లెజెండరీ వేటూరి, ప్రతిభా మూర్తి డా. మృణాళిని, ఇంకొన్ని విషయాలు.

Kiran Kumar
April 24, 2020

డా. సి. మృణాళిని గారి గురించి తెలియని సాహిత్యాభిలాషులు ఉండరు. రచయిత్రిగా, విమర్శకురాలిగా, తెలుగు ఆచార్యులుగా ఆమె అమిత ప్రతిభావంతురాలు. తెలుగు మాధుర్యాన్ని ఎవరికైనా పరిచయం చేయాలంటే ఆమె మాటలను వినాలి. ఆమె ప్రజ్ఞ స్పృశించని ప్రసార మాధ్యమం లేదు.

డా. సి. మృణాళిని గారి గురించి తెలియని సాహిత్యాభిలాషులు ఉండరు. రచయిత్రిగా, విమర్శకురాలిగా, తెలుగు ఆచార్యులుగా ఆమె అమిత ప్రతిభావంతురాలు. తెలుగు మాధుర్యాన్ని ఎవరికైనా పరిచయం చేయాలంటే ఆమె మాటలను వినాలి. ఆమె ప్రజ్ఞ స్పృశించని ప్రసార మాధ్యమం లేదు. పత్రిక, టీవీ, రేడియోలలో ఆమె నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఒక గోల్డ్ స్టాండర్డ్.

ఆమె ముఖాముఖీ చేసిందంటే, చేయించుకున్నవారికి ఒక గౌరవం, వింటున్నవారికి శ్రవణానందం. ఆ సంభాషణల నాణ్యత అటువంటిది. అందుకనే ఎందఱో మహానుభావులు ఆమెతో ముఖాముఖీకి వెంటనే ఒప్పుకుంటారు. అలా తాను పూర్వం రూపొందించిన కార్యక్రమాలను, మా కోరిక మేరకు దాసుభాషితం శ్రోతల కోసం అందిస్తున్నారు.

అందులో మొదటగా, శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారితో ఆయన పుట్టినరోజున ఆమె రికార్డు చేసిన ముఖాముఖీ మీకు ఈ వారం అందిస్తున్నాము. సందర్భం కూడా ఉచితమైనదే. ఆయన రచించిన ఏకైక నవల 'జీవన రాగం' శ్రవణ రూపం మీ యాప్ లో ఈ వారం విడులైంది. ఇలా రెండిటిని విడుదల చేయడం మాకు ఆనందకరం. మీరూ ఆయన చెప్పిన విశేషాలు విని బాగా నవ్వుకుంటారు. వినటానికి ఈ క్రింది బొమ్మను టాప్ చేయండి.
     

శ్రీ వేటూరి తో ముఖాముఖీ
     

జీవన రాగం నవల గురించి 

Jeevana Raagam
Jeevana Raagam

తెలుగు సినీ సాహిత్యాన్ని మూడు దశాబ్దాల పాటు ఏలినవాడు తన ఇరవైమూడవ ఏట ఆలపించిన ఏకైక ‘నవలా’ రాగం అది. దీన్లోని కథ విషయానికి వస్తే రఘు పేరు మోసిన సంగీత దర్శకుడు. విపరీతమైన పని వత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తను అభిమానించే, తనని ఆరాధించే గాయని రాగిణి సూచన మేరకు, విశ్రాంతి కోసం నాగార్జునకొండ సమీపం లోని అటవీ ప్రాంతానికి వెళతాడు. ఒకరోజు ఆ కొండకోనల్లో సంచరిస్తూ ఉండగా దారి తప్పుతాడు. అప్పుడు సుగాలీ జాతి బృందం ఒకటి తారస పడుతుంది. ఆ బృంద నాయకుడి ఆదేశం మేరకు రాజులు అనే యువకుడు వెంట రాగా గూడేనికి చేరుకుంటాడు. ఆ ప్రయాణంలో రాజులు మీద రఘుకు అభిమానం ఏర్పడుతుంది. 

గూడెం వాసులలో నాయకుని కూతురు రజని రఘు మనసు దోచుకుంటుంది. అయితే అప్పటికే ఆమె, రాజులు ప్రేయసీ ప్రియులు. ఇది తెలియని రఘు రజనితో కొద్దిగా శృతి మించుతాడు. ఈ విషయం గూడెం నాయకుడికి తెలుస్తుంది. అసలే నియమాల విషయంలో కఠినంగా ఉండే నాయకుడు, అప్పుడేం చేశాడు. మధురాతి మధురమైన భావనలతో రచయిత ఈ కధకి, ఇచ్చిన మనోహరమైన ఆ ముగింపు ఏమిటి? వినండి. జీవనరాగం - నవల.

ఈ నవల లాక్‌డౌన్ సమయం వరకే అందరికీ ఉచితం. తర్వాత వినటానికి రుసుము చెల్లించ వలసి ఉంటుంది (మీరు మహారాజ పోషకులు అయితే తప్ప). 

శ్రీ రామకృష్ణ కథామృతం 9వ సంపుటం కూడా ఈ వారం విడుదలైంది.

Sri Ramakrishna Kathamrutam
Sri Ramakrishna Kathamrutam Vol 9

 

ఈ సంపుటం లో, వైద్య నిమిత్తం దక్షిణేశ్వరం నుండి శ్యాంపుకూరుకు నివాసం మార్పు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, వ్యాధి నివారణకు సిద్ధుల నిమిత్తం ప్రార్ధించమని హృదయ్ సలహా - నరేంద్రుడు, డాక్టర్ సర్కార్, మహిమా తదితరులతో అహంకారం, లోక శిక్షణ తదితర అంశాలమీద 48-49 అధ్యాయాలలో శ్రీరామకృష్ణుల లోతైన సంభాషణ మనం వింటాం.

 

వచ్చేవారం విడుదలలు ఇవి. 

 

– ఆకాశమంత కథా సంపుటి 

– శ్రీ రామకృష్ణ కథామృతం 10వ (ఆఖరి) సంపుటం

– శ్రీ దాసరి నారాయణరావు గారితో ముఖాముఖీ