
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ కలం వీరులకు నివాళి. తన తల్లి వినతిని దాస్యం నుండి విముక్తి చేయడానికి గరుత్మంతుడు కష్టపడినట్టు, తమ మాతృభూమిని పరాయి పాలన నుండి రక్షించడానికి ఈ భరత మాత ముద్దు బిడ్డలు ఎందరో పోరాడారు. కొందరు ఆయుధాలతో, కొందరు అహింసా మార్గంలో, మరికొందరు వీరికి స్ఫూర్తిని రగింలించేలా తమ కలాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ కవి యోధులను స్మరించుకుందాం.
Read more
సినీ వట వృక్షానికి విత్తనం సాహిత్యం. 'అతడు నవ్వడు'. ఇది రాక్షసుడు నవలలో కథానాయకుడిని వర్ణిస్తూ యండమూరి వీరేంద్రనాధ్ గారు చెప్పిన వాక్యం. అది చదివిన వెంటనే పాఠకుడు ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటాడు. తనకు తెలిసిన కళ్ళు, ముక్కు, పెదాలను ఒక చోట పెట్టి, వాటిని ఒక మొహానికి అతికించి, అతడు నవ్వనట్టుగా ఉండే ఆ చిత్రాన్ని తన మస్తిష్కంలో చిత్రించుకుంటాడు. ఆ నవలను అదే పేరుతో చిరంజీవి హీరోగా సినిమా తీశారు దర్శకుడు కోదండరామిరెడ్డి. తెర మీద ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు. చిరంజీవి ముఖం ఈ సన్నివేశాన్ని మనకు చెప్పేస్తుంది.
Read more
ట్విట్టర్ లో జరిగిన చర్చ (రచ్చ?) నేపధ్యం లో. 'అమ్మ' ఏ భాషకి చెందిన పదం? అదేమి ప్రశ్న తెలుగే కదా అని అంటాం కదా. కానీ కాదు. అమ్మ అనే పదం ప్రాకృత భాషా కుటుంబానికి చెందిన 'పాళీ' అనే భాష నుండి తెలుగులోకి వచ్చింది. అలాగే తండ్రికి తత్సమమైన 'అయ్య' అనే పదం కూడా పాళీ నుండి తెచ్చుకున్నదే. చాలామంది భాషావేత్తలు వేరే భాషల నుండి వచ్చిన పదాలని ఏరివేసి, అచ్చతెలుగు పదాలను మాత్రమే వాడాలి అని అంటే అది సబబు కాదు. ఎందుకంటే అప్పుడు అమ్మ, అయ్యలను కూడా వదిలేసుకోవాలిగా.
Read more