప్ విడుదలను పురస్కరించుకుని మళ్ళీ ఒక ఆఫర్ ను ఇస్తున్నాము.

ఇపుడు కేవలం ₹14999 లకే జీవితకాల సభ్యత్వం పొందవచ్చు. అంటే ఒక్కసారి ఈ డబ్బు కట్టి, దాసుభాషితం లో ఉన్న, రాబోయే కాంటెంట్ అంతా మరెప్పుడూ ఇక డబ్బు కట్టకుండా, యాప్ జీవితకాలం వినవచ్చు.

ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే ఈ లింకు ద్వారా నమోదు చేసుకోండి. https://tally.so/r/wg95rN

ఒక రహస్యం. మీకు ఇప్పటికే జీవిత చందాదారులు ఎవరైనా తెలిస్తే, వారి పేరు Referred by అనే ఫీల్డ్ లో వ్రాయండి. మీకు జీవిత చందా ₹11999 లకే దొరుకుతుంది. తెలియకపోతే, Twitter లో #11999_referral #dasubhashitam అనే hashtags తో post పెట్టండి. జీవితకాల సభ్యులు స్పందిస్తారు.

పిల్లలు - బొమ్మలు - కథా సంపుటి

Tap to Listen

మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా..! అంటూ చిన్నపిల్లల ఆలోచనాధోరణిని వర్ణిస్తారు శ్రీశ్రీ ‘శైశవగీతం’ అనే కవితలో. ప్రకృతిలో వచ్చే ప్రతీ కదలికనీ నిశితంగా గమనిస్తూ, వాటిని ఆస్వాదిస్తూ, అవి తమను పలకరించడానికే వచ్చాయి అనుకుంటుంటారు పిల్లలు. తెల్లటి కాగితంలా ఉండే వాళ్ళ మనసు, చూసే ప్రతీదాన్నీ, వినే ప్రతీ విషయాన్నీ క్షణంలో పట్టుకుంటుంది. శాశ్వతంగా జీవితకాలానికి సరిపడా మనసులో ముద్రించుకుంటుంది.

అలాంటి కీలకమైన వయసులో కథలు వారి వికాసానికి బాటలు వేస్తాయి. చిన్నతనంలో కల్పనాశక్తి, సన్నివేశాన్ని ఊహించుకోగలగడం, చెప్పిన నీతిని ఆకళింపు చేసుకోగలగడం చాలా సులభం. ఆ సమయంలో సాహిత్యం వారి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు తాత పక్కన పడుకునో, అమ్మ కొంగు పట్టుకునో, నాన్నతో సైకిల్ తుడుస్తూనో విన్న కథలు ఈనాటికీ మనకి గుర్తే. చందమామ, బాలమిత్ర, tinkle, మాల్గుడి డేస్, కార్టున్లు మన ఊహాలోకాల్ని ఎలా తెరిచాయో, అందరికీ అనుభవమే.

ఆ పట్టికలో దాసుభాషితం కూడా చేరడం మా కల. అందుకే, ప్రముఖ రచయిత్రి, రిషీవ్యాలీ పాఠశాల తెలుగు ఉపాధ్యాయినీ శ్రీమతి రాధ మండువ గారు రచించిన ‘పిల్లలు - బొమ్మలు’ కథా సంపుటిని ఈ వారం విడుదల చేస్తున్నాం. సాధారణంగా, తమ స్కూలు పిల్లలను దృష్టిలో ఉంచుకుని రచనలు చేస్తుంటారు రాధ గారు. అందుకే, చిన్నపిల్లలకు కూడా సులువుగా అర్ధమయ్యే శైలిలో, ముచ్చటైన తెలుగులో ఈ కథలు రచించారు. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం, శోకం, శ్లేషార్ధాలూ ఏమీ ఎరుగుని పువ్వులు, దాసుభాషితం చిన్నారి శ్రోతల కోసం, చిన్నతనం ఇంకా గుండెలోనే పదిలంగా ఉన్న పెద్దవారి కోసమే ఈ కథా సంపుటి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్. 

Image Courtesy :