ఒక దుర్ఘటన. దాని ప్రభావం. దిద్దుబాటు చర్యలు.

Dasu Kiran
January 13, 2022

కొన్ని రోజులుగా యాప్ పనిచేయకపోవడం మీకు తెలుసు. సాంకేతిక చికాకులున్న ఉన్న ప్రస్తుత యాప్ స్థానే కొత్త యాప్ ను ఇంకా కొన్ని వారాల్లో విడుదల చేస్తామనంగా, ఒక సంఘటన జరిగింది.

Read more

#41 దాసుభాషితం 2.0 ఒక కారాంజి.

Dasu Kiran
August 26, 2021

దాసుభాషితం నూతన చిహ్నం (లోగో) ఆవిష్కరణ, కథ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం… ఇలా మొదలవుతుంది బిల్వాష్టకం. శివుడి లోనే కాదు, ఈ సృష్టిలో మనకి ఎక్కడ చూసిన త్రయత్వం కనిపిస్తుంది. మూడు ప్రాథమిక రంగులు – ఎరుపు, ఆకుపచ్చ, నీలం మూడు అవస్థలు – జాగృత, స్వప్న, సుషుప్తి మూడు కాలాలు – భూత, వర్తమాన, భవిష్యత్తు మూడు గుణాలు – సత్వం, రజస్సు, తమస్సు మూడు సమయాలు – పగలు, రాత్రి, సంధ్య/వేకువజాము మూడు శరీరాలు – స్థూల, సూక్ష్మ, కారణ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా కనిపిస్తాయి మనకు.

Read more

#40 చరిత్ర సృష్టించిన చారిత్రిక నవల - పొన్నియిన్ సెల్వన్

Meena Yogeshwar
August 26, 2021

పొన్నియిన్ సెల్వన్ తొలి తెలుగు అనువాదాన్ని శ్రవణ పుస్తకంగా విడుదల చేస్తున్న సందర్భంగా. ఈ భూమి నాది అని ప్రతివారూ అనుకుంటారు. తాను కొన్నాడు కాబట్టి తనది అనుకుంటాడు ఒకడు. తాను పాలించాడు కాబట్టి తనది అనుకుంటాడు మరొకడు. ఈ భూమిలో పుట్టి, ఈ భూమిని ఏలి, తిరిగి ఈ భూమిలోనే కలిసిపోతారు. కానీ ఈ భూమి ఎవడిదీ కాదు. తన మోహ మాయ ఉపయోగించి, ప్రతివాడినీ ఇది నాదీ అనుకోవడం కోసం కొన్నాళ్ళు ఒకరి కింద ఉన్నట్టు నటిస్తుంది ఈ భూమి. వాడి సమయం అయిపోగానే మెల్లిగా తన కడుపులోకి తిరిగి కలిపేసుకుంటుంది.

Read more